E-Paper
Advertisement

మీ తోబుట్టువుల ముఖంలో చిరునవ్వు చిందించేలా..స్పెషల్ రాఖీ విషెస్

మీ తోబుట్టువుల ముఖంలో చిరునవ్వు చిందించేలా..స్పెషల్ రాఖీ విషెస్
Advertisement

Raksha Bandhan 2026: రక్తసంబంధానికి మించిన అనుబంధం, చిన్ననాటి అల్లర్లు, అలకలు, పంచుకున్న జ్ఞాపకాలకు ప్రతీక రాఖీ పండగ. శ్రావణ పౌర్ణమి నాడు వచ్ఛే ఈ పండగ అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల ప్రేమానురాగాలను మరింత బలోపేతం చేస్తుంది. చెల్లి కట్టే.. దారపు పోగు కేవలం ఒక దారం కాదు, అన్నయ్య జీవితాంతం అండగా ఉంటాననే నమ్మకానికి సజీవ సాక్ష్యం. దూర ప్రాంతాల్లో ఉన్నా, కాలం మారుతున్నా తోబుట్టువుల ప్రేమాభిమానాలు ఎప్పటికీ చెక్కుచెదరవు. ఈ శుభవేళ మీ తోబుట్టువులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ.. వారి మనసుకు హత్తుకునే 20 అద్భుతమైన కొటేషన్లు..

మనసుకు హత్తుకునే.. రాఖీ పండగ కొటేషన్లు :

1. దారపు పొగుతో ముడిపడిన మన ప్రేమానుబంధం కాలం మారినా ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది.
ఈ శ్రావణ పౌర్ణమి వేళ నీకు నా హృదయపూర్వక రాఖీ శుభాకాంక్షలు!

Advertisement

2. చిన్నతనంలో మనం చేసిన అల్లర్లు, పంచుకున్న జ్ఞాపకాలు నా జీవితంలో అత్యంత మధురమైనవి.
నన్ను సదా కాపాడే నా ప్రియమైన అన్నయ్యకు రక్షాబంధన్ శుభాకాంక్షలు!

3. అమ్మలా లాలించి, నా ప్రతీ కష్టంలో వెన్నంటి నిలిచే దేవతవు నువ్వు.
నా చిట్టి చెల్లెలికి జీవితాంతం సంతోషాలు కలగాలని కోరుకుంటూ రాఖీ శుభాకాంక్షలు!

Advertisement

4. నా కంటి పాపలా నిన్ను కాపాడుకుంటానని మాట ఇస్తూ..
మన అనుబంధం ఎల్లప్పుడూ ఇలాగే సంతోషంగా సాగిపోవాలని ఆశిస్తున్నాను.

5. ఎంత ఎదిగినా నీ ముందు ఆ చిన్ననాటి చెల్లెలిగానే ఉండిపోవాలని ఉంది.

నా ప్రతి అడుగులో ధైర్యంగా నిలిచే నా అన్నయ్యకు రాఖీ శుభాకాంక్షలు!

6. మాటల్లో చెప్పలేని మమకారం, వర్ణించలేని అనురాగం మన తోబుట్టువుల సంబంధం.

ఈ పవిత్రమైన రోజున నీ మొహంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండాలని కోరుకుంటున్నాను.రాఖీ శుభాకాంక్షలు!

7. నా ప్రతీ విజయం వెనక నీ ప్రోత్సాహం, నా ప్రతీ అడుగు వెనక నీ రక్షణ ఉంది.

నా జీవితానికి వెలుగునిచ్చిన నా తోబుట్టువుకు రక్షాబంధన్ శుభాకాంక్షలు!

8. దూరాలు మనల్ని వేరు చేసినా, ఈ రాఖీ దారం మన మనసులను ఎప్పుడూ ఒకేలా ఉంచుతుంది.

ఎక్కడున్నా నీ ఆరోగ్యం బాగుండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. రాఖీ పండగ శుభాకాంక్షలు..

9.నీ నవ్వు నాకిచ్చే ధైర్యం, నీ ప్రేమ నాకు ఇచ్చే బలం ఎనలేనిది.

ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా నా చెల్లెలికి ఐశ్వర్యం, ఆరోగ్యాలు కలగాలి! రాఖీ పండగ శుభాకాంక్షలు..

10. గొడవపడినా మరుక్షణమే ఒక్కటయ్యే మన స్వచ్ఛమైన ప్రేమకు సాటి లేదు.

నా ప్రాణమైన అన్నయ్యకి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు!

11. నీ రూపంలో నాకు ఒక మంచి స్నేహితుడు, ఒక మంచి మార్గదర్శి దొరికారు.

నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకునే నా అన్నకు రక్షాబంధన్ శుభాకాంక్షలు!

12. నీ కంటిపాపలా నన్ను చూసుకుంటూ నా భయాలను పోగొట్టే శక్తి నీ ప్రేమ.

ఈ పవిత్రమైన రోజున నీ కలలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాఖీ పండగ శుభాకాంక్షలు..

13. రాఖీ పండగ కేవలం ఒక రోజే రావచ్చు, కానీ నీపై నాకున్న ప్రేమ ప్రతి క్షణం ఉంటుంది.

నా ప్రియమైన సోదరికి రక్షాబంధన్ శుభాకాంక్షలు!

Related News

నచ్చిన ఆహారం తింటూ.. కిలో బరువు తగ్గాలంటే.. రోజుకు ఎన్ని అడుగులు నడవాలి?

గుంటూరు స్పెషల్ కోవా పూరీ..ఇంట్లోనే ఇలా చేస్తే స్వీట్ షాప్ టేస్ట్!

వంకాయ నువ్వుల రోటి పచ్చడి..ఈ స్టైల్‌లో చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ!

పర్ఫెక్ట్ రాయలసీమ స్టైల్ ఉగ్గాని..ఒక్కసారి తింటే వదిలిపెట్టరు!

రొమ్ము క్యాన్సర్ ఈ దశకు చేరితే ఏం జరుగుతుంది? ప్రతి మహిళ తెలుసుకోవాల్సిందే!

నోటికి కారంగా, సూపర్ టేస్టీగా ఆలూ పచ్చి కారం ఫ్రై!

నెల రోజులపాటు నిల్వ ఉండే రవ్వ లడ్డు..క్షణాల్లోనే చేయండిలా!

సేమియా ఉప్మా బోర్ కొట్టిందా? ఇలా ఎగ్ సేమియా ట్రై చేయండి!

Big Stories

Advertisement
×