BigTV English

Glowing Skin: ఈ సహజసిద్ధ ప్రకృతి చిట్కాతో.. మెరిసే చర్మం మీ సొంతం

Glowing Skin: ఈ సహజసిద్ధ ప్రకృతి చిట్కాతో.. మెరిసే చర్మం మీ సొంతం

Glowing Skin: ఎంత అందంగా తయారైనా.. ముఖంపై మొటిమలు, మచ్చలు, కంటికింద నల్లటి వలయాలు, ముఖం మీద ముడతలు కనిపిస్తుంటే.. చూడడానికి బాగుండదు. కాబట్టి బయట వేలకు వేలు ఖర్చు చేసి క్రీములుకొనే పనిలేకుండా.. ఇంట్లోనే నాచురల్ పదార్ధాలతో చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఆలస్యం చెయ్యకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


అలోవెరా జెల్, విటమిన్ ఇ క్యాప్సూల్స్ ఫేస్ ప్యాక్
ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే కలబంద.. ఆరోగ్యానికే కాదు అందానికి కూడా చాలా మంచిది. ఇందుకోసం ముందుగా చిన్న బౌల్ తీసుకుని.. అందులో రెండు టేబుల్ స్పూన్ అలోవెరాజెల్, రెండు విటమిన్ ఇ క్యాప్సూల్స్ కలిపి ముఖానికి రాసుకోండి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు అప్లై చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది. చర్మం కాంతివంతంగా, మిలమిల మెరుస్తుంది.

నిమ్మరసం, షుగర్, తేనె ఫేస్ ప్యాక్
ముందుగా చిన్న బౌల్ తీసుకుని.. అందులో రెండు టేబుల్ స్పూన్ నిమ్మరసం, షుగర్ రెండు టేబుల్ స్పూన్, తేనె చెంచా కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు కూడా రాసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసిన 20 నిమిషాల తర్వాత.. గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. నిమ్మకాయలో నాచురల్‌గా విటమిన్ సి ఉంటుంది. స్కిన్ డామేజ్‌ను తగ్గిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్‌ను వారానికి రెండు సార్లు చేస్తే.. ముఖంపై ట్యాన్ తొలగిపోయి.. కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి.


టమాటా, అలోవెరా జెల్ ఫేస్ ప్యాక్
ముందుగా టమాటాను శుభ్రంగా కడిగి.. మిక్సీజార్ లోకి తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వీటిని చిన్న గిన్నెలోకి తీసుకుని.. అందులో అలోవెరాజెల్ వేయాలి. నార్మల్ స్కిన్ ఉన్న వాళ్లు తేనె వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ఐస్ క్యూబ్స్ లాగా చేసుకోవచ్చు. లేదా డైరక్ట్‌గా ఫేస్‌కి అప్లై చేసి.. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.

ఆరెంజ్ పీల్ పౌడర్, ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్
ముందుగా చిన్న గిన్నె తీసుకుని.. అందులో మూడు టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్, రెండు టేబుల్ స్పూన్ ముల్తానీ మిట్టి కలిపి ముఖానికి పెట్టుకోండి. అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా నెలకు రెండు, మూడు సార్లు చేస్తే సరిపోతుంది. ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

Also Read: అందమైన ముఖం కావాలా.. అయితే ఇలా చేయండి

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Dates Benefits: డైలీ రెండు ఖర్జూరాలు తింటే ? బోలెడు లాభాలు !

Alcohol: 30 రోజులు ఆల్కహాల్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ?

Masala Vada: మాసాలా వడ బయట తిన్నట్లే క్రిస్పీగా రావాలంటే.. ఇలా ట్రై చేయండి

Brain Health:ఈ టిప్స్ పాటిస్తే చాలు.. బ్రెయిన్ షార్ప్‌గా పనిచేస్తుంది

High Cholesterol: గుండె జబ్బులు రాకూడదంటే ? నిపుణుల సూచనలివే !

Warning Signs of Stroke: బ్రెయిన్ స్ట్రోక్.. ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయి ?

Signs of Kidney Damage: ఉదయం పూట ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా ? మీ కిడ్నీలు పాడైనట్లే !

Poha Recipe:10 నిమిషాల్లోనే రెడీ అయ్యే హెల్తీ బ్రేక్ ఫాస్ట్.. వెంటనే ట్రై చేయండి

Big Stories

×