BigTV English
Advertisement

Sai Pallavi Dance: శేఖర్ మాస్టర్.. మళ్లీ ‘ఫిదా’ అవ్వాలా ఏంటి.? ‘తండేల్’ కొరియోగ్రాఫిపై ట్రోల్స్..

Sai Pallavi Dance: శేఖర్ మాస్టర్.. మళ్లీ ‘ఫిదా’ అవ్వాలా ఏంటి.? ‘తండేల్’ కొరియోగ్రాఫిపై ట్రోల్స్..

Sai Pallavi Dance: మామూలుగా సినిమాల్లో పాటకు ట్యూన్స్ రిపీట్ అయినట్టు అనిపిస్తేనే ఆ మ్యూజిక్ డైరెక్టర్‌పై విపరీతమైన ట్రోల్స్ వస్తాయి. వేరే పాటలో సేమ్ అలాంటి ట్యూన్ కాకపోయినా దాదాపు అలాగే ఉంది అనిపించే ట్యూన్ ఉన్నా సరే ఆ మ్యూజిక్ డైరెక్టర్‌పై ట్రోల్స్ మామూలుగా ఉండవు. మరి ఆ ట్రోల్స్ కేవలం మ్యూజిక్ డైరెక్టర్లు మాత్రమే ఎందుకు.? కొరియోగ్రాఫర్లపై ఎందుకు రావు.? ఇటీవల సాయి పల్లవికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసిన స్టెప్పులు చూస్తుంటే ఆయనపై కూడా ట్రోల్ రాక తప్పడం లేదు. ‘ఫిదా’ నుండి ‘తండేల్’ వరకు సాయి పల్లవిని అదే స్టెప్పులు వేయిస్తున్నాడు శేఖర్ మాస్టర్. తాజాగా దానికి సంబంధించిన ట్రోల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


అదే రిపీట్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫిదా’ అనే మూవీతో తెలుగు హీరోయిన్‌గా అడుగుపెట్టింది సాయి పల్లవి. అప్పటివరకు సాయి పల్లవి ఒక డ్యాన్సర్ అని చాలా తక్కువమందికి తెలుసు. అందుకే తనలోని డ్యాన్సర్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడం కోసం ‘ఫిదా’లో వచ్చిండే అని పాటను కంపోజ్ చేశారు శేఖర్ మాస్టర్. అందులో సాయి పల్లవిని డ్యాన్స్ మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉందని, నెమలి నాట్యం చేసినట్టుగా ఉందని.. ఇలా ప్రశంసలతో ముంచేశారు ప్రేక్షకులు. కానీ శేఖర్ మాస్టర్, సాయి పల్లవి కాంబోలో వచ్చే పాటల్లో మళ్లీ మళ్లీ అదే స్టెప్స్ రిపీట్ అవ్వడాన్ని నెటిజన్లు గమనించారు. దీంతో ట్రోల్స్ మొదలయ్యాయి.


ఎక్కడో చూసినట్టుందే!

‘ఫిదా’ తర్వాత శేఖర్ మాస్టర్ (Sekhar Master), సాయి పల్లవి ‘లవ్ స్టోరీ’ సినిమాలో సారంగదరియా పాటకు కలిసి పనిచేశారు. అందులో కూడా దాదాపు అదే స్టెప్స్‌లో ఫిదా చేయాలనుకున్నాడు మాస్టర్. కానీ సాయి పల్లవి మాయలో పడిన ప్రేక్షకులు దానిని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ‘తండేల్’ విషయంలో కూడా అదే రిపీల్ అవుతోంది. నాగచైతన్య, సాయి పల్లవి (Sai Pallavi) హీరోహీరోయిన్లుగా నటించిన ‘తండేల్’ (Thandel) నుండి ఇటీవల హైలెస్సో హెలెస్సా అనే పాట విడుదలయ్యింది. దానికి సంబంధించిన లిరికల్ వీడియోలో సాయి పల్లవి క్యూట్‌గా కొన్ని స్టెప్పులు వేసి మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఇంతలోనే ఇవి ఫిదాను పోలినట్టు ఉన్నాయే అని వారిలో అనుమానం మొదలయ్యింది.

Also Read: బాలీవుడ్ హీరోకు తెలుగు పాఠాలు నేర్పిస్తున్న రష్మిక.. పాపం చాలా కష్టపడుతోందిగా.!

ఫ్యాన్స్ సలహా

పదేపదే అవే స్టెప్పులు వేస్తుంటే శేఖర్ మాస్టర్‌పై ట్రోల్స్ రాక తప్పడం లేదు. డ్యాన్స్ విషయంలో సాయి పల్లవి ఎలాంటి స్టెప్పులు అయినా వేయడానికి సిద్ధంగా ఉంటుంది. అలాంటిది మళ్లీ మళ్లీ తనతో అదే స్టెప్పులు వేయిస్తుంటే చూడడానికి బాగుండడం లేదని, అందం పోతుందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాను హీరోయిన్‌గా నటించిన చాలావరకు సినిమాల్లో సాయి పల్లవి ఒక ప్రత్యేకమైన పాటకు స్టెప్పులేసింది. కానీ తెలుగులో తను నటించిన దాదాపు ప్రతీ సినిమాలో ఆ ప్రత్యేకమైన పాటను కొరియోగ్రాఫ్ చేసింది శేఖర్ మాస్టరే. అందుకే ఇప్పటినుండి అయినా కనీసం అలా చేయకుండా ఉంటే బాగుంటుందని సలహా ఇస్తున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×