BigTV English

Prawns Biryani: దసరాకి రొయ్యల బిర్యానీ ట్రై చేయండి, ఇలా వండితే సులువుగా ఉంటుంది

Prawns Biryani: దసరాకి రొయ్యల బిర్యానీ ట్రై చేయండి, ఇలా వండితే సులువుగా ఉంటుంది

రొయ్యల బిర్యానీ అన్నిటితో పోలిస్తే కాస్త భిన్నం. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఎక్కడైనా సులువుగా వండేస్తారు. రొయ్యల బిర్యానీ వండడానికి మాత్రం కాస్త ఆలోచిస్తారు. నిజానికి చికెన్ బిర్యాని, మటన్ బిర్యానీ కన్నా రొయ్యల బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. అంతేకాదు మిగతావాటితో పోలిస్తే రొయ్యలు బిర్యానీ వండడం కూడా చాలా సులువు. మంచి సువాసనతో టేస్టీగా దీన్ని వండవచ్చు. బాస్మతి బియ్యంతో ఈ రొయ్యల బిర్యానీ ప్రయత్నించండి. రెసిపి ఎలాగో తెలుసుకోండి.


రొయ్యల బిర్యానీ రెసిపీకి కావలసిన పదార్థాలు
బాస్మతి బియ్యం – రెండు కప్పులు
రొయ్యలు – అరకిలో
టమాటో – ఒకటి
ఉల్లిపాయలు – రెండు
అల్లం వెల్లుల్లి పేస్టు – రెండు స్పూన్లు
పచ్చిమిర్చి – మూడు
పుదీనా తరుగు – రెండు స్పూన్లు
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
ధనియాల పొడి – ఒక స్పూను
కారం – ఒక స్పూను
పసుపు – అర స్పూను
గరం మసాలా – ఒక స్పూను
బిర్యానీ మసాలా – ఒక స్పూను
బిర్యానీ ఆకులు – రెండు
ఉప్పు – రుచికి సరిపడా
దాల్చిన చెక్క – చిన్న ముక్క
లవంగాలు – నాలుగు
అనాస పువ్వు – ఒకటి
షాజీరా – ఒక స్పూను
జాజికాయ – చిన్న ముక్క

రొయ్యల బిర్యానీ రెసిపీ
1. బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి ముందుగానే నీటిలో నానబెట్టుకోవాలి. అరగంట పాటు ఇవి నానితే చాలు.
2. అరగంట పాటు నానాక ఒక గిన్నెలో ఈ బియ్యము, నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ నూనె, లవంగాలు, దాల్చిన చెక్క, జాజికాయ, షాజీరా, అనాసపువ్వు వేసి 70 శాతం అన్నాన్ని ఉడికించుకోవాలి.
3. ఆ ఉడికిన అన్నాన్ని ముద్ద కాకుండా పొడిపొడిగా వచ్చేలా ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి.
4.ఇప్పుడు స్టవ్ మీద బిర్యాని వండేందుకు పెద్ద గిన్నెను పెట్టాలి. అందులో నూనెను వేయాలి.
5. ఆ నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి రంగు మారేవరకు వేయించాలి.
6. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి.
7. ఇవన్నీ ఫ్రై అయ్యాక రొయ్యలను వేసి వేయించాలి. ఐదు నిమిషాల పాటు రొయ్యల్ని వేయించాక.
8. పసుపు, ధనియాల పొడి, కారం, గరం మసాలా, చిటికెడు ఉప్పు, బిర్యానీ మసాలా కూడా వేసి వేయించాలి.
9. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర, టమాటా ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి.
10. బిర్యానీ ఆకులను కూడా వేయాలి. పైన మూత పెట్టి రొయ్యలు మగ్గేలా చేయాలి.
11. ఇప్పుడు మూత తీసి దానిపై ముందుగా ఉడికిన బిర్యాని రైస్ ను పొరలు పొరలుగా వేసుకోవాలి.
12. తర్వాత మూత పెట్టి ఆవిరి బయటికి పోకుండా పైన బరువు పెట్టుకోవాలి.
13. దీన్ని చిన్న మంట మీద 20 నిమిషాలు ఉడికించాలి.
14. ఆ తర్వాత మూత తీస్తే టేస్టీ రొయ్యల బిర్యానీ రెడీ అయిపోతుంది.
15. ఇది చాలా రుచిగా ఉంటుంది. రొయ్యలు ఆరోగ్యానికి కూడా మంచివే.
16. కాబట్టి రొయ్యల బిర్యానీ కూడా ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది.


Also Read: నోరూరించే చికెన్ లాలీపాప్‌లు, పిల్లలకు ఇలా ఇంట్లోనే చేసి పెట్టేయండి, రెసిపీ ఇదిగో

ఎప్పుడు చికెన్ మటన్ బిర్యానీలే కాదు అప్పుడప్పుడు రొయ్యల బిర్యానీ కూడా ట్రై చేయండి. ఇది డిఫరెంట్ రుచిని అందిస్తుంది. తినాలన్న కోరికను పెంచుతుంది ముఖ్యంగా చికెన్ మటన్ తో పోలిస్తే రొయ్యలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది తినడం వల్ల బరువు కూడా పెరగరు. అప్పుడప్పుడు రొయ్యలను ఆహారంలో భాగం చేసుకుంటే మేలు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×