E-Paper
Advertisement

నోరూరించే పంజాబీ భేండీ మసాలా..రోటీ,చపాతీకి ఫర్పెక్ట్ కాంబినేషన్

నోరూరించే పంజాబీ భేండీ మసాలా..రోటీ,చపాతీకి ఫర్పెక్ట్ కాంబినేషన్
Advertisement

Punjabi bhindi masala recipe: రోటీ, చపాతీ లేదా పుల్కాలోకి ఏ కూర తిన్నా బోర్ కొట్టేసిందా? అయితే ఒక్క సారి పంజాబీ స్టైల్ బెండకాయ మసాలా ట్రై చేయండి! చాలా మందికి బెండకాయ అనగానే జిగురు వస్తుందని తినడానికి ఇష్టపడరు. కానీ పక్కా పంజాబీ పద్ధతిలో గ్రేవీతో చేసుకునే ఈ భిండి మసాలాలో అసలు జిగురు ఉండదు సరి కదా, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్ రుచితో.. ఉండే ఈ స్పెషల్ కర్రీని మీ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం!

పంజాబీ బెండకాయ మసాలా రెసిపీ:

మన ఇంట్లో రెగ్యులర్‌గా చేసుకునే బెండకాయ ఫ్రై కంటే, పంజాబీ స్టైల్ గ్రేవీ కర్రీ టేస్ట్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. చపాతీలు, నాన్‌లు లేదా వేడి వేడి అన్నంలోకి ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇది. బెండకాయలను కొద్దిగా ఫ్రై చేసి, స్పైసీ టమాటా-ఉల్లిపాయ గ్రేవీలో మగ్గించడం ద్వారా ఈ కూర అద్భుతమైన రుచిని ఇస్తుంది. దీన్ని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, ఈజీ స్టెప్స్ ..

కావాల్సిన పదార్థాలు :

Advertisement

బెండకాయలు: 250 గ్రాములు (పెద్ద ముక్కలుగా తరిగినవి)

ఉల్లిపాయలు: 2 ( ఒకటి సన్నగా తరిగినవి, ఒకటి క్యూబ్స్‌లా కోసినవి)

Advertisement

టమాటాలు: 2 (మెత్తని ప్యూరీ లేదా సన్నని ముక్కలు)

అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 స్పూన్

పెరుగు: 2 స్పూన్లు

పచ్చిమిర్చి: 3

మసాలాలు: ధనియాల పొడి (1 స్పూన్), జీలకర్ర పొడి (పావు స్పూన్), కారం (1.5 స్పూన్), పసుపు, గరం మసాలా (అర స్పూన్), కాస్త కసూరి మేతి (మెంతి ఆకులు)

నూనె, ఉప్పు: సరిపడా

తయారీ విధానం :

1. ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి, తడి లేకుండా తుడిచి కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో ఒక స్పూన్ నూనె వేసి, ఈ బెండకాయ ముక్కలను జిగురు పోయే వరకు మీడియం మంటపై దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించడం వల్ల కూరలో జిగురు రాదు. ఫ్రై అయిన వాటిని పక్కన పెట్టుకోవాలి.

2. అదే పాన్ లో మరో రెండు స్పూన్ల నూనె వేసి జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలా కలపాలి.

3. ఇప్పుడు అందులో టమాటా ప్యూరీ వేసి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. మసాలాలు మాడిపోకుండా కొద్దిగా నీరు కూడా కలుపుకోవచ్చు.

Also Read: రాజమండ్రి స్పెషల్ కాజు చికెన్ పకోడీ..నూరూరించే గోదావరి రుచి ఇంట్లోనే!

4. మసాలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టి, 2 స్పూన్ల గిలకొట్టిన పెరుగును మెల్లగా కలపాలి. పెరుగు వేయడం వల్ల గ్రేవీకి మంచి రిచ్ టెక్చర్ వస్తుంది. ఆ తర్వాత నలిపిన కసూరి మేతి, గరం మసాలా వేయాలి. ఇది పంజాబీ కూరలకు అద్భుతమైన సువాసనను ఇస్తుంది.

5. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలతో పాటు క్యూబ్స్‌గా కోసిన ఉల్లిపాయ ముక్కలను గ్రేవీలో వేయాలి. మసాలాలన్నీ ముక్కలకు పట్టేలా మెల్లగా కలపాలి. కూర చిక్కగా రావడానికి కొద్దిగా నీరు పోసి, మూత పెట్టి సన్నని మంటపై 5 నుంచి 7 నిమిషాలు మగ్గనివ్వాలి. అంతే.. గుమగుమలాడే పంజాబీ బెండకాయ మసాలా రెడీ!

చివరగా కొద్దిగా కొత్తి మీర తరుగుతో గార్నిష్ చేసుకుని వేడి వేడి రోటీ లేదా పుల్కాతో సర్వ్ చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ట్రై చేయండి.

Related News

ఈ ఒక్క కర్రీ ఉంటే చాలు.. ఎన్ని రోటీలైనా క్షణాల్లో ఖాళీ అయిపోవాల్సిందే!

చేపలు లేవు.. అయినా ఈ రెసిపీ పేరు బొమ్మిడాల చారు.. రాయలసీమ సీక్రెట్ రెసిపీ ఇదే!

పక్కా తెలంగాణ స్టైల్ బగారా రైస్..ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే అద్భుతమైన రుచి

రాజమండ్రి స్పెషల్ కాజు చికెన్ పకోడీ.. గోదావరి రుచి ఇంట్లోనే!

ఆఫీస్‌లో సహోద్యోగులతో స్నేహం మంచిదే.. కానీ ఈ విషయాలు మాత్రం వారికి చెప్పకూడదు

ఆధ్యాత్మికత కాదు.. దేవుడిని పూజించేటప్పుడు కళ్లు మూసుకోవడం వెనుకున్న పక్కా సైన్స్ ఇదే!

దుర్గాపూజలో మీ లైఫ్ పార్ట్‌నర్‌తో మ్యాచింగ్ డ్రెస్ ఇలా ట్విన్నింగ్ చేయండి.. ఇద్దరి ఫొటోలు అదిరిపోతాయి

Big Stories

Advertisement
×