BigTV English

Summer Watermelon Buying Tips: పుచ్చకాయ కొనేటప్పుడు ఆరు నూరైన ఈ గుర్తులు మర్చిపోకండి!

Summer Watermelon Buying Tips: పుచ్చకాయ కొనేటప్పుడు ఆరు నూరైన ఈ గుర్తులు మర్చిపోకండి!
Watermelon
Watermelon

Watermelon Buying Tips in Summer: సమ్మర్ మొదలై ఎండలు మండుతున్నాయి. ఈ సీజన్‌లో అందరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సీజన్ ఫ్రూట్స్ ఆరగిస్తుంటారు. ఈ ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వైద్యులు కూడా సీజనల్ ఫ్రూట్స్ తప్పకుండా తినాలని సూచిస్తున్నారు. ఈ సమ్మర్‌లో ఎక్కువగా దొరికే పండ్లలో మామిడి ముందుగా గుర్తొస్తోంది. ఇది ఫలరాజుగా ప్రసిద్ధి. పుచ్చకాయ కూడా ఈ సీజన్‌లో ఎక్కువగా కనిపిస్తోంది. పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మంచింది. అయితే వీటిలో చాలా రకాలు ఉన్నాయి. ఏది ఆరోగ్యానికి మంచిదనేది గుర్తించడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అయితే కొన్ని లక్షణాలను బట్టి పుచ్చకాయ మంచిదో కాదో తెలుసుకోవచ్చు.


డీహైడ్రేషన్‌

పుచ్చకాయ వేసవిలో ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శరీరంలోని హీట్‌ను తగ్గిస్తుంది. ఈ సీజన్‌లో ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో పుచ్చకాయ మొదటి స్థానంలో ఉంటుంది. ఇందులో 95 శాతం నీరు ఉంటుంది. కాబట్టి శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. పుచ్చకాయ తినడం వల్ల శరీరం ఉత్తేజంగా ఉంటుంది. అందుకే ఈ సీజన్‌లో పుచ్చకాయ రేట్లు ఎక్కువగా ఉంటాయి.


Also Read: చేపకళ్లు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

పుచ్చకాయ రకాలు

పుచ్చకాయలో అనేక రకాలు ఉన్నా.. జాతులు మాత్రం రెండో ఉన్నాయి. అందులో ఒకటి ఆడ, మరొకటి మగ. ఆడ పుచ్చకాయ సన్నగా గుండ్రంగా ఉంటుంది. మగ పుచ్చకాయల పొడుగ్గా, కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయి. అయితే ఆడ పుచ్చకాయ చాలా రుచిగా ఉంటుంది. మగ పుచ్చకాయలలో నీరు, గుజ్జు అధికంగా ఉంటుంది.

పుచ్చకాయ రంగు

మనలో చాలా మంది పచ్చగా ఉండే పుచ్చకాయలను కొనడానికి ఇష్టపడతారు. అయితే ఇందులో పుచ్చకాయ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటే బాగా పండిందని గుర్తించాలి. అవే చాలా రుచిగా ఉంటాయి. కొన్ని పుచ్చకాయలైతే తెలుపు, గోధుమ రంగులో మచ్చుల మచ్చలుగా ఉంటాయి.
ఈ మచ్చలు ఎంత ముదురు రంగులో ఉంటే ఆ కాయ అంత రుచిని ఇస్తుంది. ఈ మచ్చలు ఏర్పడానికి కారణం తేనెటీగలు.

తొడిమ

తొడిను చూసి పుచ్చకాయ రుచిని గుర్తించొచ్చు. తొడమ ఎండిపోయినట్లుగా ఉంటే బాగా పండినట్లు. అలా కాకుండా పచ్చగా ఉంటే అది పండలేదని భావించాలి. పుచ్చకాయపై వేళ్లతో కొట్టడం ద్వారా కూడా అది ఎలాంటిదో గుర్తించొచ్చు. పుచ్చకాయను కొట్టినప్పుడు టక్‌ టక్‌ అని శబ్దం వస్తే అది బాగా పండిందని అర్థం. శబ్దం రాకపోతే ఇంకా పడాల్సి ఉంటుంది. ముక్కుతో వాసన చూస్తే తియ్యటి వాసన వస్తే బాగా పడిందని భావించాలి. ఈ కాయలు కుళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు గుర్తించాలి.

Also Read: సమ్మర్.. ఈ ఐదు పండ్లను కచ్చితంగా తినాల్సిందే..!

పరిమాణం

చాలా మంది పుచ్చకాయ సైజును బట్టి ఎంచుకుంటారు. పెద్ద పుచ్చకాయ రుచిగా ఉంటుందని అపోహపడతారు. పుచ్చకాయ రుచికి దాని సైజుకి ఎటువంటి సంబంధం లేదు. కాయ ఏ సైజ్‌లో ఉన్నా పట్టుకున్నప్పుడు బరువుగా ఉండాలి. అలా ఉంటే కాయ లోపల నీళ్లు, గుజ్జు ఎక్కువగా ఉన్నట్లు అర్థం. కాబట్టి బరువు ఎక్కువగా ఉన్న కాయలను కొనుగోలు చేయండి.

Disclaimer: ఈ కథనాన్ని వైద్య నిపుణుల సూచనల మేరకు, మెడికల్ జర్నల్స్‌లోని సమాచారం ఆధారంగా రూపొందించాం. దీనిని అవగాహనగా మాత్రమే భావిచండి.

Tags

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×