E-Paper
Advertisement

చికెన్ కీమా పరోటా ఇలా చేసుకుని తిన్నారంటే.. టేస్ట్ వేరే లెవెల్ అంతే!

చికెన్ కీమా పరోటా ఇలా చేసుకుని తిన్నారంటే.. టేస్ట్ వేరే లెవెల్ అంతే!
Advertisement

Chicken Keema Parotta: సాధారణ పరోటా కంటే కాస్త భిన్నంగా, మసాలాల రుచితో నిండిన చికెన్ కీమా పరోటా తింటే ఆ రుచిని ఎప్పటికీ మర్చిపోలేరు. బయటకు కరకరలాడుతూ.. లోపల మెత్తటి చికెన్ కీమా మసాలాతో నిండిన ఈ పరోటా చిన్నా పెద్దా అందరికీ నచ్చుతుంది. ముఖ్యంగా చికెన్ ఇష్టపడేవారికి ఇది మంచి విందు అనే చెప్పాలి. ఉదయం అల్పాహారంగా, మధ్యాహ్నం లంచ్‌లో లేదా రాత్రి డిన్నర్‌లో కూడా ఈ పరోటాను చేసుకోవచ్చు. పెరుగు పచ్చడి, ఉల్లిపాయ ముక్కలు లేదా చికెన్ గ్రేవీతో కలిపి తింటే రుచి మరింత పెరుగుతుంది. ఇంట్లోనే ఎంతో రుచికరమైన చికెన్ కీమా పరోటాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.

కావాల్సిన పదార్థాలు:

గోధుమ పిండి – 2 కప్పులు
చికెన్ కీమా – 250 గ్రాములు
ఉల్లిపాయలు – 2
టమోటాలు – 2
పచ్చిమిర్చి – 4
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
కారం – 1 టీస్పూన్
పసుపు – అర టీస్పూన్

Advertisement

Also Read: తక్కువ పదార్థాలతో ఎంతో రుచికరమైన గార్లిక్ బటర్ ప్రాన్స్.. తయారీ కూడా చాలా సులభం!
గరం మసాలా – 1 టీస్పూన్
ధనియాల పొడి – 1 టీస్పూన్
జీలకర్ర – అర టీస్పూన్
కొత్తిమీర – కొద్దిగా
ఉప్పు – తగినంత
నూనె – సరిపడా
నీళ్లు – తగినన్ని

తయారీ విధానం:

ఒక గిన్నెలో గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. ఇందులో తగినన్ని నీళ్లు పోస్తూ మెత్తగా పిండి కలుపుకోవాలి. కొద్దిగా నూనె రాసి మూత పెట్టి 20 నిమిషాల పాటు పక్కన ఉంచాలి.

Advertisement

ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టి నూనె వేయాలి. వేడయ్యాక జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. తర్వాత టమోటా ముక్కలు వేసి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి.

ఇందులో పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు చికెన్ కీమా వేసి మసాలాలన్నీ పట్టేలా బాగా కలపాలి. మూత పెట్టి మధ్యస్థ మంటపై చికెన్ పూర్తిగా ఉడికే వరకు ఉంచాలి. చివరగా కొత్తిమీర చల్లి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. కీమా మిశ్రమం చల్లారనివ్వాలి.

ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న ఉండలుగా చేసుకుని పరోటాల్లా కొద్దిగా ఒత్తాలి. మధ్యలో చికెన్ కీమా మిశ్రమం పెట్టి అంచులు మూసి మళ్లీ జాగ్రత్తగా పరాటాలా ఒత్తుకోవాలి.

వేడి పెనంపై పరోటా వేసి రెండు వైపులా నూనె లేదా నెయ్యి వేస్తూ బంగారు రంగు వచ్చే వరకు కాల్చాలి. అంతే.. వేడివేడి చికెన్ కీమా పరోటా సిద్ధం. పెరుగు పచ్చడితో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది.

Also Read: లైఫ్‌లో ఒక్కసారైనా ఈ చాక్లెట్ లావా కేక్ రుచి చూడాల్సిందే.. 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి!

Tags

Related News

హోటల్ స్టైల్ పూరీ కర్రీ..ఇంట్లోనే పక్కా కొలతలతో ఇలా చేయండి!

పక్కా కొలతలతో అదిరిపోయే టమాటో పచ్చడి..ఎన్ని రోజులైనా టేస్ట్ మారదు!

దీపావళికి ఇంటి టెర్రస్‌పై పార్టీ ఐడియా అదుర్స్.. ఈ విధంగా డెకరేషన్ చేయండి

30 ఏళ్లు దాటాక చేతులు, కాళ్ల చర్మంపై ముడతలు కనిపిస్తున్నాయా? ఈ 4 చిట్కాలు పాటించండి

మాట్లాడేటప్పుడు కళ్లు పక్కకు తిప్పడం బలహీనత కాదా? సైకాలజీ చెప్తున్న అసలు నిజమిదే!

చాణక్య నీతి.. ఇలా ఆలోచించేవారు మాత్రమే ధనవంతులు అవుతారు

భారతదేశంలో మొట్టమొదటి రామాయణం సినిమా.. రాముడు, సీత పాత్రలు పోషించిన ఒకే నటుడు

Big Stories

Advertisement
×