BigTV English

Tollywood: చిన్న సినిమాలకు పెద్దదిక్కుగా మారిన తెలుగమ్మాయి.. ఈమె క్రేజ్ మామూలుగా లేదుగా..!

Tollywood: చిన్న సినిమాలకు పెద్దదిక్కుగా మారిన తెలుగమ్మాయి.. ఈమె క్రేజ్ మామూలుగా లేదుగా..!

Tollywood: స్వతహాగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయినప్పటికీ సినిమాపై ఉన్న ఫ్యాషన్ తో నటిగా మారారు అనన్య నాగళ్ళ(Annaya Nagalla).కెరీర్ ప్రారంభంలో ‘షాదీ’ వంటి షార్ట్ ఫిల్మ్ లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వెంటనే ‘మల్లేశం’ తో ఆమె సినీ ప్రస్థానం మొదలైంది. ఆ సినిమాలో చక్కని కట్టు బొట్టుతో కనిపించి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించారు. వెంటనే ‘ప్లే బ్యాక్’ అనే సినిమాలో మరో వైవిధ్యమైన పాత్రలో నటించి మెప్పించారు. దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకున్నారు.అటు తర్వాత ‘తంత్ర’ ‘పొట్టేల్’ ‘బహిష్కరణ'(వెబ్ సిరీస్) ‘ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ వంటి ఎన్నో వినూత్నమైన సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించారు.


ఇదిలా ఉంటే.. అనన్య నాగళ్ళ ఇప్పుడు స్మాల్ స్కేల్ విమెన్ సెంట్రిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయారు. అనన్యతో రూ.5 కోట్ల బడ్జెట్లో లేడి ఓరియంటెడ్ సినిమాలు చేస్తే అవి ఈజీగా మార్కెట్ అవుతున్నాయి. ఇప్పటివరకు ఈమె నటించిన  ‘తంత్ర’ ‘పొట్టేల్’ ‘బహిష్కరణ’ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ వంటివి ఓటీటీలో మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి. ముఖ్యంగా ‘తంత్ర’ హిందీ వెర్షన్ జియో హాట్ స్టార్ లో టాప్ 2 లో ట్రెండ్ అవుతూ ఉండగా.. ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో లో దేశ వ్యాప్తంగా ఇప్పటికీ టాప్ 5 లో ట్రెండ్ అవుతుంది. ఈ బ్యూటీ నటించిన ప్రతి సినిమా చిన్న స్టోరీ తో వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి..

అందుకే ఇప్పుడు దర్శకనిర్మాతలు రూ.5 కోట్ల బడ్జెట్లో తీసే లేడి ఓరియంటెడ్ సినిమాలకు అనన్య నాగళ్ళ బెస్ట్ ఆప్షన్ భావిస్తున్నారు. ఆమె వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతున్నారు. అంతేకాదు ఇప్పుడు బాలీవుడ్ డెబ్యూ ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయారు అనన్య నాగళ్ళ. ఈమె మెయిన్ లీడ్ గా ఒక హిందీ ప్రాజెక్టు కూడా రూపొందుతుంది.. అంటే ఈమె క్రేజ్, మార్కెట్ రాష్ట్రాలు దాటాయి అని అర్దం చేసుకోవచ్చు.. టాలీవుడ్ టు బాలీవుడ్ చాలామంది హీరోయిన్లు వెళ్లి తమ అదృష్టాన్ని అక్కడ కూడా పరీక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు కొంతమంది హీరోయిన్లు మాత్రమే భారీ సక్సెస్ ని అందుకున్నారు. మరి కొంతమంది అక్కడ కూడా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక అనన్య నాగళ్ళ నటిస్తున్న ఈ సినిమా ఎలాంటి రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి..


Jr.NTR: మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్లో ఎన్టీఆర్ తాగిన డ్రింక్ ఏంటి ?దాని ప్రత్యేకత ఏంటంటే..?

ఈ అమ్మడు ఒకవైపు వరస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా.. మరోవైపు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలతో కుర్రకారుకు మతిపోగొడుతుంది. ఈమెకు సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ మించి ఫాలోయింగ్ కూడా ఉందన్న విషయం తెలిసిందే..

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×