Diaper Side Effects: పిల్లల పెంపకం అనేది ఒక అందమైన ప్రయాణం. ఇది చాలా ఆనందం, ప్రేమ, లెక్కలేనన్ని జ్జాపకాలతో నిండి ఉంటుంది. కానీ.. ఇందులో చాలా సవాళ్లు ఉన్నాయన్నది కూడా నిజమే. పిల్లల ఆరోగ్యం, పరిశుభ్రత పట్ల తల్లిదండ్రులు సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. తల్లిదండ్రులు పిల్లలకు సంబంధించిన కొన్ని విషయాల పట్ల సందేహాలను కలిగి ఉంటారు. వీటిలో ఒకటి డిస్పోజబుల్ డైపర్ల వాడకం.
ఇంట్లో ఉండే పెద్దలు పిల్లలకు డైపర్లను వాడకూడదని చెబుతుంటారు. డైపర్లను ఎక్కువగా వాడటం వల్ల పిల్లలు అనారోగ్యానికి గురవుతారని అంటారు. ఇది పిల్లల నడకను పాడు చేస్తుందని కూడా కొంతమంది వాదిస్తారు. ఈ భయాలు ఎంతవరకు నిజమో ఇప్పుడు తెలుసుకుందాం.
రసాయనాలు, సింథటిక్ పదార్థాలను డైపర్ల తయారీలో ఉపయోగిస్తారు. ఇవి పిల్లల సున్నితమైన చర్మానికి హానికరం. ఈ రసాయనాల వల్ల చర్మంపై అలెర్జీ, దద్దుర్లతో పాటు ఇతర చర్మ సమస్యలు వస్తాయి. అందుకే పిల్లలకు హైపోఅలెర్జెనిక్ డైపర్లను మాత్రమే ఉపయోగించాలి.
ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రమాదం:
పిల్లలకు ఎక్కువసేపు డైపర్లు వేయడం వల్ల బ్యాక్టీరియా పెరుగుదల, ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆడపిల్లలకు మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పిల్లలు డైపర్‌లో మూత్ర విసర్జన చేసినప్పుడు లేదా మలం విసర్జించినప్పుడు.. వెంటనే మార్చకపోతే.. డైపర్‌లో ఆల్కలీన్ బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది ఇన్ఫెక్షన్‌ను కారణం అవుతుంది. కాబట్టి.. మీరు మీ డైపర్లు వేస్తుంటే మాత్రం ఒకటి నుండి రెండు గంటలకు ఒకసారి వాటిని మార్చండి. అంతే కాకుండా మళ్ళీ మళ్ళీ చెక్ చేస్తూ ఉండండి.
పిల్లల అసౌకర్యం:
ఒక అధ్యయనం ప్రకారం.. డైపర్లు పిల్లలకు మూత్రం యొక్క తడి నుండి ఉపశమనం కలిగిస్తాయి. కానీ పిల్లలు వీటిని వేసుకోవడం వల్ల అసౌకర్యంగా భావిస్తారు. మరో అధ్యయనం ప్రకారం.. సాధారణ సైజులో ఉండే డైపర్లు వేయడం వల్ల వారి అవయవాల కదలికలు పరిమితం అయ్యే ప్రమాదం ఉంది. ఇది వారి మోకాళ్ల కదలికను కూడా తగ్గించవచ్చు. అంటే.. డైపర్ యొక్క క్రోచ్ బెల్ట్ వెడల్పుగా ఉంటే.. పిల్లలు ఈజీగా కదలడం, నడవడం వంటివి చేస్తారు.
వెడల్పు డైపర్లు ప్రమాదకరం:
వెడల్పుగా ఉండే డిస్పోజబుల్ డైపర్లు వేయడం వల్ల పిల్లల నడకపై ఎక్కువగా ప్రభావం పడుతుంది. అంతే కాకుండా.. డైపర్లు తరచుగా వాడే పిల్లలు నడవడంలో వెనకబడుతుంటారు. నడుస్తున్నప్పుడు డైపర్ వారికి ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే నెమ్మదిగా అడుగులు వేస్తారు. లేదా పడిపోతారు. డైపర్లు మాత్రమే కాదు.. బట్టలు కూడా చిన్న పిల్లల కదలికలను ప్రభావితం చేస్తాయి.
Also Read: జుట్టు పెరగాలంటే.. ఈ ఒక్కటి వాడితే చాలు !
డైపర్లు వేయండి. కానీ జాగ్రత్తలు పాటించండి:
నేటి కాలంలో.. పిల్లలకు డైపర్ల వాడకం చాలా పెరిగింది. కానీ వీటిని తెలివిగా వాడటం మంచిది. మీ పిల్లలు ఎప్పుడూ డైపర్లు వేయమని బలవంతం చేసే పొరపాటు చేయకండి.
మీరు బయటకు వెళ్ళినప్పుడు లేదా అవసరమైనప్పుడు మాత్రమే డైపర్లు వేయండి. ఒకటి నుండి రెండు గంటల తర్వాత డైపర్ మార్చండి.
పిల్లవాడు డైపర్‌లో ఒకసారి మూత్ర విసర్జన చేస్తే.. వెంటనే దాన్ని మార్చండి. ఒకసారి ఉపయోగించిన డైపర్‌ను తిరిగి అస్సలు ఉపయోగించకండి.
ఎక్కువ పీల్చుకునే స్వభావం ఉన్న డైపర్ లను మాత్రమే వాడండి.
ఈ చిన్న చిన్న జాగ్రత్తలు మీ పిల్లలకు వచ్చే అనేక ఆరోగ్య సమస్యల నుండి కాపాడతాయని గుర్తుంచుకోండి.