E-Paper
Advertisement

ఒబామాకే ఇచ్చారు.. నాకెందుకివ్వరు.. నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు!

ఒబామాకే ఇచ్చారు.. నాకెందుకివ్వరు.. నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు!
Advertisement

Trump Nobel: ఒక్కొక్కరికి ఒక్కో ఆశ ఉంటుంది. చిన్నపిల్లలకు చాక్లెట్ అంటే ఎంతిష్టమో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి అంటే అంతిష్టం. దానికోసం అలుపెరగని యుద్ధం చేస్తున్నాడు ఆయన.

ఎనిమిది యుద్ధాలు ఆపానంటూ..

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక గాజాలో 21 వేల మంది చిన్నారులు చనిపోయారు. ఇజ్రాయెల్ అన్యాయంగా చేస్తున్న ఈ హననాన్ని ఆపగలిగీ ఆపడం లేదు ట్రంప్. రష్యా, ఉక్రెయిన్ వార్ ఎప్పటికి ముగుస్తుందో తెలియదు. ఆ యుద్ధం వద్దంటూనే పరోక్షంగా పుల్లలు పెడుతూ చావులపై చలికాచుకుంటున్నారు. ఇక తానే మొదలుపెట్టిన ఇరాన్ వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. యుద్ధం తొలిరోజుల్లోనే ఓ స్కూల్‌పై దాడి చేసి 153 మంది అమాయక చిన్నారుల ఉసురు తీశారు. ఇలాంటి పరిస్థితుల్లో నోబెల్ శాంతి బహుమతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన గోల మొదలుపెట్టాడు. తాను ఏకంగా ఎనిమిది యుద్ధాలు ఆపానని, గతంలో ఏ అధ్యక్షుడు చేయని పనులు చేశానంటూ అల్లరి చేస్తున్నాడు.

Advertisement

Also Read: నెల్లూరు మేయర్‌ అభ్యర్థిగా ఆనం.. వైసీపీ అసలు వ్యూహం ఇదేనా?

ట్రంప్‌కు దక్కుతుందా?

మరో అంతర్జాతీయ వివాదానికి కూడా త్వరలో పరిష్కారం చూపిస్తానని చెప్పాడు ట్రంప్. అంటే ఇరాన్ వార్‌కు ముగింపు పలుకుతాడా? రష్యా-ఉక్రెయిన్ వార్ ఆపుతాడా? సరే ఏ యుద్ధం ఆపినా ఈసారి నోబెల్ శాంతి బహుమతి ట్రంప్‌కు దక్కుతుందా? అన్నభయం మాత్రం అంతటా వినిపిస్తోంది. ఇప్పటికే ఇద్దరు నార్వే రాజకీయ నాయకులు ట్రంప్ పేరును నోబెల్ బహుమతికి ప్రతిపాదించినట్లు ప్రకటించారు. గతంలో జపాన్ ప్రధాని షింజో అబే కూడా తనను నామినేట్ చేశారని ట్రంప్ చెప్పారు. అయితే అబే దీనిని బహిరంగంగా ధృవీకరించలేదు. ఒకవేళ నోబెల్ పీస్ ప్రైజ్ ట్రంప్‌కు రాకపోతే నార్వేపై యుద్ధం ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు విశ్లేషకులు.

నోబెల్ శాంతి బహుమతి రద్దు

Advertisement

అసలు ప్రపంచమంతా ఇన్ని యుద్ధాలు జరుగుతూ, ఇంత నరమేథం జరుగుతున్న సమయంలో నోబెల్ శాంతి బహుమతినే రద్దు చేయాలి. ఎక్కడ శాంతి ఉందని, ఎవరికి నోబెల్ ఇస్తారు? ప్రపంచం ఇంత దారుణమైన సంక్షోభంలో ఉన్న సమయంలో నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరికి ఇచ్చినా అది ట్రంప్‌కు ఇచ్చినట్టే అవుతుంది అనుకోవాలి.

Also read: ఎలాన్ మస్క్ సంచలన పోస్ట్.. స్టార్‌లింక్ రాకపై భారత్‌లో మళ్లీ చెలరేగిన వివాదం!

Tags

Related News

ఉపాధి హామీ పనుల్లో సంచలన రికార్డ్.. గత ఐదేళ్లలో ఇదే టాప్ హజరు శాతం

ఆ నలుగురు… ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు..! ప్రభుత్వ పతనంపై రాహుల్‌ శపథం..! ఆ నలుగురు టార్గెట్‌గా ఢిల్లీ ఆందోళన..

ఎలాన్ మస్క్ సంచలన పోస్ట్.. స్టార్‌లింక్ రాకపై భారత్‌లో మళ్లీ చెలరేగిన వివాదం!

తెలంగాణ సచివాలయంలో సెకండ్ ఫ్లోర్ మిస్టరీ.. అసలు అక్కడ ఏం జరుగుతోంది?

సీఎం రేవంత్ నిర్ణయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల విమర్శలు.. అసలేం జరిగిందంటే?

ఇదేం విచిత్రం వరికే అగ్రతాంబూలమా.. ఆ పంటలపై వ్యవసాయ పరిశోధకులు శీతకన్ను..?

సర్‌పై ఢిల్లీ దద్దరిల్లుతున్న వేళ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రతిపక్షాల్లో నిస్తేజం..! బీఆరెస్‌ సైలెంట్‌ మోడ్‌.. వైసీపీ గప్‌చుప్‌..!

Big Stories

Advertisement
×