BigTV English

Panic attack: పానిక్ అటాక్‌ చాలా డేంజర్.. దీని నుంచి తప్పించుకోండిలా

Panic attack: పానిక్ అటాక్‌ చాలా డేంజర్.. దీని నుంచి తప్పించుకోండిలా

Panic attack: కొందరు చిన్న విషయానికి కూడా చాలా కంగారు పడిపోతారు. తీవ్రమైన ఆందోళన చెందుతారు. ఏదైనా సీరియస్ సందర్భంలో ఇలా కంగారుపడే వారు ఉన్నారంటే కనీసం ఊపిరి కూడా పీల్చుకోలేరు. తెగ భయపడిపోయి హడావుడి చేసేస్తారు. దీంతో తీవ్రమైన ఆందోళన పెరిగిపోతుంది. ఫలితంగా హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఊపిరి ఆడకపోవడం, మైకం రావడం వంటివి జరుగుతాయి. కాంగారులో కాళ్లు, చేతులు వణికిపోతాయి. దీన్నే పానిక్ అటాక్ అంటారట.


అకస్మాత్తుగా భయం లేదా అసౌకర్యం కలిగినప్పుడు పానిక్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పానిక్ అటాక్ వల్ల కొందరిలో పానిక్ డిజార్డర్ కూడా రావొచ్చని అంటున్నారు. దీని వల్ల చాలా మందికి విపరీతమైన ఒత్తిడి, నిద్రలేమి, డిప్రెషన్ వంటివి వచ్చే అవకాశం ఉందట.

పానిక్ అటాక్ లక్షణాలు..
పానిక్ అటాక్‌తో ఇబ్బంది పడుతున్న వారిలో అందరికీ ఒకేరకమైన లక్షణాలు ఉండకపోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటికే ఈ సమస్య ఉన్న వారిలో ఆందోళన, గుండె దడ, పొత్తికడుపు తిమ్మిరి, ఊపిరి ఆడకపోవడం, వణుకు, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉందని అరోగ్య నిపుణులు చెబుతున్నారు.


పానిక్ అటాక్ డిజార్డర్‌తో ఇబ్బంది పడుతున్నవారు మానసికంగా చాలా వీక్‌గా ఉంటారట. వీరు తరచుగా ఒత్తిడికి గురవుతారు. చాలా సార్లు చచ్చిపోతాననే భయం వీరిని వెంటాడుతుందట.

పానిక్ అటాక్ ఎందుకు వస్తుంది..?
పానిక్ అటాక్ రావడానికి కారణం ఇదే అని ఇప్పటి వరకు డాక్టర్లు కూడా ఏం చెప్పలేదు. అయితే ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారి మెంటల్ హెల్త్, చుట్టు ఉండే వాతావరణం కూడా దీని కారణం కావొచ్చని భావిస్తున్నారు.

యాక్సిడెంట్స్ లేదా బాధ కలిగించే సంఘటనల వల్ల వచ్చే ట్రామా కూడా పానిక్ అటాక్ రావడానికి కారణం కావొచ్చు. కొందరిలో ఫోబియా వల్ల కూడా ఇలా జరిగే ఛాన్స్ ఉందట.

ఒత్తిడి వల్ల కొందరికి పానిక్ అటాక్ వస్తే కుటుంబ సభ్యులలో ఎవరికనా పానిక్ డిజార్డర్ ఉంటే ఇంకొందరికి ఈ సమస్య వస్తుంది. మరికొందరిలో మద్యం, స్మోకింగ్ వంటి అలవాట్ల వల్ల కూడా పానిక్ అటాక్ వచ్చే అవకాశం ఉందని థెరపిస్ట్‌లు చెబుతున్నారు.

బయట పడడం ఎలా..
జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల కూడా పానిక్ అటాక్ సమస్య నుంచి బయట పడొచ్చని మానసిక వైద్యులు చెబుతున్నారు. ఒత్తిడి వల్ల ఎక్కువ మంది ఈ సమస్యతో ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉన్నాయి. దీన్ని తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా లేదా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకుంటే మంచిది.

స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకోడం వంటివి తగ్గించడం వల్ల కూడా పానిక్ అటాక్ నుంచి బయట పడొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. నిద్రలేమి వల్ల కూడా ఒత్తిడి, ఆందోళన పెరిగిపోతాయి. ఫలితంగా పానిక్ అటాక్ ట్రిగ్గర్ అవుతుంది. అందుకే శరీరానికి తగినంత నిద్ర అవసరమని వైద్య నిపుణులు చెబుతారు. అందుకే రోజుకు కనీసం 7-8 గంటలైనా నిద్రపోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×