BigTV English

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Hyderabad News: వరుసగా పండుగలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో నాన్ డ్యూటీ లిక్కర్ జోరందుకుంది. దీనిపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు.  ఎక్సైజ్‌ అధికారులు ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు.


తాజాగా శంషాబాద్‌లో 125 ప్రీమియం మద్యం బాటిళ్లను సీజ్ చేశారు ఎక్సైజ్ అధికారులు. అలాగే ముషీరాబాద్‌లో జానీ వాకర్ బాటిల్స్ స్వాధీనం చేశారు. గోవా ప్రాంతాల నుంచి మద్యాన్ని సీక్రెట్ తెచ్చి నగరంలో విక్రయాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో 15 మందికి నోటీసులు ఇచ్చారు. పట్టుకున్న మద్యం విలువ అక్షరాలా రూ. 7.50 లక్షలుగా ఉంటుందని అధికారుల అంచనా.

శంషాబాద్ ప్రధాన రహదారిలో రంగారెడ్డి ఎన్‌ఫోర్సుమెంట్ టీమ్‌తో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. కేవలం గోవా నుంచి కాకుండా ఢిల్లీ, హర్యానా నుంచి మద్యం నగరానికి చేరుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. హెచ్‌డీ‌ఎఫ్‌డీ టీమ్ ముషీరాబాద్‌లోని నరేష్ అనే వ్యక్తి ఇంట్లో ఆరు జానీ వాకర్ మద్యం బాటిళ్లను గుర్తించారు.


ALSO READ: హైదరాబాద్ వాసులకు అలర్ట్..  24 గంటలపాటు ఆ ప్రాంతంలో తాగునీరు బంద్

దీంతో నగరంలోని ప్రధాన ప్రాంతాలపై ఎక్సైజ్ అధికారులు నిఘాను పెంచారు. అలాగే మరోవైపు జోరుగా వాహనాలు తనిఖీలు చేపట్టారు.  ఇదేకాకుండా మారుమూల ప్రాంతాల్లో నాటు సారా జోరందు కున్నట్లు కనిపిస్తోంది. దీని తయారీకి వినియోగించే నల్లబెల్లాన్ని భారీ ఎత్తున సీజ్ చేస్తున్నారు.

హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూల్‌కు తరలిస్తున్న బెల్లం వాహనాన్ని ఎస్టిఎఫ్ టీమ్స్ పట్టుకున్నాయి. సీజ్ చేసిన వాహనంలో 2010 కేజీల నల్ల బెల్లం, 50 కేజీల ఆలం అందులో ఉంది. డీసీఎం వాహనంతోపాటు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అశోక్ లేలాండ్ వాహనంతోపాటు ముగ్గుర్ని అరెస్ట్ చేశారు.

పట్టుబడిన బెల్లం విలువ లక్ష రూపాయలుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నాన్ డ్యూటీ లిక్కర్, నాటు సారా వల్ల తెలంగాణ ఎక్సైజ్ శాఖకు భారీగా నష్టం వాటిల్లుతుందని అందున్నారు. చేస్తున్న దాడులు దసరా ముగిసేవరకు కొనసాగుతాయని చెబుతున్నారు.

Related News

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: హైదరాబాద్‌ వాసులకు సూచన.. ఆ ప్రాంతాల్లో 24 గంటలపాటు తాగునీటి సరఫరా బంద్

Medaram: నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన

Former DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని ఆవేదనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కలెక్టర్‌ను ఇంటికి పంపి..?

Sammakka Sagar: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ.. ఛత్తీస్‌గఢ్ సీఎంను ఒప్పించిన మంత్రి ఉత్తమ్

HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..

Big Stories

×