BigTV English

Thyroid Disease: థైరాయిడ్ ఉన్న వారు.. పొరపాటున కూడా ఇవి తినొద్దు !

Thyroid Disease: థైరాయిడ్ ఉన్న వారు.. పొరపాటున కూడా ఇవి తినొద్దు !

Thyroid Disease: థైరాయిడ్ అనేది మన శరీరంలోని ఒక ముఖ్యమైన గ్రంథి. ఇది థైరాక్సిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ మన శరీరంలోని జీవక్రియలను నియంత్రిస్తుంది. థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోతే.. హైపోథైరాయిడిజం (థైరాక్సిన్ తక్కువ ఉత్పత్తి) లేదా హైపర్‌థైరాయిడిజం (థైరాక్సిన్ ఎక్కువ ఉత్పత్తి) వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలను అదుపులో ఉంచడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని ఆహార పదార్థాలు థైరాయిడ్ పనితీరుకు ఆటంకం కలిగిస్తాయి. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు అస్సలు తినకుండా ఉండాల్సిన ఆహార పదార్థాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.


1. గోయిట్రోజెన్‌లు కలిగిన ఆహారాలు:
కొన్ని కూరగాయలలో గోయిట్రోజెన్‌లు అనే పదార్థాలు ఉంటాయి. ఇవి థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకుంటాయి. థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఈ ఆహార పదార్థాలను తగ్గించాలి లేదా పూర్తిగా మానేయాలి.

క్రూసిఫెరస్ కూరగాయలు: క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ, ముల్లంగి, టర్నిప్. వీటిని పూర్తిగా వండకుండా పచ్చిగా తింటే మరింత ప్రమాదకరం. ఉడికించిన తర్వాత గోయిట్రోజెన్‌ల ప్రభావం తగ్గుతుంది.


సోయా ఉత్పత్తులు: సోయా బీన్స్, సోయా పాలు, టోఫు వంటివి థైరాయిడ్ హార్మోన్‌ల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి.

2. ప్రాసెస్డ్ ఫుడ్స్:
ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో ట్రాన్స్ ఫ్యాట్స్, ప్రాసెస్డ్ షుగర్, కృత్రిమ రంగులు, రుచులు అధికంగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ పనితీరును అడ్డుకోవడమే కాకుండా.. శరీరంలో వాపులకు కారణమవుతాయి.

జంక్ ఫుడ్స్: బర్గర్లు, పిజ్జాలు, ఫ్రైస్ వంటివి.

ప్యాకేజ్డ్ స్నాక్స్: చిప్స్, బిస్కట్లు, కేకులు.

డీప్ ఫ్రైడ్ ఫుడ్స్: నూనెలో వేయించిన సమోసాలు, పకోడీలు, పూరీ వంటివి.

3. గ్లూటెన్ అధికంగా ఉండే ఆహారాలు:
గ్లూటెన్ అనేది గోధుమ, బార్లీ వంటి ధాన్యాలలో ఉండే ప్రోటీన్. థైరాయిడ్ సమస్య ఉన్న చాలామందికి గ్లూటెన్ సెన్సిటివిటీ ఉంటుంది. గ్లూటెన్ థైరాయిడ్ గ్రంథిని ప్రభావితం చేస్తుంది.

గోధుమ ఉత్పత్తులు: బ్రెడ్, పాస్తా, కేకులు, బిస్కట్లు.

బార్లీ, రై: ఈ ధాన్యాల ఉత్పత్తులు కూడా తగ్గించాలి.

4. కొన్ని డ్రింక్స్:
కెఫిన్: టీ, కాఫీ వంటి వాటిలో ఉండే కెఫిన్ థైరాయిడ్ మందుల పనితీరును ప్రభావితం చేస్తుంది. ఉదయం థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత కనీసం ఒక గంట పాటు టీ లేదా కాఫీ తాగకూడదు.

ఆల్కహాల్: ఇది థైరాయిడ్ హార్మోన్‌ల ఉత్పత్తిని దెబ్బతీస్తుంది. అంతే కాకుండా కాలేయ పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది.

Also Read: టైం లేదని వేగంగా తింటున్నారా ? ఎంత ప్రమాదమో తెలిస్తే ఈ రోజే మానేస్తారు !

5. అధిక ఫైబర్ ఉన్న ఆహారాలు:
ఫైబర్ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.. అధిక ఫైబర్ ఒకేసారి తీసుకోవడం వల్ల థైరాయిడ్ మందులు సరిగ్గా శరీరంలోకి చేరవు. అందుకే మందులు వేసుకున్న తర్వాత అధిక ఫైబర్ ఉండే ఆహారాలు తీసుకోవడం మానుకోవాలి.

థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు ఈ ఆహారాలను తగ్గించడం లేదా పూర్తిగా మానుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సరైన ఆహారం, వ్యాయామం, సమయానికి మందులు తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్యలను నియంత్రించుకోవచ్చు. ఏదైనా కొత్త ఆహారం తీసుకోవడానికి ముందుడ డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

Related News

Easy Egg Recipes: ఎగ్స్‌తో తక్కువ టైంలో.. సింపుల్‌గా చేసే బెస్ట్ రెసిపీస్ ఇవే !

Dondakaya Fry: పక్కా ఆంధ్రా స్టైల్ దొండకాయ ఫ్రై.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

Health tips: గుండెల మీద ఎవరైనా కూర్చొన్నట్లు అనిపిస్తోందా? దానిని ఏమంటారో తెలుసా?

Navratri Fasting: నవరాత్రి ఉపవాస సమయంలో.. ఈ ఫుడ్ తింటే ఫుల్ ఎనర్జీ !

Fast Eating: టైం లేదని వేగంగా తింటున్నారా ? ఎంత ప్రమాదమో తెలిస్తే ఈ రోజే మానేస్తారు !

Dates Benefits: డైలీ రెండు ఖర్జూరాలు తింటే ? బోలెడు లాభాలు !

Alcohol: 30 రోజులు ఆల్కహాల్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×