Puri Jagannadh New Movie :కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ పై పూరి నిర్మాణ సంస్థ అధికారక ప్రకటన కూడా ఇచ్చింది. దీంతో ఈ సినిమాపై ఇప్పటికే చాలా హైప్ నెలకొనగా నటీనటులు ఎవరిని సెలెక్ట్ చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆయన తీసే ప్రతి సినిమా లో హీరోని ఊర మాస్ గా చూపించడం తెలిసిందే. ఇప్పుడు విజయ్ సేతుపతి తో రాబోతున్న సినిమాలో ఒక కీలక పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ ని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం..
టబు తో పూరీ డిస్కషన్స్..
ఈ సినిమాలో ఒకే ఒక పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్, టాలీవుడ్ సినియర్ నటి టబు ని మూవీ టీం సంప్రదించినట్టు తెలుస్తోంది. 53 సంవత్సరాల వయసు దాటినా ఈ స్టార్ హీరోయిన్ ఇప్పటికీ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అప్పటిలో ఈ బ్యూటీ అక్కినేని నాగార్జునతో ఎక్కువ సినిమాలు చేసి సూపర్ హిట్ కాంబో గా నిలిచారు. నిన్నే పెళ్లాడతా, ఆవిడ మా ఆవిడ, సిసింద్రీ ఇలా ప్రతి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత బాలీవుడ్ లోనే సెటిల్ అయింది టబు. చాలా రోజుల తర్వాత అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురంలో తల్లి పాత్రలో కనిపించింది. ఆ సినిమాతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చింది టబు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు మళ్లీ విజయ్ సేతుపతి సినిమాలో ఒక కీలక రోల్ లో టబు ని తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. పూరి జగన్నాథ్ టీం ఈ సినిమా కోసం టబు ని సంప్రదించినట్లు తెలుస్తుంది. ఫైనల్ డిస్కషన్ జరుగుతుందని తాజాగా ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా ఉన్నారని సమాచారం. ఆమె పాత్ర నెగిటివ్ షేడ్ లో వుంటుందని సమాచారం. అందుకని ఆలోచిస్తున్నారని టాక్. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అన్ని కాదని పూరీకి ఒకే చెప్పిన విజయ్..
ఈ మూవీ షూటింగ్ మే నెలలో ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ సేతుపతి మహారాజా సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్నారు. తెలుగులో చిరంజీవి ‘సైరా’ సినిమా లో అతిధి పాత్ర లో చేసారు. తరువాత వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ లో నటించారు. ఆ తరువాత తెలుగు లో విజయ్ ఏ మూవీ చేయలేదు. చాలామంది దర్శకులు స్టోరీ విన్నారు. పూరి జగన్నాథ్ కే ఓకే చేసినట్లు సమాచారం. పూరి జగన్నాథ్ హీరో రామ్ తో చేసిన డబల్ ఇస్మార్ట్ మూవీ తో సక్సెస్ ని అందుకున్నారు. సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టీవ్ గా వుంటారు. సినిమా అనే కాదు అయన డైలీ కొటేషన్స్ తో యూత్ కి దగ్గరగా వుంటారు. వీరు ఇద్దరూ కలిసి చాల రోజుల తరువాత చేస్తున్న ప్రాజెక్టు కావడంపై సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది ..
#GulteExclusive:#Tabu is in talks for #PuriJagannadh and #VijaySethupathi's film. pic.twitter.com/NQ0wvDm2xK
— Gulte (@GulteOfficial) April 6, 2025