Raw Papaya Juice: పచ్చి బొప్పాయిలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పచ్చి బొప్పాయిని జ్యూస్ లాగా చేసుకుని కూడా తాగవచ్చు. ఈ జ్యూస్ క్రమం తప్పకుండా తాగడం ద్వారా బరువు తగ్గడమే కాకుండా, జీర్ణక్రియ, చర్మం, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. కాబట్టి మీరు మీ ఆరోగ్యం, అందం రెండింటినీ మెరుగు పరుచుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీ ఆహారంలో పచ్చి బొప్పాయి జ్యూస్ చేర్చుకోండి. పచ్చి బొప్పాయి రసం వల్ల కలిగే ప్రయోజనాలు, దానిని తయారు చేసే పద్ధతిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి బొప్పాయి రసం యొక్క ప్రయోజనాలు:
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
పచ్చి బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.ఈ జ్యూస్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా గ్యాస్, అసిడిటీ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది కడుపుని క్లియర్ చేయడంలో , అంతే కాకుండా జీర్ణ సంబంధిత సమస్యలను ఎదుర్కోవడంలో కూడా ప్రభావ వంతంగా పని చేస్తుంది.
బరువు తగ్గడంలో సహాయపడుతుంది:
పచ్చి బొప్పాయి జ్యూస్ తాగడం వల్ల బరువు ఈజీగా తగ్గవచ్చు. ఇందులో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉంటుంది. దీని కారణంగా కడుపు ఎక్కువసేపు నిండిన అనుభూతి ఉంటుంది. ఫలితంగా ఎక్కువ తినాలనే కోరిక కూడా ఉండదు. అంతేకాకుండా, శరీరం నుండి అదనపు నీరు , వ్యర్థ పదార్థాలను తొలగించడంలో ఇది సహాయపడుతుంది.
చర్మానికి మేలు చేస్తుంది:
పచ్చి బొప్పాయి రసం కూడా చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని మెరుగుపరచడంలో , మొటిమలు , మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే, ఇది చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. అంతే కాకుండా ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది.
శరీరంలో మంటను తగ్గిస్తుంది:
పచ్చి బొప్పాయి జ్యూస్ శరీరంలోని వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఆర్థరైటిస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇది శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. ఫలితంగా వాపును నియంత్రిస్తుంది. కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడే వారు పచ్చి బొప్పాయి జ్యూస్ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది:
పచ్చి బొప్పాయిలో విటమిన్ సి , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్లు , వ్యాధుల బారి నుండి రక్షిస్తుంది. శరీరాన్ని ఎల్లప్పుడూ తాజాగా ఉంచుతుంది.
రక్త శుద్ది:
పచ్చి బొప్పాయి జ్యూస్ శరీరం నుండి వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చర్మాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇది శరీర అంతర్గత నష్టాన్ని నయం చేయడంలో కూడా సహాయపడుతుంది.
ఆర్థరైటిస్, కీళ్ల నొప్పి నుండి ఉపశమనం:
పచ్చి బొప్పాయి ఆర్థరైటిస్ , కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. దీని శోథ నిరోధక లక్షణాలు నొప్పిని తగ్గిస్తాయి. అంతే కాకుండా వాపును కూడా తగ్గిస్తాయి. ఫలితంగా కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి.
పచ్చి బొప్పాయి రసం తయారు చేయడానికి
కావలసినవి:
పచ్చి బొప్పాయి – 1 కప్పు (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
తేనె – 1 టీస్పూన్
నిమ్మరసం – 1 టీస్పూన్
నీరు – అవసరాన్ని బట్టి
Also Read: వీళ్లు ఖర్జూరం అస్సలు తినకూడదు.. తెలుసా ?
తయారీ విధానం:
ముందుగా పచ్చి బొప్పాయి ముక్కలను మిక్సీలో వేయండి.
దానికి తేనె, నిమ్మరసం వేసి బాగా కలపండి.
అవసరమైనంత నీరు పోసి మిక్సీలో మెత్తని గుజ్జులా చేసుకోవాలి.
రసాన్ని వడకట్టి ఒక గ్లాసులో పోసి వెంటనే త్రాగాలి.