Soaked Anjeer Benefits: అంజీర్ ఒక పండు. దీనిని ప్రతి రోజు తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కానీ కొంతమంది అంజీర్‌లను పండ్లను నీటిలో నానబెట్టి తర్వాత తింటే.. ఇంకొంత మంది మాత్రం పాలతో కలిపి తీసుకుంటారు. కానీ నీటిలో నానబెట్టిన అంజీర్ పండ్లను తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయా లేదా పాలలో నానబెట్టిన అంజీర్ తినడం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందా అనే ప్రశ్న చాలా తలెత్తుతుంది? కాబట్టి అంజీర్ పండ్లను పాలతో కలిపి తినడం వల్ల ఎక్కువ ప్రయోజనమా లేక నీటిలో నానబెట్టడం వల్ల ఎక్కువ ప్రయోజనమా అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పాలలో నానబెట్టిన అంజీర్ పండ్లను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఎందుకంటే ఇందులో లభించే ఫైబర్, విటమిన్లు , ఖనిజాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో, ఎముకలను బలోపేతం చేయడంలో , హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా పాలు.. ప్రోటీన్ , కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి. ఈ రెండింటి కలయిక అలసటను తొలగించడమే కాకుండా.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
నీటిలో నానబెట్టిన అంజీర్ పండ్ల ఆరోగ్య ప్రయోజనాలు:
అంజీర్ పండ్లను పాలకు బదులుగా నీటిలో నానబెట్టి తింటే.. అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఉదాహరణకు.. మీరు జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే నీటిలో నానబెట్టిన అంజీర్ పండ్లు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. అంజీర్ పండ్లలో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకం , అజీర్ణం వంటి సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో నీటిలో నానబెట్టిన అంజీర్ పండ్లను తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అంతే కాకుండా రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. అందుకే.. రాత్రిపూట నీటిలో నానబెట్టిన అంజీర్ పండ్లను తినడం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సులభమైన, సహజమైన మార్గం.
Also Read: జీర్ణ సమస్యలా ? ఇలా చేస్తే.. ప్రాబ్లమ్ సాల్వ్
ఏది బెటర్ ?
మీరు అంజీర్ పండ్లను పాలలో లేదా నీటిలో నానబెట్టడం ద్వారా కూడా తినవచ్చు. ఇది అంజీర్ పండ్లలో లభించే పోషకాలను పెంచుతుంది. మీరు అంజీర్ పండ్లను పాలలో నానబెట్టి తింటే.. అంజీర్ పండ్లలోని పోషకాలు మాత్రమే కాకుండా.. పాలలోని పోషకాల ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
అంజీర్ పండ్లను తినడానికి.. వాటిని రాత్రంతా పాలలో నానబెట్టండి. తద్వారా అవి పాలలోని పోషకాలను కూడా గ్రహిస్తాయి. తద్వారా వాటి పోషక విలువలు పెరుగుతాయి. అందుకే.. పాలలో అంజీర్ పండ్లను కలుపుకుని తినడం వల్ల మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ మీకు లాక్టోస్ అలెర్జీ అయితే.. మీరు వాటిని నీటిలో నానబెట్టిన తర్వాత మాత్రమే తినండి.