Rajahmundry kaju chicken pakodi: చికెన్ లదర్స్ ఈ పేరు వినగానే నోట్లో నీళ్లు ఊరిపోవడం ఖాయం! అదే గోదావరి జిల్లాలు, ముఖ్యంగా రాజమండ్రి స్పెషల్ “కాజు చికెన్ పకోడీ”. వేడి వేడిగా, కరకరలాడుతూ జీడిపప్పు ఘుమఘుమలతో ఉండే ఈ స్నాక్ టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఈవినింగ్ టైమ్‌లో టీతో పాటు తినడానికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. రెస్టారెంట్ స్టైల్ రుచితో రాజమండ్రి స్పెషల్ కాజు చికెన్ పకోడీని మీ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూసేద్దామా!
అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం తర్వాత గోదావరి జిల్లాల్లో అంతగా పాపులర్ అయిన వంటకం ఏదైనా ఉందంటే.. అది మన రాజమండ్రి స్పెషల్ చికెన్ పకోడీనే. అందులోనూ జీడిపప్పు కలిపి చేసే కాజు చికెన్ పకోడీ టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటుంది. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఉండే ఈ స్నాక్ ఐటమ్‌ను తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, ఈజీ పద్ధతి..
బోన్‌లెస్ చికెన్: 500 గ్రాములు (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి)
జీడిపప్పు : అర కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 స్పూన్లు
శనగ పిండి: 3 స్పూన్లు
బియ్యం పిండి లేదా కార్న్‌ఫ్లోర్: 2 స్పూన్లు
కారం: 2 స్పూన్లు (రుచికి తగినంత)
గరం మసాలా, ధనియాల పొడి: 1 స్పూన్
పెరుగు: 2 స్పూన్లు
నిమ్మరసం: కాస్త
కరివేపాకు: గుప్పెడు
నూనె, ఉప్పు: వేయించడానికి సరిపడా
1. ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి, నీరంతా వడకట్టాలి. ఇప్పుడు ఒక గిన్నెలో చికెన్ ముక్కలను తీసుకుని, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, తగినంత ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు , నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మసాలా చికెన్‌కు బాగా పట్టేలా అర గంట పాటు నానబెట్టాలి.
2. చికెన్ బాగా నానిన తర్వాత, అందులో శనగపిండి, బియ్యం పిండి (లేదా కార్న్‌ఫ్లోర్) వేయాలి. అలాగే ప్రత్యేకంగా పక్కన పెట్టుకున్న జీడిపప్పులను , గుప్పెడు తాజా కరివే పాకులను కూడా ఈ మిశ్రమంలో కలపాలి. పిండి ముక్కలకి పొడిగా అంటుకునేలా చూసుకోవాలి. అవసరమైతే చిటికెడు నీళ్లు చల్లుకోవచ్చు కానీ ఎక్కువ నీరు పోయకూడదు.
Also Read: పర్ఫెక్ట్ కొలతలతో..తియ్యని చక్కెర పొంగలి క్షణాల్లోనే రెడీ చేయండిలా!
3. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె పోసి వేయించాలి. నూనె బాగా కాగిన తర్వాత, మ్యాగినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను,జీడిపప్పులను విడివిడిగా లేదా కలిపి నూనెలో వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచడం ముఖ్యం. లేదంటే పైకి మాడిపోయి లోపల ఉడకదు.
4. చికెన్ ముక్కలు, జీడిపప్పులు చక్కటి బంగారు రంగు వచ్చే వరకు, మంచి క్రిస్పీ సౌండ్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి. నూనెలో కరివేపాకు వేయడం వల్ల వచ్చే సువాసన ఈ పకోడీకి స్పెషల్ రుచిని ఇస్తుంది.
5.ఫ్రై అయిన పకోడీని నూనె నుంచి తీసి టిష్యూ పేపర్‌పై వేస్తే ఎక్కువైనా నూనె పీల్చేస్తుంది. అంతే.. వేడి వేడి రాజమండ్రి స్పెషల్ కాజు చికెన్ పకోడీ రెడీ!
దీన్ని ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ పిండుకుని తింటే ఆ మజాయే వేరు. ఈ వీకెండ్‌లో మీ ఇంట్లో ఈ ట్రెండీ రాజమండ్రి స్టైల్ స్నాక్‌ను ట్రై చేసి అందరితో శభాష్ అనిపించుకోండి!