BigTV English

Sorakaya Chapati: సొరకాయ చపాతి ఇలా చేశారంటే, దూది కంటే మెత్తగా వస్తుంది

Sorakaya Chapati: సొరకాయ చపాతి ఇలా చేశారంటే, దూది కంటే మెత్తగా వస్తుంది

చపాతీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీనిలో ఇతర కూరగాయలను పోషక పదార్థాలను కలిపి చేస్తే అది ఇంకా కమ్మగా ఉంటుంది. మేమిక్కడ సొరకాయ చపాతీ రెసిపీ ఇచ్చాము. సాధారణ చపాతీతో పోలిస్తే సొరకాయ చపాతీ తినడం వల్ల పోషకాలు మరింతగా శరీరానికి అందుతాయి. దీన్ని చేయడం కూడా చాలా సులువు. ఒకసారి దీన్ని చేశారంటే మీరు పదేపదే ఈ సొరకాయ చపాతీ తినడానికి ఇష్టపడతారు. పైగా పిల్లలకు ఈ సొరకాయ చపాతీ తినిపించడం వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది. సొరకాయ కూరను ఇస్తే వారు తినరు. అదే సొరకాయ చపాతీ రూపంలో ఇస్తే మాత్రం వారి తినే అవకాశం ఉంది.


సొరకాయ చపాతి రెసిపీకి కావాల్సిన పదార్థాలు
గోధుమ పిండి – రెండున్నర కప్పులు
సొరకాయ తురుము – రెండు కప్పులు
గరం మసాలా – అర స్పూను
పచ్చిమిర్చి తరుగు – ఒక స్పూను
ఉప్పు – రుచికి సరిపడా మిరియాల పొడి అర స్పూను ఇంగువ చిటికెడు నీళ్లు సరిపడినంత స్పూన్లు

సొరకాయ చపాతి రెసిపీ
1. గోధుమ పిండిని ఒక ప్లేట్లో వేసి ఉంచాలి.
2. అందులో రెండు స్పూన్ల నూనె వేయాలి.
3. అలాగే గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి తరుగు, మిరియాల పొడి, ఇంగువ వేసి బాగా కలపాలి.
4. ఆ తర్వాత సొరకాయ తురుమును కూడా వేసి బాగా కలుపుకోవాలి.
5. సొరకాయ తురుము వేశాక అందులో ఉన్న నీరు కూడా పిండిలో కలుస్తుంది.
6. అలా కలిసిన తర్వాత మరి కొంచెం నీళ్లు వేసి ఈ మొత్తాన్ని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి.
7. ఇది మృదువుగా కలిశాక పావుగంట సేపు పక్కన పెట్టుకోవాలి.8. ఆ తరువాత చిన్న ముద్దను తీసి చపాతీలా ఒత్తుకొని పెనం మీద రెండు వైపులా కాల్చుకోవాలి.
9. అంతే టేస్టీ సొరకాయ చపాతీ రెడీ అయినట్టే.
10. దీన్ని పెరుగుతో తింటే రుచి అదిరిపోతుంది.


సొరకాయను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. తరచూ సొరకాయ తినేవారికి బరువు నియంత్రణలో ఉంటుంది. మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలంటే సొరకాయను ఆహారంలో భాగం చేసుకోవాలి. సొరకాయలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, ఐరన్, ఫోలేట్, మెగ్నీషియం, జింక్, పొటాషియం అన్ని పుష్కలంగా ఉంటాయి. అలాగే నీటి శాతం కూడా ఎక్కువ సొరకాయను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మంచిగా నిద్ర పడుతుంది. ప్రతిరోజూ సొరకాయ రసం తాగే వారికి జుట్టు తెల్లబడే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది.

బీపీ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజూ సొరకాయను ఆహారంలో భాగం చేసుకోవడానికి ప్రయత్నించండి. సొరకాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. వేసవిలో సొరకాయ తినడం అలవాటు చేసుకుంటే అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. సొరకాయను ఎలాంటి రసాయనాలు వేయకుండా పండిస్తారు. కాబట్టి ఇది అన్ని రకాలుగా సురక్షితమైనదే. దీనిలో ఐరన్, పొటాషియం వంటివి అధికంగా ఉంటాయి. అలాగే పీచు కూడా నిండి ఉంటుంది. ఒకసారి మీరు దీన్ని తిని చూడండి కచ్చితంగా మీకు నచ్చితేరుతుంది.

Related News

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Big Stories

×