Migraine Pain: మైగ్రేన్ అనేది సాధారణ ఒకవైపున గుచ్చుకున్నట్టు, కొట్టుకున్నట్టు ఒక రకమైన బాధను కలిగిస్తూ వచ్చే తలనొప్పి. ఏదైనా కాంతిని చూసినా, శబ్దాన్ని విన్నా భరించలేని సున్నితత్వంతో కూడిన తలనొప్పి. వికారం, వాంతులు, చేతులు, కాళ్లలో జలదరింపు, కళ్లు ఎర్రబడడం, కళ్లల్లో నీళ్లు రావడం, మాట్లాడలేకపోవడం, చెవులలో శబ్ధాలు రావడం వంటి లక్షణాలతో కూడినటువంటి తలనొప్పి.
మైగ్రేన్‌కి కారణాలు
మైగ్రేన్ రావడానికి ఖచ్చితమైన కారణం తెలియదు, కానీ భావద్వేగమైన ఒత్తిడి మరియు ఆందోళన వంటి వాటి వల్ల కూడా వస్తుందని అంటున్నారు. నీరు ఎక్కువగా తాగకున్న బాడీ డీహ్రేషన్ వల్ల కూడా మైగ్రేన్ వస్తుంది. అలాగే చల్లటి పానీయాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఎక్కువగా ప్రయాణాలు చేయడం, తీవ్రమైన శారీరక శ్రమ ద్వారా రావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్త్రీలలో హార్మోన్ల సమస్యలు ఏర్పడినప్పుడు, పీరియడ్స్ ముందు లేదా తర్వాత కూడా మైగ్రేన్ రావొచ్చు. కొంతమందికి ఎక్కువగా ధూమపానం మరియు మద్యపానం సేవించడం వల్ల వస్తుంది, మరికొంతమందికి అధిక వెలుగు, అధిక శబ్ధాల తీవ్రత వల్ల వస్తుందని భావిస్తారు.. అలాగే మెడ లేదా వెన్నెముక సమస్యల నుంచి కొన్నిసార్లు నిరాశ, ఆందోళన, లేదా నిద్ర రుగ్మతలు వంటి ఇతర పరిస్థితుల వల్ల కూడా మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంటుంది.
నివారణ చర్యలు
మానసిక ఆందోళనలు తగ్గించుకోవడం, శరీరానికి సరిపడా నీళ్ల తాగడం, మైగ్రేన్ ఉన్న వాళ్లు చీజ్, నట్స్, ధూమపానం, మద్యపానంకు దూరంగా ఉండాలని చెప్తున్నారు. సరైన సమాయానికి ఆహారం తీసుకోవడం మరియు నిద్రపోవడం చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం
ఎండలోకి వెళ్తే కూలింగ్ గ్లాసెస్, క్యాప్, గొడుగు వంటివి తీసుకెళ్లాలి. గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం మరియు యోగా, మెడిటేషన్ వంటి చేయడం, తలనొప్పి వచ్చినప్పుడు ప్రశాంత వాతావరణంలో, కాంతి లేనిచోట నిశ్శబ్దంగా ఉన్నచోట విశ్రాంతి తీసుకోవాలి. అలాగే తాజా పండ్లు మరియు కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ.. ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, అధిక చక్కెర, కెఫిన్ ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలంటున్నారు వైద్యులు.
Also Read: సమ్మర్‌లో వచ్చే ఆరోగ్య సమస్యలు, వాటి నివారణ మార్గాలు ఇవే !
ముఖ్యంగా లినోలెయిక్ యాసిడ్ అనే పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ తక్కువగా ఉండే నూనెలను వాడడం, మైగ్రేన్‌తో బాధపడేవారు ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కీటోజెనిక్ డైట్, మాడిఫైడ్ అట్కిన్స్ డైట్‌ను పాటించడం మంచిది. కొద్దిగా కెఫీన్ కలిగి ఉన్న కప్పు కాఫీ లేదా టీ వంటి వాటిని తీసుకోవడం వల్ల కూడా మైగ్రేన్ నొప్పిని తగ్గించడానికి దోహదం చేస్తుంది.మైగ్రేన్ తలనొప్పి అతిగా వస్తుంటే మీ డాక్టర్లను సంప్రదించి, సరైన చికిత్స తీసుకోండి. ప్రతీరోజూ ఒకే సమయంలో నిద్ర పోవడం ఓకే సమయంలో నిద్ర లేవడం అలవాటు చేసుకోండి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.