Malaika Kapoor: బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐటెం సాంగ్స్ తో తనకంటూ బాలీవుడ్ లోనూ టాలీవుడ్ లోనూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన కెవ్వు కేక సాంగ్ లో నటించి తెలుగువారికి మరింత దగ్గరయింది. ఇక మలైకా సినిమాల విషయం పక్కన పెడితే ఆమె వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా తనకన్నా చిన్నవాడు అయినా హీరో అర్జున్ కపూర్ తో ఆమె ప్రేమాయణం ఇండస్ట్రీ మొత్తం షేక్ చేసింది.
ఎక్కడికి వెళ్ళినా వారిద్దరూ కలిసే కనిపించేవారు ఒకే ఇంట్లో నివాసం ఉండేవారు. దీంతో ఈ జంట ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటురా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. ఇక కొన్ని బాలీవుడ్ మీడియాలో అయితే వీరిద్దరికీ పెళ్లి కూడా అయిపోయిందని వార్తలు పుట్టించాయి. అంతా బాగా జరుగుతుంది అనుకున్న సమయంలో సడన్ గా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకొని ఇండస్ట్రీ మొత్తానికి షాక్ ఇచ్చారు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాలు ఇప్పటివరకు తెలియ రాలేదు.
ఇక అర్జున్ బ్రేకప్ తర్వాత కెరీర్ పై ఫోకస్ చేశాడు. మలైకా కూడా బ్రేకప్ తర్వాత సింగిల్ గానే ఉంటూ తన కొడుకును బాలీవుడ్ కి పరిచయం చేయడం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తుంది. దీంతోపాటు అమ్మడు బిజినెస్ లో కూడా రాణించడానికి సిద్ధమయింది. ఈ మధ్యనే ఒక లగ్జరీ ప్లాట్ ను అమ్మేసి రేంజ్ రోవర్ కార్ ను కొనుగోలు చేసింది.
ఇదంతా పక్కన పెడితే బ్రేకప్ తర్వాత అర్జున్ కపూర్, మలైకా ఎదురెదురు పడినా కూడా ముఖం తిప్పుకొని వెళ్ళపోయారు. దీంతో వీరిద్దరి మధ్య పెద్ద అగాధమే ఏర్పడిందని అందరూ అనుకున్నారు. ఇప్పట్లో వీరు కలిసే ఛాన్స్ లేదని అనుకున్నారు. కానీ అనుకోకుండా ఒక ఈవెంట్లో అర్జున్, మలైకా ఇద్దరూ క్లోజ్ గా ఉండడం ఇప్పుడు బాలీవుడ్ మీడియాను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
జాన్వి కపూర్, ఇషాన్ కట్టర్ జంటగా నటించిన హోమ్ బౌండ్ సినిమా ప్రీమియర్ గత రాత్రి ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి బాలీవుడ్ లోని స్టార్స్ అందరూ హాజరయ్యారు. ఇక ఈ ప్రీమియర్ కు, మాజీ ప్రేమికులు అర్జున్ కపూర్ మలైకా అరోరా కూడా రావడం జరిగింది. అయితే వీరిద్దరి కలయిక ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
బ్రేకప్ తర్వాత కనీసం ఎదురుపడితే హాయ్ అని కూడా చెప్పుకొని ఈ మాజీ ప్రేమికులు తాజాగా హగ్ చేసుకుని మరి పలకరించడం ఆశ్చర్యంగా ఉందని చెప్పుకొస్తున్నారు. దీంతో ఈ ప్రీమియర్ లో హీరో హీరోయిన్ల కన్నా వీరిద్దరి గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలు వీడియోలు చూసిన నెటిజన్స్ ఫైనల్ గా మీరు మీరు కలిసిపోయారా అంటూ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. మరి ముందు ముందు ఈ జంట మళ్ళీ కలుస్తారేమో చూడాలి.