Sara – Shubman Gill: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… గుజరాత్ జట్టు కెప్టెన్ శుభమాన్ గిల్ ప్రేమాయణం మరోసారి బయటపడింది. గుజరాతి జట్టు కెప్టెన్ శుభమాన్ గిల్ ప్రియురాలు సారా టెండూల్కర్ అని గత కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. శుభమాన్ గిల్ మ్యాచ్ల కోసం ఎక్కడికి వెళ్లినా… అక్కడికి సారా టెండూల్కర్ వెళ్తున్నారని ఇప్పటికి వార్తలు వస్తూ ఉంటాయి. విదేశాలకు వెళ్లినా కూడా అక్కడికి ఆమె వెళుతూ ఉంటుంది. అయితే మ్యాచ్ కోసమని చెప్పకుండా…. స్నేహితులతో విహారయాత్ర పేరుతో బయటకు వెళ్తుంది. అనంతరం స్టేడియంలో మెరిసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
గుజరాత్ జెర్సీలో సారా టెండూల్కర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా గురువారం రోజున గుజరాత్ టైటాన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో అనూహ్యంగా లక్నో విజయం సాధించింది. 33 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది లక్నో. అన్ని బలమైన జట్లపై గెలుస్తూ ముందుకు వస్తున్న గుజరాత్ టైటాన్స్… లక్నో చేతులో మాత్రం దారుణంగా ఓడిపోయింది. ఈ టోర్నమెంట్లో ఇప్పటికే రెండుసార్లు లక్నో చేతుల్లోనే గుజరాత్ ఓడిపోయింది. అయితే గుజరాత్ ఓడిపోయినప్పటికీ ఆ జట్టు కెప్టెన్ శుభమాన్ గిల్ మాత్రం కాస్త ఊరట లభించిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే… నిన్నటి మ్యాచ్ కు సారా టెండూల్కర్ రావడమే. గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో లక్నో వర్సెస్ గుజరాత్ మధ్య ఫైట్ జరిగింది.
ఈ స్టేడియానికి సారా టెండూల్కర్ వచ్చినట్లు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అది కూడా గుజరాత్ జట్టు గురువారం లైట్ పింక్ డ్రెస్ వేసింది. ఈ సందర్భంగా…. సారా టెండూల్కర్ కూడా లైట్ పింక్ డ్రెస్ ధరించి అందరిని ఆకట్టుకున్నట్లు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. క్యాన్సర్ రోగాన్ని తరిమి కొట్టాలన్న సంకేతాన్ని జనాల్లోకి తీసుకువెళ్లేందుకు… గుజరాత్ జట్టు ప్రతిసారి ఒక మ్యాచ్ కు ఇలా లైట్ పింక్ జెర్సీ వేస్తూ ఉంటుంది. అయితే లక్నోతో జరిగిన మ్యాచ్ లో కూడా లైట్ పింక్ జెర్సీలో మెరిసింది గుజరాత్ టీం. ఈ సందర్భంగా శుభమాన్ గిల్ ప్రియురాలు సారా టెండూల్కర్ కూడా పింక్ కలర్ జెర్సీ వేసుకుంది. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ… ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత విచ్చలవిడిగా ఫోటోలు క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. ఈ సారా టెండూల్కర్ విషయంలో కూడా అదే జరిగినట్లు కొంతమంది భావిస్తున్నారు.
బ్రేకప్ చెప్పిన సారా
శుభమాన్ గిల్ కు ఇటీవల సారా టెండూల్కర్ బ్రేకప్ చెప్పినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ల వెంబడి.. శుభమాన్ గిల్ పడడంతో ఈ నిర్ణయం తీసుకుందని కూడా ప్రచారం జరిగింది. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు సిద్ధార్థ తో లవ్ లో పడినట్లు సారా పై వార్తలు కూడా వచ్చాయి.
Also Read: Also Read: LSG VS GT: దిగ్వేశ్ పోయాడు.. లక్నోలో మరొకడు తగిలాడు..నోట్ బుక్ సిగ్నచర్ సెలెబ్రేషన్స్ చేస్తూ