BigTV English

Apple Stickers : ఆపిల్ మీది స్టిక్కర్లలోని నంబర్ల ముచ్చట తెలుసా?

Apple Stickers : ఆపిల్ మీది స్టిక్కర్లలోని నంబర్ల ముచ్చట తెలుసా?
secret

Apple Stickers : ప్రస్తుతం మనం మార్కెట్లో చూసే ఆపిల్స్‌ స్టిక్కర్లతో కనిపిస్తుంటాయి. స్టిక్కర్ కనిపించగానే చాలామంది అది మంచి క్వాలిటీ పండు అని, ఏ కాశ్మీర్ నుంచో దిగుమతి అయిందనో అనుకుంటూ ఉంటారు. అయితే.. ఆ స్టిక్కర్ ఆ పండు ఎలా సాగుచేయబడిందనే వివరాలను మాత్రమే తెలియజేస్తుంది.


సాధారణంగా ఆపిల్స్ మీది స్టిక్కర్ మీద 4 లేదా 5 అంకెలు ఉంటాయి. ఆ నంబరును PLU CODE (PRICE LOOK UP CODE) అంటారు. ఈ codeను IFPS (International federation for produce standards) సంస్థ నిర్థారిస్తుంది.

స్టిక్కర్ మీది codeలో మొదటి అంకె 4 లేదా 3 తో మొదలైతే (ఉదాహరణకు 4113, 3269…) ఆ పండును ఎరువులు మరియు పురుగు మందులు(pesticides) వాడి పండించారని అర్థం. అంటే.. ఎంతో కొంత వాటిపై రసాయనిక ఎరువులు, పురుగుమందుల అవశేషాలున్నట్లే లెక్క. ఇలాంటి పండును కొన్నవారు.. వాటిని కాస్త ఉప్పు నీటిలో వేసి ఉంచి, తర్వాత బాగా కడిగి తినాలి.


స్టిక్కర్ మీది codeలో మొదటి అంకె 9 తో మొదలై 5 అంకెలు ఉంటే (ఉదాహరణకు 94325, 94115) ఆ పండు కృత్రిమ ఎరువులు, పురుగు మందులు వాడకుండా పండించారని అర్థం.(ఆర్గానిక్). వీటిని ఎలాంటి అనుమానం లేకుండా కడిగి తినేయొచ్చు.

స్టిక్కర్ మీద మొదటి అంకె 8 ఉండి 5 అంకెలుంటే.. (ఉదాహరణకు 84113, 83642…. ఇలా) ఆ పండును GMO (Genetically modified organism) అంటారు. ఈ పండుకు చీడపీడలు ఆశించకుండా.. దీని జన్యురూపంలో మార్పులు చేసి పండించారని అర్థం. వీటిని తినటం చాలా ప్రమాదకరం. పిల్లలు అసలే వీటిని ముట్టరాదు. ఇప్పటికే పలు దేశాలు వీటి వినియోగాన్ని నిషేధించాయి.

ఇదే..కోడ్ ఆరెంజ్ వంటి పండ్లకూ వర్తిస్తుంది. ఏది ఏమైనా.. ఈసారి పండ్లు కొనేట్టప్పడు వాటిమీది స్టిక్కర్‌ మీది నంబర్లను ఓసారి గమనించి తీసుకోండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

చివరగా.. మన రోడ్ల మీద పండ్లు అమ్మేవారిలో చాలామంది నకిలీ స్టిక్కర్లు అంటించి వీటిని మంచి పండ్లుగా చూపించే ప్రయత్నాలు చేస్తుంటారు. కనుక ఆపిల్, ఆరెంజ్ వంటివి కొనేటప్పుడు కాస్త పేరున్న దుకాణాల్లో కొనుగోలు చేయటం మంచిది.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×