Drinking Turmeric Water: పసుపులో ఉండే ప్రధాన సమ్మేళనం ‘కర్కుమిన్’. పసుపు అద్భుతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటంది. ఈ కారణంగానే చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో పసుపు నీరు తాగడాన్ని ఒక ఆరోగ్యకరమైన అలవాటుగా భావిస్తారు. అయితే.. ఏదైనా సరే అతిగా తీసుకుంటే.. అది విషంతో సమానం. పసుపు నీరు రోజు అతిగా తాగడం వల్ల కలిగే అనారోగ్య సమస్యల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
పసుపు నీటితో కలిగే సైడ్ ఎఫెక్ట్స్:
1. జీర్ణకోశ సమస్యలు:
పసుపు సాధారణంగా జీర్ణక్రియకు మంచిదని చెప్పినప్పటికీ.. అధిక మోతాదులో తీసుకున్నప్పుడు అది విరుద్ధంగా పనిచేస్తుంది.
కడుపు నొప్పి, అసిడిటీ: పసుపు, ముఖ్యంగా అధిక మోతాదులో.. కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది కొంతమందిలో గుండెల్లో మంట, కడుపు నొప్పి, వికారం, యాసిడ్ రిఫ్లక్స్‌కు దారితీయవచ్చు.
విరేచనాలు: అధిక కర్కుమిన్ కడుపును చికాకు పెట్టి, విరేచనాలు లేదా కడుపు ఉబ్బరానికి కారణమవుతుంది.
2. రక్తస్రావం ప్రమాదం:
పసుపు సహజంగా రక్తాన్ని పలుచబరిచే లక్షణాలను కలిగి ఉంటుంది.
మందులతో చర్య: మీరు ఇప్పటికే ఆస్పిరిన్ లేదా వార్ఫరిన్ వంటి రక్తం పలుచబరిచే మందులు తీసుకుంటున్నట్లయితే.. పసుపు నీరు అతిగా తీసుకోవడం వల్ల ఆ ప్రభావం మరింత పెరిగి, అధిక రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంటుంది.
సర్జరీ ముందు ప్రమాదం: ఏదైనా శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్న వారు కనీసం రెండు వారాల ముందు పసుపు నీటిని తాగడం ఆపివేయాలని నిపుణులు సూచిస్తారు.
3. కిడ్నీలో రాళ్ల ప్రమాదం:
ఆక్సలేట్స్ అధికం: పసుపులో ఆక్సలేట్స్ అనే సమ్మేళనం అధికంగా ఉంటుంది. ఈ ఆక్సలేట్స్ కాల్షియంతో కలిసి కాల్షియం ఆక్సలేట్ ను ఏర్పరుస్తాయి. ఇవి కిడ్నీలో రాళ్లకు ప్రధాన కారణం.
కొంతమంది వ్యక్తులకు ప్రమాదం: ఇప్పటికే కిడ్నీలో రాళ్లు ఉన్నవారు లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవారు పసుపు నీటిని రోజువారీగా తాగడం మానుకోవాలి.
4. ఐరన్ శోషణ తగ్గడం:
పసుపులో ఉండే కర్కుమిన్, ఆహారం నుంచి శరీరంలో ఐరన్ శోషణ సామర్థ్యాన్ని తగ్గిస్తుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
రక్తహీనత : ఇప్పటికే ఐరన్ లోపం లేదా రక్తహీనతతో బాధపడుతున్న వ్యక్తులు పసుపు నీటిని అధిక మోతాదులో తీసుకుంటే.. వారి పరిస్థితి మరింత క్షీణించే ప్రమాదం ఉంది.
Also Read: యాలకులను ఇలా వాడితే.. జీర్ణ సమస్యలు పరార్ !
5. కాలేయ సమస్యలు:
పసుపును మితంగా తీసుకుంటే కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయ పడుతుంది. కానీ అధిక మోతాదులో.. ముఖ్యంగా సప్లిమెంట్ రూపంలో తీసుకున్నప్పుడు, కొన్ని అరుదైన సందర్భాలలో ఇది కాలేయానికి హాని కలిగిస్తుంది. ఇప్పటికే లివర్ సంబంధిత వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.
పసుపు నీరు తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, మోతాదు చాలా ముఖ్యం. ప్రపంచ ఆరోగ్య సంస్థ రోజుకు 1.5 గ్రాముల పసుపు పొడిని సురక్షితమైనదిగా సూచిస్తుంది. మీరు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నా లేదా మందులు వాడుతున్నా.. పసుపు నీటిని రోజువారీ అలవాటుగా మార్చుకునే ముందు తప్పకుండా పోషకాహార నిపుణులను సంప్రదించండి.