E-Paper
Advertisement

అమెరికా విమానాశ్రయాల్లో గందరగోళం.. ఎయిర్ ఇండియా కీలక హెచ్చరిక!

అమెరికా విమానాశ్రయాల్లో గందరగోళం.. ఎయిర్ ఇండియా కీలక హెచ్చరిక!
Advertisement

Air India Travel Advisory: అమెరికాకు వెళ్లాలనుకునే లేదంటే అక్కడి నుంచి భారత్‌కు తిరిగి వచ్చే విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా కీలక సూచన చేసింది. అమెరికాలోని పలు విమానాశ్రయాల్లో సమాచార వ్యవస్థలో అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో విమాన సర్వీసులపై ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ పరిస్థితుల కారణంగా విమానాల రాకపోకల్లో ఆలస్యం కావడంతో పాటు పలు మార్పులు చోటుచేసుకోవచ్చని తెలిపింది. అమెరికా విమానాశ్రయాల్లో ఏర్పడిన అంతరాయంపై ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఎయిర్ ఇండియా ట్రావెల్ అడ్వైజరీ విడుదల చేసింది.

విమాన సర్వీసులపై ప్రభావం పడే అవకాశం

అమెరికాలో విమాన రాకపోకలకు సంబంధించిన సమాచార వ్యవస్థలో అంతరాయం ఏర్పడటంతో దేశ వ్యాప్తంగా విమాన కార్యకలాపాలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు రాకపోకలు సాగించే తమ విమాన సర్వీసుల షెడ్యూల్‌లో మార్పులు జరిగే అవకాశం ఉందని ఎయిర్ ఇండియా ప్రకటించింది. ముఖ్యంగా అమెరికాకు వెళ్లేందుకు ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు ఫ్లైట్ స్టేటస్ తప్పనిసరిగా చెక్ చేయాలని  సూచించింది. విమానాశ్రయానికి బయలుదేరే ముందు తాజా సమాచారాన్ని తెలుసుకోవడం ద్వారా అనవసరమైన ఇబ్బందులను నివారించుకోవచ్చని తెలిపింది.

వెబ్‌సైట్‌లో ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోండి..

Advertisement

ప్రయాణికులు ఎయిర్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ను చూసి తమ విమానానికి సంబంధించిన తాజా వివరాలను తెలుసుకోవాలని కంపెనీ సూచించింది. విమానం సమయానికి బయలుదేరుతుందా? ఆలస్యం ఉందా? షెడ్యూల్‌లో ఏమైనా మార్పులు జరిగాయా? అనే వివరాలను ముందుగానే చెక్ చేసుకోవాలన్నది. ఫ్లైట్ స్టేటస్ ను బట్టి విమానాశ్రయానికి చేరుకునే సమయాన్ని ప్లాన్ చేసుకోవడం మంచిదని వెల్లడించింది.

పరిస్థితిని గమనిస్తున్న ఎయిర్ ఇండియా

అమెరికా విమానాశ్రయాల్లో నెలకొన్న పరిస్థితులను తమ టీమ్స్ నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని ఎయిర్ ఇండియా వెల్లడించింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తామని తెలిపింది. పరిస్థితిలో వచ్చే మార్పులను బట్టి తదుపరి ప్రయాణ సూచనలు జారీ చేస్తామని పేర్కొంది.  అమెరికాకు ప్రయాణించేవారు విమానాశ్రయానికి వెళ్లే ముందు అధికారిక వెబ్‌సైట్‌లో తాజా వివరాలను పరిశీలించడం మంచిదని తెలిపింది.

Advertisement

Read Also: ప్రపంచం చూపు భారత్‌పైనే..టూరిస్టులను కట్టిపడేసే 10 అద్భుత ప్రదేశాలు ఇవే!

Tags

Related News

RAC విధానానికి గుడ్ బై.. రైల్వే సంచలన నిర్ణయం!

ప్రపంచం చూపు భారత్‌పైనే..టూరిస్టులను కట్టిపడేసే 10 అద్భుత ప్రదేశాలు ఇవే!

టికెట్ చెకింగ్ పేరుతో వసూళ్లు.. కిలేడీ ఆటకట్టించిన రైల్వే ఉద్యోగి!

రైలులో టికెట్ లేని ప్రయాణం.. ఆర్మీ జవాన్లు, మహిళా టీటీఈకి మధ్య గొడవ.. రెండుగా చీలిన నెటిజన్లు!

ఇంజిన్ లేకుండానే పరుగులు.. బాబోయ్.. వందే భారత్‌లో ఇన్ని రహస్యాలా?

ఈ పాస్‌పోర్ట్‌కు సూపర్ క్రేజ్.. బెంగళూరులో రాత్రి 2 గంటల నుంచి బారులు తీరిన యువత

వర్షాలు లేకపోయినా జలపాతాల్లో నీరు ఎలా? కర్రెగుట్టల్లో వింత ప్రకృతి అద్భుతం!

Big Stories

Advertisement
×