Lemon and Rose Water: అందంగా ఉండటానికి చాలా మంది రకరకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. కానీ గ్లోయింగ్ స్కిన్ కోసం ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ వాడటం అవసరం లేదు. వంటగదిలో ఉండే కొన్ని సాధారణ పదార్థాలు కూడా మీ చర్మానికి సహజమైన మెరుపును ఇస్తాయి. వాటిలో నిమ్మకాయ, రోజ్ వాటర్ ముఖ్యమైనవి. ఇవి ముఖాన్ని లోతుగా శుభ్రపరుస్తాయి. అంతే కాకుండా చర్మాన్ని తాజాగా , ఆరోగ్యంగా మారుస్తాయి.
నిమ్మకాయలోని విటమిన్ సి చర్మాన్ని శుభ్రం చేయడంలో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా రోజ్ వాటర్ చర్మాన్ని ప్రశాంతపరచడానికి, తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ రెండింటినీ కలిపి వాడటం వల్ల మచ్చలు, టానింగ్, మొటిమలు, జిడ్డుగల చర్మం వంటి అనేక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
నిమ్మకాయ, రోజ్ వాటర్‌లను ఎలా ఉపయోగించాలి ?
చర్మాన్ని టోన్ చేయడానికి సహజ టోనర్:
ఒక టీస్పూన్ రోజ్ వాటర్‌లో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి, దూది సహాయంతో ముఖానికి అప్లై చేయాలి. ఈ టోనర్ చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా ముఖంపై తెరిచి ఉన్న రంధ్రాలను బిగుతుగా చేస్తుంది. క్రమం తప్పకుండా దీనిని వాడటం వల్ల, చర్మం యొక్క రంగు మెరుగుపడుతుంది. అంతే కాకుండా చర్మం కూడా తాజాగా అనిపిస్తుంది.
నిమ్మకాయలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మొటిమలను తగ్గించడంలో , బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడతాయి. రోజ్ వాటర్ చర్మాన్ని చికాకు నుండి రక్షిస్తుంది. రెండింటినీ కలిపి ముఖంపై మొటిమలు ఉన్న చోట అప్లై చేయడం వల్ల క్రమంగా సమస్య దూరం అవుతుంది. అంతే కాకుండా చర్మం తెల్గా మరిసిపోతుంది.
నల్ల మచ్చలను తొలగించడానికి మాస్క్:
ఒక చెంచా శనగపిండిలో నిమ్మరసం, రోజ్ వాటర్ కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేయండి. ఈ ప్యాక్‌ని ముఖంపై 15 నిమిషాలు అప్లై చేసి, తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది నల్లటి మచ్చలు, సన్ టాన్ , ముఖంపై రంగును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీనిని వారానికి రెండుసార్లు ఉపయోగించిన తర్వాత ఫలితాలు కనిపించడం ప్రారంభిస్తాయి.
Also Read: హోం మేడ్ హెయిర్ కలర్.. ఇది వాడితే తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం
జిడ్డు చర్మాన్ని తొలగించే మార్గాలు:
మీ చర్మం జిడ్డుగా ఉంటే నిమ్మకాయ, రోజ్ వాటర్ ఇందుకు ఉత్తమ పరిష్కారం. రెండింటినీ సమాన పరిమాణంలో కలిపి రోజుకు ఒకసారి ముఖంపై అప్లై చేయండి. ఇది చర్మం నుండి అదనపు నూనెను గ్రహిస్తుంది. అంతే కాకుండా చర్మానికి మ్యాట్ ఫినిషింగ్ ఇస్తుంది. ఇది మొటిమలు పెరిగే అవకాశాలను కూడా తగ్గిస్తుంది.
చర్మాన్ని తాజాగా ఉంచే స్ప్రే:
ఒక స్ప్రే బాటిల్‌లో కాస్త రోజ్ వాటర్, కొన్ని చుక్కల నిమ్మరసం నింపండి. దీనిని రోజుకు 2-3 సార్లు ముఖంపై స్ప్రే చేయండి. ఇది ముఖానికి తక్షణ తాజాదనాన్ని ఇస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని హైడ్రేట్‌గా కూడా ఉంచుతుంది. ముఖానికి మెరుపును కూడా తెస్తుంది. ఈ స్ప్రే చర్మానికి చాలా ఉపశమనం కలిగిస్తుంది.