E-Paper
Advertisement

చిల్డ్రన్స్ డే స్పెషల్.. వృషకర్మ నుండి ఆకట్టుకుంటున్న మేకింగ్ వీడియో!

చిల్డ్రన్స్ డే స్పెషల్.. వృషకర్మ నుండి ఆకట్టుకుంటున్న మేకింగ్ వీడియో!
Advertisement

VrushaKarma Movie:నవంబర్ 14.. నేడు చిల్డ్రన్స్ డే కావడంతో పలువురు సెలబ్రిటీలు పిల్లలకు చిల్డ్రన్స్ డే స్పెషల్ విషెస్ తెలియజేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ‘వృషకర్మ’ టీమ్ కూడా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిల్డ్రన్స్ డేను మరింత స్పెషల్ గా జరుపుకున్నారు.. షూటింగ్ సెట్ నుండి పంచుకున్న ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

చిల్డ్రన్స్ డే స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన వృషకర్మ టీమ్..

డిసెంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఒకవైపు ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్ర బృందం. ఆ ప్రమోషన్స్ లో భాగంగానే వృషకర్మ సినిమా టీమ్ పిల్లలతో కలిసి చిల్డ్రన్స్ డే ను చాలా ఘనంగా జరుపుకున్నారు. సుమారుగా 40 సెకండ్ల నిడివి ఉన్న ఈ ప్రచార వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పైగా ఈ ప్రత్యేక క్లిప్ లో వృషకర్మ ప్రధాన నటీనటులైన నాగచైతన్య(Naga Chaitanya), మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) తో పాటు చిన్నారి కియారా వంటి యువ నటీనటులు కూడా సినిమా షూటింగ్ ప్రదేశంలో కలిసి కనిపించారు. అంతేకాదు కియారా మేకింగ్ వీడియో ని కూడా ఈ 40 సెకండ్ల వీడియోలోనే జోడించడం గమనార్హం ..మొత్తానికైతే చిల్డ్రన్స్ డే స్పెషల్ సందర్భంగా వృషకర్మ టీమ్ విడుదల చేసిన ఈ స్పెషల్ మీట్ మరింత వైరల్ గా మారింది.

డిసెంబర్ 4న థియేటర్లలోకి వృషకర్మ..

Advertisement

విరూపాక్ష సినిమాతో డైరెక్టర్ గా సంచలనం సృష్టించిన కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో నాగ చైతన్య నటిస్తున్న తెలుగు పౌరాణిక యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం వృషకర్మ. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుండగా.. స్పర్శ్ శ్రీవాత్సవ విలన్ పాత్ర పోషిస్తున్నారు. జయరాం, జరీనా వాహబ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్, భోగవల్లి బాపినీడు, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

నాగచైతన్య తదుపరి చిత్రాలు..

వినూత్నమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న నాగచైతన్య తండేల్ తర్వాత నటిస్తున్న చిత్రమే వృషకర్మ. ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవాలని ఆయన గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రంతో పాటు ప్రముఖ డైరెక్టర్ శివా నిర్వాణ దర్శకత్వంలో కూడా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. అలాగే మరో క్లాక్స్ ప్రాజెక్టులో కూడా నాగచైతన్య భాగమయ్యారు. ఏది ఏమైనా ఇప్పుడు వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ అభిమానులను ఇటు సినీ ప్రియులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

also read:హీరోయిన్ కంగనా రనౌత్ పై కేస్ ఫైల్?

మీనాక్షి చౌదరి కెరియర్..

మీనాక్షి చౌదరి విషయానికి వస్తే.. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈమె సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం వృషకర్మ సినిమాలో నటిస్తున్న ఈమె అటు భావ్ ధూళియా దర్శకత్వంలో రాబోతున్న యాక్షన్ చిత్రం ఫోర్స్ 3 లో కూడా నటిస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 19న రిలీజ్ చేయబోతున్నారు. అలాగే వచ్చే ఏడాది సమ్మర్ హాలిడేస్ టార్గెట్ గా రాబోతున్న కార్తి 30వ చిత్రంలో కూడా ఈమె హీరోయిన్గా నటిస్తోంది. అలాగే శింబు నటిస్తున్న 51వ చిత్రంలో కూడా ఈమె హీరోయిన్గా నటిస్తోంది.

Related News

14 ఏళ్ల ప్రేమ.. బ్రేకప్.. కాజల్ లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులా!

హీరోయిన్ కంగనా రనౌత్ పై కేస్ ఫైల్?

పోలీస్ గా సాయి పల్లవి..స్పెషల్ పాత్రలో రేణు దేశాయ్.. ‘ఓం’తెలుగు ట్రైలర్ చూశారా?

మగాడి గొప్పతనం ఏంటో చెప్పే ‘ఛప్రి’.. టీజర్ చూశారా?

సింపుల్ లుక్‌తోనే గ్లామర్ ట్రీట్.. నెట్టింట హీట్ పెంచుతున్న బాలీవుడ్ యంగ్ హీరోయిన్!

సేవ్ వైజాగ్ అంటూ పోస్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్!

ఒకవైపు పవన్.. మరోవైపు నాగ్.. అనిల్ రావిపూడి సినిమా ఎవరితోనో ?

Big Stories

Advertisement
×