BigTV English

OTT Movie : దెయ్యం సాయంతో వందల కోట్లు… కానీ చివరికి అడిచ్చే ట్విస్టుకు గుండె గుభేల్

OTT Movie : దెయ్యం సాయంతో వందల కోట్లు… కానీ చివరికి అడిచ్చే ట్విస్టుకు గుండె గుభేల్

OTT Movie : హారర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు ఇండోనేషియన్ సినిమాలను తప్పకుండా చూడాలి. ఎందుకంటే ఈ సినిమాలలో చేతబడి, దెయ్యాల కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఒక వ్యక్తి దెయ్యంతో ఒప్పందం చేసుకుని, డబ్బులు బాగా సంపాదిస్తాడు. దానికి బదులు ఇతడు చేయకూడని పనులు చేస్తుంటాడు. ఈ స్టోరీలో హారర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఒంటరిగా చూస్తే జడుసుకుంటారు. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

లెస్మానా అనే వ్యక్తి  దెయ్యం తో ఒప్పందం చేసుకుని, కొన్ని ఆచారాలను పాటిస్తూ డబ్బును కూడా బాగా సంపాదిస్తాడు. ఒక రోజు అతని భార్య ఇంటాన్ ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ తర్వాత అతను రిటైర్డ్ నటి లక్ష్మిని వివాహం చేసుకుంటాడు. అయితే ఆ తరువాత అతని సంపద క్షీణిస్తుంది. అతను ఒక వింత వ్యాధితో కోమాలోకి వెళ్తాడు. లెస్మానా కు మొదటి భార్యకు పుట్టిన ఆల్ఫీ అనే కూతురు ఉంటుంది. తన తల్లి చనిపోవడంతో అతనికి దూరంగా ఉంటోంది. అయితే ఇప్పుడు తండ్రి కోమాలోకి ఎలా వెల్లడో తెలుసుకోవాలని అనుకుంటుంది. ఆల్ఫీ తన సవతి తల్లి లక్ష్మి, సవతి సోదరుడు రూబెన్ (సమో రాఫెల్), సవతి సోదరీమణులు మాయ (పెవిటా పియర్స్), నారా (హదీజా షహాబ్)లతో తన తండ్రి నివసించే విల్లాకు చేరుకుంటుంది.  ఈ క్రమలో లక్ష్మి ఆస్తిని అమ్మాలని అనుకుంటున్నట్లు ఆల్ఫీ తెలుసుకుంటుంది.


ఈ లోగా రూబెన్ ఒక మూసివేయబడిన బేస్‌మెంట్ తలుపును తెరవడంతో ఒక దుష్ట శక్తి బయటకి వస్తుంది. ఈ శక్తి లక్ష్మిని ఆవహించి, ఆమె పై దాడి చేస్తుంది. ఇక ఆల్ఫీకి తన తండ్రి గురించి ఒక భయంకరమైన రహస్యం తెలుస్తుంది. లెస్మానా తన డబ్బులు సంపాదించడం కోసం దెయ్యంతో ఒప్పందం చేసుకున్నాడని, దీనికోసం అతను చుట్టుపక్కల వాళ్ళ ఆత్మలను బలి ఇచ్చాడని తెలుసుకుంటుంది.  ఆల్ఫీ తన తల్లి మరణం ఆత్మహత్య కాదని, ఈ ఒప్పందం వల్ల జరిగిందని తెలుసుకుంటుంది. చివరికి ఆ దుష్ట శక్తి చేతిలో వీళ్ళంతా బలి అవుతారా ? ఆల్ఫీ ఆ దుష్ట శక్తిని అంతం చేస్తుందా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ ఇండోనేషియన్ హారర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : గోల్డ్ స్మగ్లింగ్ కోసం పుష్పను మించిన ప్లాన్… ఈ మలయాళ థ్రిల్లర్ లో ఒక్కో ట్విస్టుకు బుర్ర బద్దలే

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

ఈ ఇండోనేషియన్ హారర్ మూవీ పేరు’ మే ది డెవిల్ టేక్ యు’ (May the Devil Take You). 2018లో విడుదలైన ఈ హారర్ మూవీకి టిమో జహ్జాంటో దర్శకత్వం వహించింది. ఇది దెయ్యాలు, హాంటెడ్ హౌస్ థీమ్‌లను తలపిస్తుంది. ఇది ‘ది ఈవిల్ డెడ్’వంటి క్లాసిక్ హారర్ చిత్రాల తరహాలో ఉంటుంది. ఇందులో చెల్సియా ఇస్లాన్ (ఆల్ఫీ), పెవిటా పియర్స్ (మాయ), రే సహెటపీ (లెస్మానా), కరీనా సువాందీ (లక్ష్మి), సమో రాఫెల్ (రూబెన్), హదీజా షహాబ్ (నారా) వంటి నటీనటులు నటించారు. నెట్‌ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లలో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

Big Stories

×