E-Paper
Advertisement

14 ఏళ్ల ప్రేమ.. బ్రేకప్.. కాజల్ లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులా!

14 ఏళ్ల ప్రేమ.. బ్రేకప్.. కాజల్ లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులా!
Advertisement

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్న ఈమె ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి పలు సినిమాలలో కీలకపాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల ఈమె నటించిన రామాయణ సినిమా(Ramayana Movie) ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమాలో ఈమె రావణాసురుడి భార్య మండోదరి పాత్రలో కనిపించారు. ఇక ఈ సినిమా విడుదలైన నేపథ్యంలో కాజల్ అగర్వాల్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.

14 ఏళ్ల ప్రేమలో బ్రేకప్..

ఈ నేపథ్యంలోనే కాజల్ ఒక సందర్భంలో తన భర్త గౌతం కిచ్లు(Gautham Kitchlu)తో ప్రేమ పెళ్లి అలాగే బ్రేకప్ గురించి సంచలన విషయాలను బయటపెట్టారు. కాజల్ 2020 లో గౌతం కిచ్లును ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నారు. అయితే తమది ప్రేమ వివాహమని మా ప్రేమలో బ్రేకప్స్ కూడా జరిగాయని కాజల్ అగర్వాల్ తెలిపారు.తాము సుమారు 14 సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్నామని కాజల్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా ప్రేమలో ఉన్న సమయంలో పరిస్థితులు మా మధ్య అనుకూలించలేదు అందుకే తాము బ్రేకప్ చెప్పుకొని విడిపోయామని తెలిపారు.

వేరే వారితో డేటింగ్ కూడా చేసాం..

Advertisement

ఇలా ఎవరి దారి వారు చూసుకున్న మేమిద్దరం వేరే వ్యక్తులతో కూడా డేటింగ్ చేశామని కాజల్ తెలిపారు.వేరే వ్యక్తులతో రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పటికీ, తమ ఇద్దరి మధ్య ఉన్న ప్రత్యేకమైన అనుబంధం ఏమిటో వారికి అర్థమైంది. బహుశా మేమిద్దరం ఒకరి ప్రాధాన్యత మరొకరు తెలుసుకోవడం కోసమే వేరే వాళ్లతో డేటింగ్ చేశామేమో! చివరకు మా దారులు మళ్లీ ఒక్కటయ్యాయి. ఇలా రెండోసారి మేమిద్దరం ఒకటైన తర్వాత మా జీవితం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈసారి మనం కలిసిన తర్వాత ఉంటే జీవితాంతం కలిసి ఉండాలి లేదంటే శాశ్వతంగా గుడ్ బై చెప్పుకోవాలని నిర్ణయించుకున్నాం.

మండోదరిగా కాజల్ అగర్వాల్..

Advertisement

నేను గౌతమ్ ఇద్దరు ఇదే ఆలోచనలో ఉన్నాము అయితే అదృష్టవశాత్తు మా బంధం అక్కడితో ఆగిపోకుండా ముందుకు వెళ్లిందని కాజల్ అగర్వాల్ తన లవ్ స్టోరీ గురించి తెలియజేశారు. ఇలా పెద్దల సమక్షంలో 2020 అక్టోబర్ 30వ తేదీ పెళ్లి చేసుకున్న ఈ దంపతులు ఒక మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇలా బిడ్డ పుట్టినప్పటికీ కాజల్ అగర్వాల్ సినిమా ఇండస్ట్రీకి దూరం అవుతుందని అందరూ భావించారు కానీ ఈమె మాత్రం తిరిగి ఇండస్ట్రీలో బిజీ అవుతున్నారు. సినిమాలలో హీరోయిన్గా కాకుండా కథ ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రామాయణ సినిమాలో మండోదరి పాత్రలో ఆకట్టుకున్న కాజల్ త్వరలోనే బాలకృష్ణ హీరోగా నటించిన దాదా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

Also Read: రూ.2 వేలతో అర్ధరాత్రి ట్రైన్ ఎక్కి వచ్చేసా.. జబర్దస్త్ నటి కష్టాలు మామూలుగా లేవుగా!

Related News

చిల్డ్రన్స్ డే స్పెషల్.. వృషకర్మ నుండి ఆకట్టుకుంటున్న మేకింగ్ వీడియో!

హీరోయిన్ కంగనా రనౌత్ పై కేస్ ఫైల్?

పోలీస్ గా సాయి పల్లవి..స్పెషల్ పాత్రలో రేణు దేశాయ్.. ‘ఓం’తెలుగు ట్రైలర్ చూశారా?

మగాడి గొప్పతనం ఏంటో చెప్పే ‘ఛప్రి’.. టీజర్ చూశారా?

సింపుల్ లుక్‌తోనే గ్లామర్ ట్రీట్.. నెట్టింట హీట్ పెంచుతున్న బాలీవుడ్ యంగ్ హీరోయిన్!

సేవ్ వైజాగ్ అంటూ పోస్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్!

ఒకవైపు పవన్.. మరోవైపు నాగ్.. అనిల్ రావిపూడి సినిమా ఎవరితోనో ?

Big Stories

Advertisement
×