BigTV English

Cool Drinks : రోజూ కూల్‌డ్రింక్స్ తాగితే.. కిడ్నీలో 35 స్టోన్స్..

Cool Drinks : రోజూ కూల్‌డ్రింక్స్ తాగితే.. కిడ్నీలో 35 స్టోన్స్..

Cool Drinks : క్రేజీ కూల్‌డ్రింక్స్. బాటిళ్లకు బాటిళ్లు తాగేస్తుంటారు చాలామంది. మంచినీళ్లు తాగినట్టే.. దాహం వేసినప్పుడల్లా డ్రింక్స్ తాగడం అలవాటు. టిఫిన్ చేశాక ఒకటి.. అన్నం తిన్నాక ఇంకోటి.. సాయంత్రం సరదాగా మరోటి.. ఫ్రెండ్స్ కలిస్తే ఒకటి.. బోర్ కొడితే.. ఆకలిగా ఉంటే.. తిన్నది అరక్కపోతే.. నిద్ర రాకపోతే.. ఇలా ఎడాపెడా లాగించేస్తుంటారు. బర్త్‌డేలైనా, పార్టీలైనా, ఫంక్షన్లలో వెల్‌కమ్ డ్రింక్స్ అయినా.. ఈవెంట్ ఏదైనా కూల్‌డ్రింక్స్ ఉండాల్సిందే.


చల్లని థమ్స్‌అప్ గొంతులో జారుతుంటే.. మహేశ్‌బాబులా ఫోజులు కొడుతుంటారు. పుల్లని స్ప్రైట్‌‌ను ఫ్రెండ్స్‌తో కలిసి తాగుతూ మజా చేస్తుంటారు. చిన్నా పెద్దా అనే తేడా లేదు. అందరికీ ఇష్టమే. చిన్న పిల్లలైతే డ్రింక్ సీసా కనిపిస్తే చాలు.. ఇచ్చేదాకా వదిలిపెట్టరు. గోల చేసైనా బాటిల్ ఖాళీ చేసేస్తారు. కానీ……

అతిగా తాగితే… డాక్టర్లు ఏం చెప్పారంటే..


లిమిట్‌గా అయితే ఓకే కానీ.. కూల్‌డ్రింక్స్ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అందులో ఎక్కువ మోతాదులో షుగర్ కంటెంట్ ఉంటుంది. అది బాడీలో షుగర్ లెవెల్స్‌ను తారుమారు చేస్తుంది. డ్రింక్స్‌లోనూ కెమికల్ ప్రిజర్వేటివ్స్ సైతం హాని కలిగించేవే అని చెబుతున్నారు. ఇటీవల బ్రెజిల్‌లో ఒకతను ప్రతీరోజూ దాదాపు 3 లీటర్ల కోకాకోలా తాగడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. హెల్త్ ప్రాబ్లమ్‌తో హాస్పిటల్‌లో చేరితే.. అన్ని పరీక్షలు చేశారు డాక్టర్లు. డ్రింక్స్ తాగడం వల్ల అతని కిడ్నీలో రాళ్లు తయారయ్యాయని తేల్చారు. యూరాలజీ డాక్టర్ ఆపరేషన్ చేసి.. కిడ్నీల నుంచి 35 స్టోన్స్‌ను తొలగించాడు. కూల్‌డ్రింక్స్ తాగడం వల్ల ఏర్పడిన ఆ రాళ్లను చూపిస్తూ ఆ డాక్టర్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పెడితే అది తెగ వైరల్ అవుతోంది.

కిడ్నీలో స్టోన్స్..

చక్కెర, కార్బోనేటేడ్ పానీయాలను అధికంగా తీసుకోవడం వల్ల కలిగే ప్రమాదకరమైన పరిణామాలను ఆ వీడియోలో వివరించారు డాక్టర్ ఆండ్రేడ్. తాను ఆపరేషన్ చేసి బయటకు తీసిన పసుపు రంగులో ఉన్న ఆ 35 రాళ్లను చూపించారు. కూల్‌డ్రింక్స్ తాగడం వల్ల శరీరంలో కాల్షియం పేరుకుపోయి.. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయని చెప్పారు. అవి మూత్రం ద్వారా బయటకు వెళ్లడానికి మూత్రాశయం వైపు కదులుతాయి. ఆ క్రమంలో తీవ్రమైన నొప్పి, వికారం, వాంతులు కలుగుతాయి. మూత్రంలో రక్తం కూడా బయటపడుతుందని చెప్పారు. వెంటనే ట్రీట్‌మెంట్ చేయకపోతే.. ఆ రాళ్లు మూత్రాశయంలో చేరి.. కిడ్నీస్ ఫెయిల్యూర్‌కు దారి తీయొచ్చని అన్నారు. కూల్‌డ్రింక్స్ అధికంగా తాగడం వల్ల కేవలం బరువు పెరగడమే కాదు.. అంతర్గత అవయవాలకు కూడా హాని కలిగిస్తాయని చెప్పారు.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×