BigTV English
Advertisement

Ovarian Cancer : అండాశయ క్యాన్సర్ నిర్ధారణలో కొత్త ప్రయోగం సక్సెస్.

Ovarian Cancer : అండాశయ క్యాన్సర్ నిర్ధారణలో కొత్త ప్రయోగం సక్సెస్.
Ovarian Cancer


Ovarian Cancer : ఈరోజుల్లో క్యాన్సర్ విషయంలో చికిత్సా విధానాల్లో చాలా మార్పులు జరిగాయి. ఒకప్పుడు క్యాన్సర్ అంటే ప్రాణాంతక వ్యాధి అని, దానికి చికిత్స ఉండదని, కచ్చితంగా క్యాన్సర్ వచ్చిన వారు మరణించక తప్పదు అనే పరిస్థితి ఉండేది. కానీ గత కొన్నేళ్లలో టెక్నాలజీ సాయంతో క్యాన్సర్‌కు చికిత్స పద్ధతులు ఆచరణలోకి వచ్చాయి. అంతే కాకుండా ఒకదానికి మించి మరొకటి మెరుగైన చికిత్స పద్ధతులను శాస్త్రవేత్తలు కనిపెట్టడం మొదలుపెట్టారు. తాజాగా అండాశయ క్యాన్సర్ విషయంలో కూడా అదే జరిగింది.

ఏ క్యాన్సర్‌కు అయినా చికిత్సను కనిపెట్టాలంటే ముందుగా మనిషి శరీరంలో దానికి కారణమయ్యే మాలిక్యూల్స్‌ను, ప్రొటీన్స్‌ను కనిపెట్టాలి. ఇప్పటికీ కొన్ని రకాల క్యాన్సర్‌లకు ఏది కారణమవుతుంది అని తెలియకపోవడం వల్లే వాటికి మెరుగైన చికిత్సను అందించే అవకాశం ఉండడం లేదు. అదే విధంగా అండాశయ క్యాన్సర్‌కు మూడు రకాల ప్రొటీన్స్ కారణమవుతాయని శాస్త్రవేత్తలు ఇదివరకే కనిపెట్టారు. కానీ అవి ఏంటి అని తాజాగా కనుగొన్నారు. పాలికెటోన్ కోటింగ్‌తో ఉన్న నానోవైర్స్ సాయంతో ఈ ప్రొటీన్స్‌ను కనిపెట్టి.. అండాశయ క్యాన్సర్‌ను నిర్ధారించే విషయంలో కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు.


అండాశయ క్యాన్సర్‌ను స్టార్టింగ్ స్టేజ్‌లోనే కనిపెట్టగలిగితే.. దానికి చికిత్సను కూడా సులభంగా అందించవచ్చు. కానీ ఈ రకమైన క్యాన్సర్‌ను స్టార్టింగ్ స్టేజ్లలో కనిపెట్టడం కష్టం. తాజాగా అండాశయ క్యాన్సర్ ప్రొటీన్స్‌ను కనిపెట్టిన ప్రక్రియతో ఈ క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్‌ను కనిపెట్టే అవకాశాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ రకమైన క్యాన్సర్‌కు కారణమయ్యే ప్రొటీన్స్‌ను ఎక్సోసోమ్స్ అంటారని తెలుస్తోంది. ఇవి ఎప్పుడూ క్యాన్సర్ సెల్స్ బయటే ఉంటాయి. కాబట్టి రక్తం, యూరిన్, సలైవా ద్వారా వీటిని బయటికి తీసే అవకాశం ఉంది.

అండాశయ క్యాన్సర్‌ ప్రొటీన్స్‌ను కనిపెట్టే ప్రక్రియ ముందుగా చాలా కష్టంగా అనిపించిందని, కానీ ఎన్నో యాంటీబాడీస్ ప్రయోగించిన తర్వాత వారి ప్రయోగం సక్సెస్ అయ్యిందని అంటున్నారు శాస్త్రవేత్తలు. నానోవైర్స్ కోటింగ్ విషయంలో కూడా 3,4 వేర్వేరు కోటింగ్స్‌ను ప్రయత్నించి చూశామన్నారు. కేవలం అండాశయ క్యాన్సర్ విషయంలోనే కాదు.. తాజాగా వారి చేసిన పరిశోధన ఎన్నో ఇతర వ్యాధులను కూడా ముందే గ్రహించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రస్తుతం దీని వల్ల అండాశయ క్యాన్సర్‌ను గుర్తించడం సులభంగా మారింది కాబట్టి దీని ఆధారంగా ఆ క్యాన్సర్‌కు మెరుగైన చికిత్సను అందించడానికి ప్రయత్నిస్తామని అన్నారు.

Tags

Related News

White Bread: బ్రెడ్ తింటున్నారా ? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలివే !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు.. క్యారెట్ తింటే జరిగేది ఇదే !

Idli Chaat: ఇడ్లీ మిగిలిపోయిందా? ఇలా ఇడ్లీ చాట్ చేసేయండి, క్రంచీగా అదిరిపోతుంది

Katte Pongali: నోటిలో పెడితే కరిగిపోయేలా కట్టె పొంగలి ఇలా చేసేయండి, ఇష్టంగా తింటారు

Kind India: కొత్త ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ తో కైండ్ ఇండియా.. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే?

Darkness Around The Lips: పెదాల చుట్టూ నలుపు తగ్గాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు !

Moringa Powder: బరువు తగ్గడానికి.. మునగాకు పొడిని ఎలా వాడాలో తెలుసా ?

Arthritis Pain: కీళ్ల నొప్పులా ? వీటితో క్షణాల్లోనే.. పెయిన్ రిలీఫ్

Big Stories

×