BIG TV LIVE Originals: ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది రైల్వే ప్రయాణాన్ని ఇష్టపడుతారు. తక్కువ ఖర్చులో ఆహ్లాకర ప్రయాణం చేసే అవకాశం ఉన్న ట్రైన్ ట్రావెల్ పట్ల ఆసక్తి కనబరుస్తారు. అయితే, ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వింతలు, విశేషాలు కలిగిన రైల్వే వ్యవస్థలు ఉన్నాయి. వాటిలో ఒకటి క్రౌబరో మినియేచర్ రైల్వే ఒకటి. ఇంగ్లాండ్ లోని ఈస్ట్ సస్సెక్స్ లోని క్రౌబరోలో సరదాగా గడపాలని భావించాలనుకునే వారికి, క్రౌబరో మినియేచర్ రైల్వే ఒక బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఇది గోల్డ్‌స్మిత్స్ లీజర్ సెంటర్‌లో ఉంది. రైళ్లను ఇష్టపడే స్వచ్ఛంద సేవకుల సమూహం అయిన క్రౌబరో లోకోమోటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ రైళ్లు నడుస్తాయి. ఇవి ప్రపంచంలోనే అతి చిన్న రైళ్లుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇక్కడ నడిచే చిన్నరైళ్లు ఆవిరి, డీజిల్, ఎలక్ట్రిక్ రైళ్లను పోలి ఉంటాయి. ఈ రైళ్లు అందమైన మోడల్ బోటింగ్ సరస్సు చుట్టూ, ఒక చిన్న స్టేషన్ గుండా వెళతాయి. వీటి మీద పిల్లలు, పెద్దలు కూర్చొని ప్రయాణిస్తారు.
ఏ రోజు అందుబాటులో ఉంటుందంటే?
ఈ రైళ్లు సాధారణంగా వేసవి సెలవులతో పాటు వీకెండ్, స్కూల్ హాలీడేస్ లో నడుస్తాయి. పుట్టిన రోజు వేడుకలు, ప్రత్యేక సందర్భాల కోసం రైడ్‌లను నడిపిస్తుంది. ఈ రైలు మీద ప్రయాణం చేయాలంటే డే రోవర్ టికెట్ కొనుగోలు చేయవచ్చు. ఇది ఒక రోజు మీకు కావలసినన్ని సార్లు రైళ్ల మీద ప్రయాణించడానికి అనుమతిస్తుంది! ప్రతి రైడ్ తర్వాత, మీరు దిగి మళ్ళీ క్యూలో నిల్చోవాలి. ఈ టికెట్లకు సంబంధించి ధరలు మారుతూ ఉంటాయి. రైల్వే వెబ్ సైట్ లో టికెట్ ధరలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తుంటారు.
ప్రత్యేక పార్టీల్లో వినోదం కోసం
ఇక ఈ ప్రదేశంలో ప్రత్యేక వేడుకలను నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. పుట్టిన రోజు లేదంటే ఇతర కార్యక్రమాలను ఇక్కడ జరపుకోవచ్చు. సుమారు 70 మంది వరకు ఈ వేడుకలో పాల్గొనే అవకాశం ఉంటుంది. మీరు రైల్వే, స్టేషన్ ప్రాంతం, టేబుల్స్, కుర్చీలు, ఫ్రిజ్, వాటర్, పవర్ ఉపయోగించుకోవచ్చు.చిన్న పడవలను నడిపే మోడల్ బోటింగ్ సరస్సు కూడా ఉంది. ఈ ప్రైవేట్ ఈవెంట్‌లు సాధారణంగా డీజిల్ లేదంటే ఎలక్ట్రిక్ రైళ్లను ఉపయోగిస్తారు. ఈవెంట్ ను బుక్ చేసుకోవడానికి వెబ్ సైట్ ద్వారా నిర్వాహకులను సంప్రదించాల్సి ఉంటుంది.
రైల్వే టీమ్ లో మీరు కూడా చేరవచ్చు!
క్రౌబరో లోకోమోటివ్ సొసైటీ ఎవరైనా హెల్పర్స్ గా జాయిన్ కావచ్చు. 12 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు వెళ్లొచ్చు. రైల్వేకు సంబంధించిన అన్ని విషయాలను సొసైటీ మెంబర్స్ నేర్పిస్తారు. ట్రాక్‌లను సరిచేయడం, టికెట్లను చెక్ చేయడం, రైళ్లను నడపడం నేర్చుకోవచ్చు.
ఈ రైల్వే ఎప్పుడు ప్రారంభం అయ్యిందంటే?
ఈ రైల్వే 1989లో ప్రారంభమైంది. 2014లో వీల్డెన్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్, క్రౌబరో టౌన్ కౌన్సిల్ సపోర్టుతో ట్రాక్ ను విస్తరించారు. కొత్త ట్రాక్ లో ఆహ్లాదకరమైన హెచ్చు తగ్గులు, వంపులు ఉన్నాయి. ఇది రైడ్‌ను మరింత ఉత్తేజకరంగా చేస్తుంది! పిల్లలు, యువతకు సైన్స్, ఇంజనీరింగ్‌పై ఆసక్తి కలిగించేందుకు ఈ రైల్వే ఉపయోగపడుతుంది.
కొంచెం ఇదెక్కడో కనుక్కోండి,
అందరం ఒకసారి వెళ్ళొద్దాం!pic.twitter.com/dfPgxbJ2Ak— Srikanth (@yskanth) June 3, 2025
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.
Read Also: మీ కార్లను ఇక రైలు ఎక్కించవచ్చు.. వాటితో మీరూ ప్రయాణించవచ్చు!