Sikandar Teaser: తను తమిళంలో తెరకెక్కించే సినిమాలను తెలుగులో డబ్ చేసి, ఆపై హిందీలో రీమేక్ చేసి హిట్లు అందుకున్న స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్. ఇప్పటికే పలువురు బాలీవుడ్ స్టార్ హీరోలకు గుర్తుండిపోయే హిట్స్ ఇచ్చాడు ఈ దర్శకుడు. తాజాగా సల్మాన్ ఖాన్‌తో మురుగదాస్ సినిమా అనగానే ప్రేక్షకులు దీనిపై భారీ అంచనాలు పెంచేసుకున్నారు. దీనికి ‘సికందర్’ అనే టైటిల్ ఫిక్స్ అయినట్టు చాలాకాలం క్రితమే ప్రకటించారు మేకర్స్. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో భారీ యాక్షన్‌తో మరోసారి అందరినీ ఆకట్టుకున్నాడు సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan). హీరోయిన్‌గా రష్మిక మాత్రం కేవలం 5 సెకండ్లకే పరిమితం అయ్యింది.
నా పేరు సికిందర్
‘‘అమ్మమ్మ నా పేరు సికందర్ అని పెట్టింది. తాతయ్య ఏమో సంజయ్ అని పెట్టారు. ప్రజలంతా రాజా సాబ్ అని పిలుస్తారు’’ అంటూ సల్మాన్ ఖాన్ తన గురించి తాను చెప్పుకోవడంతో ‘సికందర్’ టీజర్ మొదలవుతుంది. ‘‘నిన్ను నువ్వు పెద్ద సికిందర్ అనుకుంటున్నావా? న్యాయం చేయడానికి వచ్చావా?’’ అంటూ రౌడీలు తనపై వస్తే.. ‘‘న్యాయం చేయడానికి రాలేదు శుభ్రం చేయడానికి వచ్చాను’’ అంటూ వారిపై పంజా విసురుతాడు సల్మాన్. అలా స‘సికిందర్’ టీజర్‌లో చాలావరకు ఫైట్స్ మాత్రమే ఉన్నాయి. అంతే కాకుండా విమానంలో జరిగే ఫైట్ చాలా స్టైలిష్‌గా ఉండబోతుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది.
కొన్ని సెకండన్లకే పరిమితం
‘సికందర్’ టీజర్‌లో ఇన్ని ఫైట్స్ మధ్యలో రష్మిక ఎంట్రీ ఇస్తుంది. సల్మాన్‌తో కలిసి స్టెప్పులు కూడా వేస్తుంది. ‘‘నీ శత్రువుల్లో నువ్వు చాలా పాపులర్’’ అంటూ ఒక డైలాగ్ చెప్పి టీజర్ నుండి మాయమయిపోతుంది రష్మిక మందనా (Rashmika Mandanna). ‘‘ఎంత పాపులారిటీ ఉందంటే ఐపీఎస్ ఎగ్జామ్ రాసి పోలీస్ అయిపోతాను. కానీ ఏ ఎగ్జామ్ లేకుండానే మంచి చేయాలనే ఆలోచనతో ఉన్నాను’’ అని సల్మాన్ ఖాన్ చెప్పే డైలాగ్‌తో ఈ టీజర్ ముగుస్తుంది. మొత్తానికి తాజాగా విడుదలయిన ‘సికందర్’ టీజర్‌లో డైలాగ్స్ తక్కువ, యాక్షన్ ఎక్కువ అనిపిస్తోంది. మామూలుగా ప్రతీ సల్మాన్ ఖాన్ సినిమాలో ఇదే ఉంటుంది కదా.. మరి ‘సికందర్’లో కొత్తగా ఏముంది అనే ఫీలింగ్ టీజర్ చూసిన ప్రేక్షకులకు వచ్చే అవకాశం ఉంది.
Also Read: సూర్య కంటే విజయ్ నయం.. భర్తపై ట్రోలింగ్‌పై జ్యోతిక షాకింగ్ రియాక్షన్
రొటీన్ యాక్షన్
ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss)కు ప్రస్తుతం తమిళంలో హిట్స్ లేవు. అందుకే చాలాకాలం తర్వాత బాలీవుడ్‌లో అడుగుపెట్టి సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోతో ‘సికందర్’ (Sikandar) మూవీ చేస్తున్నాడు మురుగదాస్. అలా ఈ సినిమాపై ముందు నుండి ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. కానీ ‘సికిందర్’ టీజర్ చూసిన తర్వాత ఇందులో మురుగదాస్ మార్క్ కనిపించడం లేదని చాలామంది ఆడియన్స్ ఫీలవుతున్నారు. మామూలుగా మురుగదాస్ సినిమా అంటే యాక్షన్‌తో పాటు అందులో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది. కానీ ‘సికందర్’లో కాస్త కూడా కొత్తదనం కనిపించడం లేదని అప్పుడే భాయ్ ఫ్యాన్స్ సైతం డిసప్పాయింట్ అవుతున్నారు.