E-Paper
Advertisement

Hyderabad News: హైదరాబాద్‌ వాసులకు సూచన.. ఆ ప్రాంతాల్లో 24 గంటలపాటు తాగునీటి సరఫరా బంద్

Hyderabad News: హైదరాబాద్‌ వాసులకు సూచన.. ఆ ప్రాంతాల్లో 24 గంటలపాటు తాగునీటి సరఫరా బంద్
Advertisement

Hyderabad News: ఎడతెరిపి లేకుండా హైదరాబాద్ నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. సాయంత్రం అయితే చాలు ఏ ప్రాంతంలో వర్షం పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఇదే సమయంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డు నగరవాసులకు మరో షాక్ ఇచ్చింది.

భాగ్యనగరంలో పలు ప్రాంతాలకు సెప్టెంబర్ 24న అంటే బుధవారం మంజీరా తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. ఈ విషయాన్ని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై విభాగం చేపట్టిన మరమ్మత్తు పనుల కారణంగా అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు అధికారులు. ప్రధానంగా మంజీరా ఫేజ్-2 ప్రాజెక్టులో కాలాబ్‌గూర్ నుంచి హైదర్‌‌నగర్ వరకు పంపింగ్ మెయిన్‌లో భారీగా లీకులు ఏర్పడ్డాయి.

Advertisement

వాటిని అరికట్టేందుకు బుధవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు మరమ్మత్తులు జరగనున్నాయి. దీని కారణంగా ఆయా ప్రాంతాల్లో 24 గంటలపాటు తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. హైదరాబాద్ వాటర్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది.

మంజీరా నీటి సరఫరా వ్యవస్థకు కీలకమైంది ఈ ప్రాజెక్టు. కొంతకాలంగా ఈ మార్గంలో అనేక లీకులు మొదలయ్యాయి. ఫలితంగా వేలాది లీటర్ల నీరుగా వృథా పోతోంది.కేవలం వేసవి కాలంలో కాకుండా,వర్షాకాలంలో ఆయా లీకుల వల్ల నీటి సరఫరాలో సమస్యలు ఎదురవుతున్నాయి.

Advertisement

ALSO READ: సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటన

ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు ముందు జాగ్రత్తగా నీటిని నిల్వ చేసుకోవాలని హైదరాబాద్ వాటర్ బోర్డు సూచన చేసింది.  పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి సరఫరాను పునరుద్ధరించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నగర వాసులు ఈ సమస్యను అర్థం చేసుకొని సహకరించాలని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేసింది.

కావున ఈ 24 గంట‌లు కింద పేర్కొన్న కొన్ని ప్రాంతాల్లో లో ప్రెజ‌ర్ తో నీటిస‌ర‌ఫ‌రా, మ‌రికొన్ని ప్రాంతాల్లో స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం కలుగుతుంది.  తాగునీటి అంత‌రాయం ఏర్ప‌డే ప్రాంతాలు: ఓ అండ్ ఎం డివిజ‌న్-17లోని ఆర్సీ పురం, అశోక్ న‌గ‌ర్, జ్యోతి న‌గ‌ర్, లింగంప‌ల్లి, చందాన‌గ‌ర్, గంగారం, మదీనాగూడ‌, మియాపూర్ వంటి ప్రాంతాలు ఉన్నాయి.

అలాగే ఓ అండ్ ఎం డివిజ‌న్-22లో బీరంగూడ‌, అమీన్‌పూర్ ఉన్నాయి. ట్రాన్స్ మిష‌న్ డివిజ‌న్-2లో ఆఫ్ టేక్ పాయింట్స్, బల్క్ క‌నెక్ష‌న్లు ఉన్నాయి. ఓ అండ్ ఎం డివిజ‌న్-6లో ఎర్ర‌గ‌డ్డ‌, ఎస్‌ఆర్ న‌గ‌ర్, అమీర్ పేట్ ఉండగా, ఓ అండ్ ఎం డివిజ‌న్ 9లో కేపీహెచ్ బీ కాల‌నీ, కూక‌ట్‌ప‌ల్లి, భాగ్యనగర్ కాలనీ ప్రగతి నగర్ వంటివి ఉన్నాయి. పైన పేర్కొన్న ప్రాంతాల్లో నీటిని పొదుపుగా వాడుకుంటారని వినియోగ‌దారులను అధికారులు కోరారు.

 

 

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×