BigTV English

Fish Eyes Benefits: చేపకళ్లు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

Fish Eyes Benefits: చేపకళ్లు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
Fish Eyes Benefits
Fish Eyes Benefits

Fish Eyes Benefits: చేపలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లలేదు. వారానికి ఒకసారి క్రమం తప్పకుండా చేపలు తింటే శరీరానికి చాలా మంచిది. ఎందుకంటే చేపలో మొత్తం ఆరోగ్యానికి మంచిచేసే అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ కూడా ఒకటి. ఇది చేపలో సంమృద్దిగా ఉంటుంది. చేప ముళ్లు వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు చేప కళ్లు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


చాలా మంది చేప తినేప్పుడు దాని పైభాగం మాత్రమే తింటారు. లోపల ముళ్లు, తల భాగాన్ని పడేస్తారు. ఎందుకంటే వారికి అందులో ఉండే పోషకాలు తెలియదు. కాని చేపలోని ప్రతి భాగం ఆరోగ్యానికి మంచే చేస్తుంది. చేప కళ్లు, తలలో బోలెడు పోషకాలు ఉంటాయి. కాబట్టి చేపలోని ఏ భాగాన్ని కూడా వదలొద్దు. అయితే ఇప్పుడు చేప కళ్లు తింటే ఎటువంటి లాభాలు ఉంటాయో చూద్దాం.

కంటి సమస్య ఉన్న వారికి చేప కళ్లు మేలు చేస్తాయి. మీ కంటి చూపులో ఏదైనా సమస్య ఉంటే చేప కళ్లు ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే చేప కళ్లలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కంటిచూపును మెరుగుపరుస్తాయి. కాబట్టి చేపకళ్లను తినండి.


Also Read: సమ్మర్.. ఈ ఐదు పండ్లను కచ్చితంగా తినాల్సిందే!

చేప కళ్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గుండె ఆరోగ్యానికి ఇవి మంచి మెడిసిన్. తరచూ చేప, వాటి కళ్లను తినే వారికి గుండెపోటు, పక్షపాతం, ఇతర సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే చేప కళ్లను వదలకండి.

ఆటిజం అనేది ఒక మానసిక సమస్య. ఈ సమస్య కారణంగా చాలా ఆత్రుతగా ఉంటారు. ఎక్కువగా అలసిపోతారు. ఏ విషయంపై ఫోకస్ ఉండదు. దీని నుంచి బయటపడేందుకు చేప కళ్లు తోడ్పడతాయి. ఎందుకంటే చేప కళ్లలో ఉండే ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఆటిజంతో పోరాడతాయి.

చేపలు రోజూ తినే వారిలో మెదడు సంబంధిత సమస్యలు తక్కువగా ఉంటాయి. ఎక్కువ జ్ఞాపకశక్తిని కలిగి ఉంటారు. శరీరం చురుకుగా ఉంటుంది. చేప కళ్లు తింటే మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది.
బీపీ కూడా అదుపులో ఉంటుంది.

చేప కళ్లు తింటే డయాబెటిస్ బారినపడరు. షుగర్ ఉన్న కూడా అదుపులో ఉంటుంది. చేపలోని ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను నిర్వహిస్తాయి. చేపలను క్రమం తప్పకుండా తింటే టైప్-1 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా చేపలు దీర్ఘకాలిక మంటను కూడా తగ్గిస్తాయి.

Also Read: వాసన భరించలేకపోయినా.. చెమట మంచిదే!

చేప కళ్లలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ప్రశాంతమైన నిద్రకు విటమిన్ డి ఉపకరిస్తుంది. ఇక ట్యూనా సాల్మన్ చేపలు ఆరోగ్యానికి మంచివి. ఈ చేపలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇతర చేపల కంటే ఇందులో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. స్వర పేటిక,పెద్ద పేగు,నోరు, క్లోమం వంటి అవయవాలకు వచ్చే క్యాన్సర్‌ను తగ్గిస్తాయి.

Disclaimer: ఈ కథనాన్ని వైద్య నిపుణుల సలహా మేరకు, మెడికల్ జర్నల్స్‌లోని సమాచారం ఆధారంగా
అందిస్తున్నాం. దీనిని అవగాహనగా మాత్రమే భావిచండి.

Related News

Eye Care: కంటి సమస్యలు రాకూడదంటే.. ఎలాంటి టిప్స్ పాటించాలి ?

Get Rid of Pimples: మొటిమలు త్వరగా తగ్గాలంటే ?

Warm Water: ఉదయం పూట గోరు వెచ్చని నీరు తాగితే.. ?

Nail Biting: తరచూ గోళ్లు కొరుకుతున్నారా ? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే !

Causes Of Anger: ప్రతి చిన్న విషయానికీ కోపం వస్తుందా.. ? కారణాలివే !

Longtime Sitting: ఆఫీసులో ఎనిమిది నుంచి పది గంటలు కూర్చుంటున్నారా? అయితే ఈ వ్యాధి త్వరలోనే వచ్చేస్తుంది

Big Stories

×