Rayalaseema chemagadda pulusu: రాయలసీమ వంటకాలంటేనే ప్రత్యేకమైన మమకారం. అక్కడ వాడే మసాలాలు, వండే విధానం ప్రతి వంటకానికి ఒక యూనిక్ టేస్ట్ ఇస్తాయి. అలాంటి ట్రెడిషనల్ లిస్ట్‌లో చేమ గడ్డ కారం పులుసు ఎప్పుడూ ముందుంటుంది. చాలా మంది చేమగడ్డలో ఉండే జిగటవల్ల దీన్ని వండటానికి కాస్త వెనకాడతారు. కానీ..చిన్న చిన్న కింద టిప్స్ పాటిస్తూ పర్ఫెక్ట్గా వండితే, ఇది చేపల పులుసును సైతం మరి పించేలా అదిరిపోయే టేస్ట్ ఇస్తుంది. ఈ అద్భుతమైన వంటకం తయారీకి కావాల్సిన పదార్థాలు, ప్రాసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం!
చేమగడ్డలు: అర కేజీ
చింతపండు: నిమ్మకాయ సైజు అంత
ఉల్లిపాయలు: 2 (సన్నగా, నిలువుగా తరిగినవి)
పచ్చిమిర్చి: 4 (నిలువుగా చీల్చినవి)
కారం: 2 టేబుల్ స్పూన్లు (రుచికి తగినట్లు)
ధనియాల పొడి: 1 టేబుల్ స్పూన్
జీలకర్ర-మెంతుల పొడి: అర టీస్పూన్
పసుపు: చిటికెడు
ఉప్పు: తగినంత
నూనె: సరిపడా
పోపు దినుసులు: ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు
వెల్లుల్లి రెబ్బలు: 10
కొత్తిమీర: కొద్దిగా
తయారీ విధానం:
1.ముందుగా చేమ గడ్డలను నీటితో శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి, మునిగే వరకు నీళ్లు పోసి 2 లేదా 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టాలి. మరీ మెత్తగా పేస్ట్ లా కాకుండా..కాస్త గట్టిగా ఉండేలా చూసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత పై పొట్టు తీసి, మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. చేమగడ్డల్లోని జిగట పోవడానికి, కట్ చేసుకున్న ముక్కలను బాండీలో కొద్దిగా నూనె వేసి దోరగా ఫ్రై చేయాలి. ఇలా చేయడం వల్ల పులుసులో ముక్కలు విడి పోకుండా భలే టేస్ట్‌గా ఉంటాయి. ఇప్పుడు అదే గిన్నెలో లేదా మరో కడాయిలో సరి పడా నూనె వేడి చేయాలి. నూనె కాగాక ఆవాలు, జీల కర్ర, కొద్దిగా మెంతులు, కరివేపాకు వేసి చిటపట లాడించాలి.
2. తర్వాత ఇందులో కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. ఆ వెంటనే..సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి చీలికలు వేసి ఉల్లి పాయలు బంగారు రంగులోకి వచ్చే వరకు చక్కగా వేయించాలి. ఉల్లి పాయలు వేగాక మంటను తగ్గించి పసుపు, కారం, ధనియాల పొడి, జీల కర్ర-మెంతుల పొడి వేసి పచ్చి వాసన పోయేలా రెండు నిమిషాలు కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా.. తీసి పెట్టుకున్న చింత పండు రసాన్ని అందులో పోసి, పులుసుకు సరి పడా తగినన్ని నీళ్లు కలపాలి. రుచికి సరి పడా ఉప్పు వేసి మంటను హై లో ఉంచి పులుసు బాగా మరగనివ్వాలి. పులుసు మరుగు తున్నప్పుడు నూనె పైకి తేలుతుంది.
Also Read: హోం మేడ్ దోశ ప్రిమిక్స్ పౌడర్..నెల రోజులైనా పాడవ్వదు తెలుసా ?
3. పులుసు పర్ఫెక్ట్గా మరిగాక, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేమ గడ్డ ముక్కలను ఇందులో వేయాలి. ఇప్పుడు మంటను మీడియం నుంచి లో.. ఫ్లేమ్‌కి మార్చి, మూతపెట్టి సుమారు 10 నిమిషాలు ఉడికించాలి. అప్పుడే పులుసులోని పులుపు, కారం దుంప లోపలికి వెళ్లి రుచి బాగుంటుంది. చివరగా సన్నగా తరిగిన తాజా కొత్తి మీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయాలి.
అంతే! గుమ గుమలాడే రాయలసీమ స్పెషల్ చేమగడ్డ కారం పులుసు రెడీ. ఈ వీకెండ్లో వేడి వేడి అన్నంతో.. ఈ పులుసును వడ్డించి మీ ఇంట్లో వాళ్లకు తినిపించండి, అందరూ అద్భుతమంటూ లొట్టలేసుకుంటూ తింటారు!