Bahubali Re release: బాహుబలి (Bahubali).. అప్పటి వరకూ ఉన్న ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసిన ఏకైక మూవీ అని చెప్పవచ్చు. దిగ్గజ దర్శకుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో.. ఇటు చాలా ఏళ్ల తర్వాత తెలుగు ఇండస్ట్రీలో తొలి ప్రయోగంగా వచ్చిన మల్టీస్టారర్ మూవీ. రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas ), రానా దగ్గుబాటి (Rana Daggubati) కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది. డైరెక్షన్ అంటే ఇలా ఉండాలి అని మెచ్చుకునేలా రాజమౌళి తన అద్భుతమైన దర్శకత్వ మెళుకువలతో ఈ సినిమాను తెరకెక్కించారు. ముఖ్యంగా ఇందులో ప్రతి పాత్ర కూడా హైలెట్ అనే చెప్పాలి. ఇక శివగామిగా రమ్యకృష్ణ (Ramya Krishnan)రాజసం ఉట్టిపడేలా మహారాణి పాత్రలో ఆకట్టుకుంది. అటు తమన్న( Tamannaah ), ఇటు అనుష్క (Anushka Shetty) ఇలా ఎవరికివారు తమ పాత్రలతో అబ్బురపరిచారు. రెండు భాగాలుగా వచ్చిన బాహుబలి, బాహుబలి 2 ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన మొదటి ఐదు చిత్రాలలో ఒకటిగా స్థానం సంపాదించుకుంది.
త్వరలో బాహుబలి రీ రిలీజ్.. ఆ ఊహించని ట్విస్ట్ ఏంటంటే?
ఇకపోతే ఇప్పుడు ఈ సినిమా ప్రస్తావన రావడానికి కారణం రీ రిలీజ్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ చిత్రాల హవా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే బాహుబలి సినిమాని కూడా రీ రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అయితే ఒకటే రిలీజ్ చేస్తే ఎలా అనే ఆలోచన వచ్చిందో ఏమో..మేకర్స్ తీసుకున్న నిర్ణయానికి మాత్రం అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..రెండు పార్ట్ లను ఒకే పార్ట్ గా మార్చి రిలీజ్ చేయబోతున్నారట. రెండు సినిమాల్లో కీలకమైన సీన్స్ తీసుకుని, ఒకే సినిమాగా మార్చుతున్నారట. కథ డిస్ట్రర్బ్ కాకుండా… సోల్ మిస్ అవ్వకుండా.. కట్ చేస్తున్నారట.
ఇప్పటికే ఈ ఎడిటింగ్ పనులు స్టార్ట్ అయ్యాయని సమాచారం. ఒక అంతా పూర్తయితే రెండు భాగాలను ఒకే మూవీలో చూపించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలిసి అభిమానులే కాదు సినీ సెలబ్రిటీలు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.
బాహుబలి..
‘బాహుబలి: ది బిగినింగ్’ అంటూ 2014 జూలై 10వ తేదీన ఈ సినిమా విడుదలైంది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజు కీలకపాత్రలు పోషించారు. ఆర్క మీడియా వర్క్స్ బ్యానర్ పై దేవినేని ప్రసాద్ నిర్మించారు. కే రాఘవేంద్రరావు సమర్పకుడిగా వ్యవహరించగా.. ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ఈ చిత్రానికి రాజమౌళి సోదరుడు ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందించారు. మొదట తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో విడుదలై.. ఆ తర్వాత హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేశారు.
బాహుబలి 2..
‘బాహుబలి :2 ది కన్ క్లూజన్’ అంటూ బాహుబలి కొనసాగింపుగా రూ.250 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1607 కోట్లు రాబట్టి అప్పటి వరకు ఉన్న ఇండియన్ బాక్సాఫీస్ లెక్కలను మార్చేసింది. ఈ సినిమా మొదటి వారంలోనే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా.. మొదటి రోజు రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. 2017 ఏప్రిల్ 28న విడుదలైన ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు ఈ రెండు సినిమాలను ఒకే సినిమాగా చేసి రీ రీలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.
ALSO READ:Big TV Kissik Talks: అందరినీ నవ్వించే గంగవ్వ జీవితంలో ఇంత విషాదమా?