BigTV English

Singer Mangli on Accident: ‘నేను క్షేమంగానే ఉన్నా’.. సోషల్ మీడియాలో రూమర్స్‌పై మంగ్లీ రియాక్షన్!

Singer Mangli on Accident: ‘నేను క్షేమంగానే ఉన్నా’.. సోషల్ మీడియాలో రూమర్స్‌పై మంగ్లీ రియాక్షన్!
Singer Mangli Reaction On Social Media Rumours
Singer Mangli Reaction On Social Media Rumours

Singer Mangli Reaction on Social Media Rumours: ప్రముఖ సింగర్ మంగ్లీ తనకు జరిగిన ప్రమాదంపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. తాను క్షేమంగా ఉన్నానని తెలిపారు. ఈ మేరకు మంగ్లీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు. ” రెండు రోజుల క్రితం ఒక చిన్న సంఘటన చోటు చేసుకుంది. దీని గురించి వస్తున్న రూమర్స్ నమ్మకండి. నా పై మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు” అంటూ పోస్ట్ పెట్టారు.


కాగా మంగ్లీ త్వరగా కోలుకోవాలని ట్విట్టర్, ఇన్‌స్టా వేదికగా తన అభిమానులు ట్వీట్లు పెడుతున్నారు. శంషాబాద్ మండలంల తొండుపల్లి గ్రామ సమీపంలో మంగ్లీ ప్రయాణిస్తోన్న కారు ప్రమాదానికి గురైయ్యింది. ఈ ప్రమాదంలో మంగ్లీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. శంషాబాద్ పోలీసలు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ హాజరయ్యారు. అర్ధరాత్రి తర్వాత మేఘ్‌రాజ్, మనోహర్‌తో కలసి మంగ్లీ కారులో తిరుగుప్రయాణమయ్యారు. బెంగళూరు హైవేలోని తొండుపల్లి వంతెన వద్ద మంగ్లీ ప్రయాణిస్తోన్న కారును వెనుకనుంచి కర్ణాటకకు చెందిన డీసీఎం వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తోన్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. కారు వెనుక భాగం దెబ్బతింది. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో మంగ్లీ కారును ఢీకొట్టాడు.

Also Read: సింగర్ మంగ్లీకి తృటిలో తప్పిన ప్రమాదం.. కారును ఢీ కొట్టిన DCM!


దీంతో ఈ ప్రమదంపై సోషల్ మీడియా వేదికగా పలువురు స్పందించారు. ఇంకొందరు వదంతులను ప్రచారం చేశారు. వాటిని నమ్మొద్దని మంగ్లీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×