BigTV English

Skin Care Routine: అందమైన ముఖం కావాలా.. అయితే ఇలా చేయండి

Skin Care Routine: అందమైన ముఖం కావాలా.. అయితే ఇలా చేయండి

Skin Care Routine: ఎంత ఖరీదైన క్రీములు వాడినా ముఖం నిగారింపు కోల్పోతుందా? ఎన్ని లోషన్స్ మార్చినా కళతప్పుతుందా? అయితే సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్‌లను ట్రై చేశారంటే.. అందమైన ముఖం మీ సొంతం అవుతుంది. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


ముల్తానీ మిట్టి, టమాటా, పుదీనా ఫేస్ ప్యాక్
ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకుని.. అందులో రెండు టేబుల్ స్పూన్ ముల్తానీ మిట్టి, రెండు టేబుల్ స్పూన్ పుదీనా రసం, టమాటా రసం టేబుల్ స్పూన్ వేసి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత.. గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. ముఖంపై మృతకణాలు, మచ్చలు తొలగిపోయి కాంతివంతంగా మెరుస్తుంది. పుదీనా మచ్చలను తగ్గించడంతో ఎంతగానో ఉపయోగపడుతుంది.

బియ్యంపిండి, పాలు, తేనె ఫేస్ ప్యాక్
చిన్న బౌల్ తీసుకుని.. అందులో రెండు టేబుల్ స్పూన్ బియ్యంపిండి, టీ స్పూన్ పాలు, అరటీస్పూన్ తేనె కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. ముఖంపై ముడతలు, మొటిమలు, మచ్చలు తొలగిపోయి కాంతివంతంగా మెరుస్తుంది.


చక్కెర, పసుపు, కొబ్బరి నూనె ఫేస్ ప్యాక్
చిన్న గిన్నె తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ పంచదార, చటికెడు పసుపు, కొబ్బరి నూనె కలిపి మెత్తగా పేస్ట్ లాగా చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకుని అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. చక్కనైన చర్మం మీ సొంతం అవుతుంది. ముఖంపై మొటిమలు, మొంగు మచ్చలను తొలగిస్తుంది.

నారింజ తొక్కలు, పాలు ఫేస్ ప్యాక్
ముందుగా చిన్న పాత్ర తీసుకుని.. అందులో నారింజ తొక్కలను వేసి, ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని.. అందులో రెండు టేబుల్ స్పూన్ పచ్చిపాలు కలిపి ముఖానికి పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ రాత్రి సమయంలో పెట్టుకుంటే మంచిది. ఇలా వారానికి రెండు మూడుసార్లు చేస్తే.. చర్మం కాంతివంతంగా, నిగారింపు ఉంటుంది. ముఖం తాజాగా మెరుస్తుంది కూడా.

కొబ్బరి నూనె, కాఫీ పొడి, ఆలివ్ ఆయిల్ ఫేస్ ప్యాక్
ముందుగా చిన్న గిన్నె తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ కాపీ పొడి, టీ స్పూన్ కొబ్బరి నూనె, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి పెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే ఉత్తమ ఫలితం ఉంటుంది. ముఖం తెల్లగా వస్తుంది. ఇలాగే ట్యాన్ కూడా తొలగిపోతుంది.

Also Read: కరోనా డేంజర్ బెల్స్‌.. ఒక్క రోజే ఏడుగురు మృతి

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Big Stories

×