RC16 : రామ్ చరణ్ తేజ్ ఒకప్పుడు తెలుగుకు మాత్రమే పరిమితమైన, ఇప్పుడు మాత్రం గ్లోబల్ స్థాయిలో మంచి గుర్తింపు సాధించుకున్నాడు. చిరుత సినిమాతోనే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చరణ్ మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీర సినిమాతో ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డును క్రియేట్ చేశాడు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయినందుకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించింది. వాస్తవానికి ఈ సినిమా ఈ రోజుల్లో వచ్చుంటే పర్ఫెక్ట్ పాన్ ఇండియా సినిమా అని చెప్పొచ్చు. మగధీర సినిమా తర్వాత వచ్చిన ఆరెంజ్ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత చరణ్ ఎన్ని సినిమాలు చేసినా కూడా అవి అంతంత మాత్రమే ఆడాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ధ్రువ సినిమాతో తనలో మంచి మేకవర్ చూపించాడు చరణ్.
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమాలో చిట్టిబాబు అనే పాత్రకు ప్రాణం పోసాడు చరణ్. ఇది కదా మెగాస్టార్ తనయుడి టాలెంట్ అంటే అని చాలా మందితో అనిపించాడు. త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు వచ్చినా కూడా, రామ్ చరణ్ చేసిన రంగస్థలం క్యారెక్టర్ చాలామందికి ఫేవరెట్ అని చెప్పాలి. రామ్ చరణ్ లాంటి మాస్ కమర్షియల్ ఇమేజ్ ఉన్న హీరోని సుకుమార్ అలా చూపించి సక్సెస్ అవ్వడం అనేది గ్రేట్ థింగ్. ఇకపోతే అదే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు బుచ్చిబాబు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ తన 16వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అలానే రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ సినిమా జనవరి 10న సంక్రాంతి కానుక రిలీజ్ కానుంది. గేమ్ చేంజర్ రిలీజ్ కి కావలసిన పనులన్నీ తుది దశలో ఉన్నాయి.
ఇక బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ ప్రాంతానికి చెందిన చాలామందిని ఆడిషన్స్ కూడా చేశాడు దర్శకుడు బుచ్చిబాబు. అలానే ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అని వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ సైడ్ ప్రొఫైల్ లో ఉన్న ఫోటో ఒకటి అప్లోడ్ చేశాడు దర్శకుడు బుచ్చిబాబు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సాలిడ్ మేకోవర్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇంతకుముందు ఎన్నడూ చూడని విధంగా మాసివ్ లుక్ లో రామ్ చరణ్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. రంగస్థలం మాదిరిగానే గుబురు గడ్డంతో రిలీజ్ చేసిన పిక్ లో కనిపిస్తున్నాడు చరణ్.
Also Read : Hero Siddharth on Pushpa Movie: పుష్ప సినిమాపై హీరో సిద్ధార్థ్ షాకింగ్ కామెంట్స్