Madhya Pradesh Crime: భార్యభర్తల మధ్య విభేదాల కారణంగా అన్నెం పుణ్యం తెలియని చిన్నారులు బలైపోతున్నారు. ఫలితంగా చిన్నవయస్సులో నిండు నూరేళ్లు నిండిపోతున్నాయి. ఈ తరహా ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. తాజాగా భార్యభార్తల విబేధాల నేపథ్యంలో భర్త ప్రైవేటు పార్ట్స్ పై దాడి చేసింది భార్య. కోపం తగ్గకపోవడంతో 28 రోజుల శిశువు గొంతు కోసి చంపేసింది. ఈ దారుణమైన ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగుచూసింది. అసలేం జరిగింది?
భార్యభర్తల మధ్య విభేదాలు
మధ్యప్రదేశ్‌లోని భిండ్ జిల్లాలో ఆదివారం వేకువజామున ఊహించని ఘటన జరిగింది. భార్యాభర్తల విబేధాలు తారాస్థాయికి చేరాయి. తొలుత భర్త ప్రైవేటు పార్ట్స్‌పై దాడి చేసింది, ఆ తర్వాత 28 రోజుల నవ జాత శిశువును గొంతు కోసి చంపేసింది. ఈ ఘటనలో ఆ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
భిండ్ జిల్లాలోని మల్హన్‌పూర్ ప్రాంతం ఈ దారుణమైన ఘటనకు వేదికైంది. జగన్నాథ్ సింగ్ వయస్సు 21 ఏళ్లు. ఉషా బాఘేల్ వయస్సు 20 ఏళ్లు. వీరిద్దరు ప్రేమించు కున్నారు.. పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఏడాది కిందట చట్టబద్దమైన వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఈ మధ్య పండంటి బాబు పుట్టాడు. ఆసుపత్రిలో డెలివరీ తర్వాత భార్య-బేబీని ఇంటికి తీసుకొచ్చాడు ఆమె భర్త జగన్నాథ్.
భర్త ప్రైవేటు పార్ట్స్‌పై దాడి.. శిశువు గొంతు కోసిన తల్లి
జగన్నాథ్ సొంతూరు యూపీలోని లలిత్‌పూర్‌కి చెందినవాడు. అక్కడి నుంచి వలస వచ్చాడు. చిన్న వయసులో వివాహం జరగడంతో ఇద్దరు అభిరుచులు వేర్వేరుగా ఉండేవి. ఇద్దరు మధ్య తరచూ గొడవలు జరిగేవి. డెలివరీ తర్వాత కూడా భార్యభర్తల మధ్య తరచూ గొడవలు తగ్గలేదు. శనివారం అర్థరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు గొడవ జరిగింది. ఏ ఒక్కరూ వెనక్కి తగ్గేలేదు.
ఆవేశంలో భర్త ప్రైవేటు పార్ట్స్‌పై కత్తితో దాడి చేసింది ఉషా. భార్య కొట్టిన ఆ దెబ్బకు నొప్పితో భర్త విలవిలలాడుతున్నాడు. అయినా ఆమె కోపం చల్లారలేదు. చివరకు బెడ్‌పై నున్న 28 రోజుల నవ శిశువును కత్తితో గొంతు కోసి చంపేసింది. ఈ విషయం ఇరుగు పొరుగువారికి తెలియగానే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే నిందితురాలిని అరెస్టు చేశారు. భర్తను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ALSO READ: బీబీనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు మృతి
కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. హత్య వెనుక గల కారణాలపై లోతుగా విచారణ చేపట్టారు. గడిచిన ఆరునెలలుగా ఈ జంట మధ్య విబేధాలున్నట్లు స్థానికుల మాట. కొన్నిరోజులుగా భర్త ప్రవర్తనపై భార్య అనుమానించడం మొదలుపెట్టింది. తరచుగా గొడవలు జరిగినట్టు చెబుతున్నారు. బేబీ హత్య వెనుక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? భర్త ప్రమేయంపై ఆరా తీస్తున్నారు పోలీసులు.