BigTV English
Advertisement

Simmer Dating: సిమ్మర్ డేటింగ్.. జెన్ జెడ్ ఫాలో అవుతున్న ఈ సరికొత్త ట్రెండ్ గురించి మీకు తెలుసా?

Simmer Dating: సిమ్మర్ డేటింగ్.. జెన్ జెడ్ ఫాలో అవుతున్న ఈ సరికొత్త ట్రెండ్ గురించి మీకు తెలుసా?

ఆధునిక కాలంలో ప్రేమలు, పెళ్లిళ్ల పద్ధతులే మారిపోయాయి. ఒకప్పుడు పెద్దవారు చూసి మాత్రమే పెళ్లిళ్లు చేసేవారు. కానీ ఇప్పుడు ఎవరికి వారే ప్రేమ వివాహాలు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు మరొక కొత్త ట్రెండ్ ఉద్భవించింది. అదే సిమ్మర్ డేటింగ్. జనరేషన్ జెడ్ వాళ్లు ఫాలో అవుతున్న ట్రెండ్ ఇది. దీని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.


జనరేషన్ జెడ్ అంటే ఎవరు?

జనరేషన్ జెడ్ అంటే 1997 నుండి 2012 మధ్యలో జన్మించినవారు. వీరిని జెన్ జెడ్ అని కూడా పిలుస్తారు. జనరేషన్ ఎక్స్, జనరేషన్ వై తర్వాత జనరేషన్ జెడ్ వచ్చింది. జనరేషన్ ఎక్స్ అంటే 1965 నుండి 84 మధ్య పుట్టిన వారు. జనరేషన్ వై అంటే 1985 నుండి 95 మధ్య పుట్టిన వారు. ఇక జనరేషన్ జెడ్ అంటే 1996 నుంచి 2012 మధ్యలో జన్మించే వారు.  ఆ తర్వాత 2012 నుంచి 2020 మధ్యలో జన్మించిన వారిని జనరేషన్ ఆల్ఫా అని పిలవడం ప్రారంభించారు. ఇప్పుడు కొత్తతరం వచ్చేసింది వీరిని జనరేషన్ బీటా అని అంటున్నారు.


జనరేషన్ జెడ్ వారు డేటింగ్ పేరుతో అనుబంధాల్లోకి అడుగుపెడుతున్నారు. మీ సమయాన్ని ఎదుటివారి కోసం ఎక్కువగా వెచ్చించడం, నిదానంగా కాలక్రమమైన భావోద్వేగ సాన్నిహిత్యాన్ని కలిగి ఉంటారు. వీరు లైంగిక ప్రక్రియ కూడా నిదానంగా ఉంటుంది. డేటింగ్ చేస్తున్న కూడా త్వరగానే లైంగిక ప్రక్రియకు సిద్ధం కారు. శారీరక సాన్నిహిత్యాన్ని, నిబద్దతతో కొనసాగేందుకు ప్రయత్నిస్తారు. కాస్త పరిచయం పెరిగిన తర్వాత.. ఇద్దరికీ ఇష్టమైతేనే మిగతావన్నీ. అప్పటి వరకు వారి కోరికలను బయటపెట్టరు. ఒక వేళ బయట పెట్టినా.. ఎదుటి వ్యక్తి నిర్ణయాన్ని గౌరవిస్తారు. వారి అంగీకారం లేకుండా ముందుకు వెళ్లరు.

జనరేషన్ జెడ్ లో డేటింగ్ చేస్తున్న వాళ్ళు మానసిక ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే సంబంధాల నుండి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. నెమ్మదిగా అభివృద్ధి చెంది అనుబంధాలకే విలువిస్తున్నారు. అనుబంధాలను స్థిరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

Also Read: పెళ్ళికి ముందే సహజీవనం చేస్తే.. ఆ జంట విడాకులు తీసుకునే అవకాశాలు తగ్గుతాయా?

భావోద్వేగ సంబంధాలను క్రమంగా నిర్మించుకోవడం ద్వారా ఎదుటి వారిపై అవగాహన పెంచుకుంటున్నారు. బలమైన పునాదిని వేసుకుంటున్నారు. డేటింగ్ పద్ధతిని అందమైనదిగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సిమ్మర్ డేటింగ్ కాలక్రమేణా నమ్మకం, అవగాహనను పెంచుతుంది. లోతైన కనెక్షన్ కు కారణం అవుతుంది. అందుకే మిగతా డేటింగ్ పద్ధతులతో పోలిస్తే జనరేషన్ జెడ్ చేసే ఈ సిమ్మర్  డేటింగ్ అన్ని విధాలా మంచిది. సో మీరు ఈ జనరేషన్‌కు చెందినవారు కాకున్నా.. కాకపోయినా.. ఈ కొత్త విధానాన్ని అనుసరింవచ్చు. జెన్ జెడ్‌లా బ్యాలెన్సుడ్‌గా ఉండవచ్చు.

Related News

Tattoo: పచ్చబొట్లు తెగ వేసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి!

Pink Salt Benefits: పింక్ సాల్ట్‌ కోసం ఎగబడుతున్న జనం.. ఎందుకో తెలిస్తే మీరూ కొంటారు!

Calcium Rich Foods: ఒంట్లో తగినంత కాల్షియం లేదా ? అయితే ఇవి తినండి !

Black Tea vs Black Coffee: బ్లాక్ టీ vs బ్లాక్ కాఫీ.. ఈ రెండిట్లో మీ ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?

Pumpkin Seeds: గుమ్మడి గింజలు తింటున్నారా ? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Fish Fry: సింపుల్‌గా ఫిష్ ఫ్రై.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్ట్

Japanese Gen Z: జపాన్ Gen Z.. సె*క్స్ చేయరట, పాతికేళ్లు వచ్చినా ఆ అనుభవానికి దూరం, ఎందుకంటే?

Neck Pain: మెడ నొప్పా ? ఈ లక్షణాలుంటే.. అస్సలు లైట్ తీసుకోవద్దు !

Big Stories

×