BigTV English

BJP Master Sketch On South: నార్త్‌లో సై అంటే సై అనే పొజిషన్‌లో ఉన్న బీజేపీ.. మోడీ వ్యూహం ఇదేనా!?

BJP Master Sketch On South: నార్త్‌లో సై అంటే సై అనే పొజిషన్‌లో ఉన్న బీజేపీ.. మోడీ వ్యూహం ఇదేనా!?
BJP Master Sketch On South
 

ఈసారి ఎన్డీఏ సాధించే ఎంపీ సీట్లు 400.. ఇది మా మాట కాదు.. ఈ మధ్య వారి పార్టీ నేతలకు ప్రధాని నరేంద్రమోడీ విధించిన టార్గెట్.. అయితే నార్త్‌లో పరిస్థితిలో ఎలా ఉన్నా..
సౌత్‌లోనే దారుణంగా ఉంది పరిస్థితి. మోడీ అనుకున్న టార్గెట్‌ రీచ్ కావాలంటే సౌత్‌లో ఎంపీ సీట్ల సంఖ్య పెరగాల్సిందే. మొత్తం 543 ఎంపీ సీట్లు ఉంటే.. దక్షిణాది రాష్ట్రాలైన కేరళలో 20, తమిళనాడులో 39, ఆంధ్రప్రదేశ్ 25, తెలంగాణలో 17.. కర్నాటకలో 28, పుదుచ్ఛేరిలో ఒక సీటు ఉన్నాయి. మొత్తం కలిపి 131 ఎంపీ సీట్లు ఉన్నాయి సౌత్‌ స్టేట్స్‌లో.. అందుకే దక్షిణాది రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్‌ పెట్టింది బీజేపీ..
ఇందుకు తగ్గట్టుగా ఒక్కో స్టేట్‌లో ఒక్కో స్ట్రాటజీని ఫాలో అవుతుంది. ఇప్పుడు ఒక్కో స్టేట్‌లో బీజేపీ ఏం చేస్తుందో చూద్దాం.

Also Read: కవితకు కష్టమే! నెక్ట్స్ అరెస్ట్ ఆయనేనా? సుకేశ్ లేఖలో ఏముంది ?


అయితే ఈసారి మళ్లీ నేరుగా బీజేపీతో పొత్తు పెట్టుకొని పదిసీట్లు దక్కించుకుంది..

నిజానికి బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడానికి ముందు.. మళ్లీ AIADMKతో పొత్తు చర్చలకు ప్రయత్నించారు PMK అధినేత రామదాస్‌..దీని కోసం ఆయన ఓ దూతను కూడా పంపినట్టు తెలుస్తోంది. కానీ అప్పటికే బీజేపీతో చర్చలు తేలడంతో PMK-AIADMK మధ్య బంధం వీడిపోయింది. అధికారిక ఎన్నికల ఒప్పందంపై బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కె. అన్నామలై సంతకం చేశారు. అయితే తమిళనాడులో AIADMK, DMKలకు ధీటుగా ఎదిగేందుకు.. అన్నామలై చేస్తున్న కృషిలో భాగంగానే ఈ పొత్తు కుదిరినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. ఇటీవల బీజేపీ 15 మంది మాజీ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీని కూడా చేర్చుకుంది..

తమిళనాడులోని వన్నియార్‌ సామాజిక వర్గంలో దాదాపు 6 శాతం ఓటు బ్యాంకు PMKకు ఉంది. ఉత్తర తమిళనాడులో ఓటు షేర్‌ పెంచుకోవాలనే ప్లాన్‌లోనే ఈ పొత్తు కుదిరినట్టు తెలుస్తోంది. ఇలా పొత్తులు, చేరికలతో తమిళనాడులో ఎక్కువ సీట్లు తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్‌ చేసేలా.. ఇప్పటికే మోడీ షెడ్యూల్ పూర్తైనట్టు తెలుస్తోంది.దీనికి తోడు అన్నామలై పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఓ కొత్త జోష్‌ కనిపిస్తోంది. నా మట్టి.. నా ప్రజలు పేరుతో చేసిన పాదయాత్ర అనూహ్య స్పందన వచ్చింది. 6 నెలల పాటు 234 అసెంబ్లీ అసెంబ్లీ నియోజకవర్గాలు. 39 లోక్‌సభ నియోజకవర్గాలను కలుపుతూ సాగింది ఈ యాత్ర. వచ్చే ఎన్నికల ఫలితాలపై ఈ యాత్ర ఎఫెక్ట్ తప్పకుండా కనిపించే అవకాశం ఉంది. ఇది తమిళనాడు సిట్యూవేషన్..

ఇక కర్ణాటకకు వద్దాం.. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ దారుణంగా ఓడిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్‌ గెలుపు జోష్‌లో ఉంది.. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదే అనే ధీమాలో ఉంది.
అయితే మొన్నటివరకు బీజేపీ ప్రభుత్వంలో ఉండటంతో.. దానికి ఇంకా చెప్పుకోదగ్గ ఓటు బ్యాంక్‌, క్యాడర్ ఉంది. కేంద్రంలో వాళ్ల ప్రభుత్వమే ఉండటంతో ఇంకా వలసలు మొదలుకాలేదు.
దీనికి తోడు దేవేగౌడ పార్టీ జనతా దళ్‌తో పొత్తు కొనసాగుతోంది. మరి ఈ పొత్తు ఈ ఎన్నికల్లో ఎంత మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి..

ఇక కేరళలో బీజేపీది మరో రకంగా ఉంది బీజేపీ పరిస్థితి.. ఆశించినంతంగా ఇక్కడ ఎదగలేకపోతుంది. కలిసి వస్తుందనుకున్న శబరి మల ఇష్యూ బెడిసికొట్టింది.
శబరిమల అంశంపై ముందుండి పోరాడినా ప్రజల నుంచి ఆశించినంత రెస్పాన్స్‌ రాలేదు..
హిందూత్వ కార్డ్ కేరళలో పనిచేయడం లేదు. దీంతో ఈ సారి ఎన్నికల్లో కూడా అంతగా పట్టుసాధించే అవకాశాలు లేవనే చెప్పాలి.

తెలంగాణలో సిట్యూవేషన్‌ మరోలా ఉంది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఉవ్వెత్తున ఎగిసిన పార్టీ.. ఆ తర్వాత చతికిలపడింది. ఎమ్మెల్యే సీట్ల సంఖ్య పెరిగినా.. లోక్‌సభ ఎన్నికలు వచ్చే సరికి సీన్ మారిపోయినట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ బలపడటం.. ఆ పార్టీలో చేరికలు పెరడగంతో కాస్త కంగారులో ఉందనే చెప్పాలి..

Also Read: ఏలూరు పార్లమెంట్ సీటు పై బీజేపీ కన్ను..

కానీ అనూహ్యంగా కవిత అరెస్ట్‌ జరిగింది. ఇప్పుడీ అంశం తమకు కలిసి వస్తుందన్న ఆశలో ఉన్నారు బీజేపీ నేతలు.. అంతేకాదు బీఆర్‌ఎస్‌ నేతలను ఆకర్షించే పనిలో ఉన్నారు. ఆ పార్టీ మాజీ ఎంపీలు, ప్రస్తుత ఎంపీలను చేర్చుకొని వారికే టికెట్లు ఇస్తున్నారు. ఏదేమైనా గత ఎన్నికల కంటే ఈసారి ఎక్కువ ఎంపీ సీట్లు సాధించడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు తెలంగాణ కమలనాథులు..

ఏపీలో అనూహ్యంగా బీజేపీ-టీడీపీ-జనసేన కలిసి ఎన్నికలు వెళుతున్నాయి.. బీజేపీకి సొంతంగా వచ్చే సీట్ల సంఖ్య తక్కువైనా.. కూటమిలో భాగంగా ఎక్కువ సీట్లు సాధించడమే బీజేపీ ఉద్దేశంగా కనిపిస్తోంది.
అందుకే ఒకప్పటి తన శత్రువు ఆ తర్వాత మిత్రుడైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ప్రధాని మోడీ చేతులు కలిపారన్న ప్రచారం ఉంది.
నిజానికి ఏపీలో బీజేపీ క్యాడర్, లీడర్లు తక్కువే.. గత ఎన్నికల్లో వారికి నోటా కంటే తక్కువగా ఓట్లు వచ్చిన పరిస్థితి.. వారి సత్తా ఏంటో వారికి తెలుసు కాబట్టే ఏపీలో వీలైనంత తగ్గారు..

ఇది సౌత్ స్టేట్స్‌లో బీజేపీ పరిస్థితి.. అయితే ఏ స్టేట్‌లో ఏ స్ట్రాటజీ ఉపయోగించినా.. బీజేపీ అనుకున్నంత సులువుగా అయితే పరిస్థితులు లేవు.. లాంగ్వేజ్, కల్చర్, ప్రాంతీయత, చారిత్రక రాజకీయ అనుబంధాలు.. బీజేపీకి అడ్డుగోడలుగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. మరి మోడీ ప్రారంభించే అభివృద్ధి పనులు. చేసే శంకుస్థాపనలు.. సుడిగాలి పర్యటనలు.. బీజేపీకి ఏ విధంగా లాభం చేస్తాయో చూడాలి.

Tags

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×