Potato Hair Mask: బంగాళదుంప ముఖ సౌందర్యంతో పాటు జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. విటమిన్ బి, సి, ఐరన్ అధికంగా ఉండే బంగాళదుంపలు జుట్టుకు పోషణను అందించడంలో, జుట్టు మూలాలను బలోపేతం చేయడంలో, జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడతాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న బంగాళదుంప హెయిర్ మాస్క్‌లను ఎలా తయారు చేసుకుని ఉపయోగించాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బంగాళదుంప, ఉల్లిపాయ, తేనె హెయిర్ మాస్క్:
కావాల్సిన పదార్థాలు:
బంగాళదుంప- 1 మీడియం సైజు
ఉల్లిపాయ- 1
తేనె- 1 టేబుల్ స్పూన్
ఎలా తయారు చేయాలి ?
బంగాళదుంప, ఉల్లిపాయ రెండింటి నుండి జ్యూస్ తీయండి. దీనిని తేనెతో కలిపి వాడండి. ఇప్పుడు ఈ హెయిర్ మాస్క్‌ను మీ తలకు, జుట్టుకు అప్లై చేయండి. 30 నిమిషాలు అలాగే ఉంచి.. ఆపై షాంపూతో వాష్ చేయండి.
బంగాళదుంప, కలబంద మాస్క్:
ఈ హెయిర్ ప్యాక్ జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఇది తలకు ఉపశమనం కలిగిస్తుంది. జుట్టుకు మెరుపును కూడా అందిస్తుంది.
కావాల్సిన పదార్థాలు:
బంగాళదుంప- 1 మీడియం సైజు
అలోవెరా జెల్- 2 టేబుల్ స్పూన్లు
ఎలా తయారు చేయాలి ?
బంగాళదుంపలను తురిమిన తర్వాత.. వాటిని వడకట్టి, వాటి జ్యూస్ తీయండి. ఇప్పుడు ఈ రసాన్ని అలోవెరా జెల్ తో కలపండి. ఈ మిశ్రమాన్ని మీ తలకు, జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత తేలికపాటి షాంపూతో కడగాలి.
బంగాళదుంప, గుడ్డు మాస్క్:
ఈ హెయిర్ మాస్క్ జుట్టును బలపరుస్తుంది. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది. దీనిని తరచుగా వాడటం వల్ల జుట్టు సాంద్రత కూడా పెరుగుతుంది.
కావాల్సిన పదార్థాలు:
బంగాళదుంప- 1 మీడియం సైజు
ఎగ్- పచ్చసొన
తేనె- 1 టేబుల్ స్పూన్
ఎలా తయారు చేయాలి ?
బంగాళదుంప నుండి జ్యూస్ తీసి, ఎగ్ పచ్చసొన, తేనెతో కలపండి. ఇప్పుడు ఈ మాస్క్‌ను మీ తల, జుట్టు మీద సమానంగా అప్లై చేయండి. 30-40 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై తేలికపాటి షాంపూతో కడిగేయండి.
బంగాళదుంప, పెరుగు మాస్క్:
ఈ బంగాళదుంప హెయిర్ మాస్క్ జుట్టుకు పోషణనిస్తుంది. అంతే కాకుండా చుండ్రును తగ్గిస్తుంది. దీనిని వాడటం వల్ల జుట్టు కూడా మృదువుగా మారుతుంది.
కావాల్సిన పదార్థాలు:
బంగాళదుంప- 1
పెరుగు- 2 టేబుల్ స్పూన్లు
ఎలా తయారు చేయాలి ?
బంగాళదుంప నుండి జ్యూస్ తీసి పెరుగుతో కలపండి. ఈ మిశ్రమం తయారైన తర్వాత.. దానిని మీ తలపై 25 నుండి 30 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత షాంపూతో వాష్ చేయండి.
బంగాళదుంప, కొబ్బరి నూనె హెయిర్ మాస్క్:
ఈ హెయిర్ మాస్క్ జుట్టు పొడిబారడాన్ని తొలగిస్తుంది. జుట్టు యొక్క స్థితిస్థాపకతను పెంచుతుంది. దానిని లోతుగా కండిషనింగ్ చేస్తుంది.
Also Read: నిమ్మకాయ, రోజ్ వాటర్‌తో గ్లోయింగ్ స్కిన్.. రిజల్ట్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు
కావాల్సిన పదార్థాలు:
బంగాళదుంప- 1 మీడియం సైజు
కొబ్బరి నూనె- 1 టేబుల్ స్పూన్
ఎలా తయారు చేయాలి ?
బంగాళదుంప రసం తీసి కొబ్బరి నూనెతో కలపండి. ఈ మిశ్రమంతో మీ తల, జుట్టును మసాజ్ చేయండి. 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీరు, షాంపూతో శుభ్రం చేసుకోండి.