OTT Movies : ఓటీటీలోకి ఈ మధ్య ఆసక్తికర సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో కొన్ని సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న ప్రతి సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. హారర్, సస్పెన్స్ సినిమాలకు జనాలు మొగ్గు చూపిస్తున్నారు.. గత ఏడాది నుంచి ఇండస్ట్రీ నుంచి వస్తున్న ప్రతి సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ హారర్ సినిమా స్ట్రీమింగ్ కి వచ్చేస్తుంది. ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఈ మూవీ పేరేంటి? ఎక్కడ చూడొచ్చనో ఒకసారి తెలుసుకుందాం..
మూవీ & ఓటీటీ..
సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నటుడు నాజర్.. కొన్ని సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించి అందరినీ మెప్పించాడు. ఈయన నటించిన ఓ మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేస్తుంది.. నాజర్ ప్రధాన పాత్రలో నటించిన కోలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీ ది అకాలి తెలుగులో వస్తోంది. ఏప్రిల్ 26 నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది.. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ అఫీషియల్‌గా ప్రకటించింది. తమిళంలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ తెలుగులో మాత్రం నేరుగా ఓటీటీలోకి వస్తోంది. అటు తమిళ వర్షన్ కూడా ఆహా లోని స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.. ఈ చిత్రానికి మహమ్మద్ ఆసిఫ్ దర్శకత్వం వహించారు. నాజర్‌తో పాటు తలైవాసల్ విజయ్, జయకుమార్ జానకిరామన్ తదితరులు ఇందులో నటించారు..
స్టోరీ విషయానికొస్తే..
2024 మే లో రిలీజ్ అయిన ఈ మూవీ మైండ్ బ్లాక్ చేసే సన్నివేశాలు, ట్విస్టుల తో కూడిన హారర్ సీన్లు, అలాగే ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ తమ నటనకు 100 శాతం న్యాయం చేశారు.. జానిస్ అనే అమ్మాయి క్షుద్రవిద్యలు సహాయంతో అమాయకులను హత్య చేస్తుంటుంది. అయితే ఆ హత్యల వెనుక ఎవరు హస్తముంది..? నగరంలో జరుగుతున్న హత్యలు కనుక ఎవరో ఉన్నారని పోలీసులు నిగా పెడతారు.. ఓ పోలీస్ ఆఫీసరు ఈ హత్యలు వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తాడు. ఆయనను మరొకరు కాపాడుతారు.. ఇంతకీ ఆ కాపాడిన వ్యక్తికి ఈ పోలీస్ వ్యక్తికి సంబంధం ఏంటి అసలు ఈ హత్యలు వెనుక అసలు రహస్యాలు ఏంటి అనే దాని చుట్టు స్టోరీ తిరుగుతుంది.. అయితే ఇందులో ఎటువంటి పాటలు, సీన్స్ లేవు. సీరియస్ డార్క్ హారర్ థ్రిల్లర్‌గా దర్శకుడు ది అకాలి మూవీని తెరకెక్కించాడు. తమిళంలో చాలా కాలం తర్వాత నాజర్ లీడ్ రోల్‌లో నటించిన మూవీ ఇది.. థియేటర్లలో మంచి సక్సెస్ ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలోకి వచ్చేస్తుంది. ఇవాళ అర్ధరాత్రి నుంచే సినిమా స్ట్రీమింగ్ కి రాబోతుంది. మరి ఆలస్యం ఎందుకు మీరు కూడా ఇక్కడ చూసేయండి.. నాజరు తెలుగులో కూడా మంచి నటుడిగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తెలుగు తో పాటు తమిళ సినిమాల్లో నటిస్తున్నాడు..