BigTV English
Advertisement

Ear wax problems: చెవిలో గులిమి ఎలా ఏర్పడుతుంది? దాని ఉపయోగం ఏమిటి?

Ear wax problems: చెవిలో గులిమి ఎలా ఏర్పడుతుంది? దాని ఉపయోగం ఏమిటి?

ప్రతి మనిషికి చెవిలో గులిమి ఏర్పడే సమస్య ఉంటుంది. ఒక్కోసారి ఆ గులిమిఎక్కువగా మారి ఇబ్బంది పెడుతుంది. అలాంటప్పుడు వైద్యులు ఆ గులిమిని తొలగిస్తూ ఉంటారు. మరి కొందరు పుల్లలు, అగ్గిపుల్లలు వంటివి పెట్టి తీసేస్తూ ఉంటారు. నిజానికి పుల్లలు వంటివి పెట్టి తీయడం మంచి పద్ధతి కాదు. గులిమి ఎక్కువగా అనిపిస్తే వైద్యులను కలిస్తే వారు తగిన విధంగా దాన్ని తొలగిస్తారు. అయితే అసలు చెవిలో గులిమి ఎలా ఏర్పడుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? అది బయట నుంచి చెవిలో చేరే పదార్థమా? లేక చెవిలోనే ఉత్పత్తి అయ్యే పదార్థమా? తెలుసుకోవాలని ఎప్పుడైనా అనిపించిందా?


గులిమిని ఒక వృధా పదార్ధంగా చూస్తారు. కానీ దానికి కూడా ఒక పని ఉంది. గులిమి అనేది చెవి లోపలి గ్రంధుల్లో ఉత్పత్తి అవుతుంది. దీనికి కూడా అనేక విధులు ఉంటాయి. గులిమి పని… చెవులను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడం. అలాగే చెవుల్లో ఉండే చిన్న చిన్న రక్తనాళాలు ఎండిపోకుండా కాపాడడం. బయటి నుంచి వచ్చే ధూళికణాలు చెవిలోపలకూ చేరకుండా ఇది అడ్డుకుంటుంది. అలాగే నీరు కూడా చెవి లోపలకి పోకుండా రక్షిస్తుంది. చెవికి ఎలాంటి వ్యాధులు రాకుండా అడ్డుకోవడంలో గులిమి పాత్ర ముఖ్యమైనది. గులిమిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. మన చెవిని ఆరోగ్యంగా ఉంచేందుకు ఈ గులిమి ఎంతో ఉపయోగపడుతుంది.

అయితే అప్పుడప్పుడు గులిమి కూడా సమస్యగా మారుతుంది. అది ఒక్కొక్కసారి చెవి రంధ్రానికీ బయట వైపు వచ్చి ఎండిపోయినట్టు మారుతుంది. దానిని తీసేందుకే ఎక్కువ మంది అగ్గిపుల్లలు, పిన్నులు వంటివి వాడతారు. ఇలా చేస్తే సమస్య పెరిగిపోతుంది. వాటి ఉత్పత్తి పెరిగి కొన్ని సంవత్సరాలకు ఎక్కువగా మారినప్పుడు. చెవులకు అవరోధంగా అనిపిస్తుంది. చెవి నొప్పి వస్తుంది. వినికిడి సమస్యలు కూడా వస్తాయి. అలాంటి సమయంలో గులిమిని తొలగించేందుకు కొన్ని వైద్య పద్ధతులు ఉన్నాయి.


ఇవి చాలా తక్కువ ఖర్చుతోనే పూర్తవుతాయి. అయినా కూడా కొంతమంది కాటన్ బడ్స్, ఇయర్ బడ్స్ వంటివి పెట్టి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజానికి అలా తీయడం ఏ మాత్రం మంచి పద్ధతి కాదు. అవి ఒకసారి చెవి లోపలిభాగాన్ని తాకితే చెవుడు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గులిమి మరికొంత లోపలికి చేరిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పిన్నులు, పుల్లలు ఉపయోగించే బదులు వైద్య సహాయం తీసుకుని త్వరగా తొలగించుకోవడం మంచిది.

ఇయర్ వ్యాక్స్ ను తొలగించే ఇయర్ డ్రాప్స్ మార్కెట్లో అధికంగా ఉన్నాయి. వాటినే వైద్యులు సూచిస్తూ ఉంటారు. వీటిని వాడడం ద్వారా గులిమిని సులువుగా బయటకు తీయవచ్చు. ఈ డ్రాప్స్ గులిమిని మెత్తబడి ముందుకు వచ్చేలా చేస్తాయి. అలా ముందుకు వచ్చాక వాటిని చిన్న మిషన్ ద్వారా వైద్యులు తొలగిస్తారు. ఇది ఎంతో మంచి పద్ధతి.

ఆలివ్ నూనె, లేదా బాదం నూనెను కూడా చెవిలో వేసుకుంటే గులిమి మెత్తబడుతుంది. కాకపోతే ఎక్కువ సమయం తీసుకుంటుంది. చెవి బ్లాక్ అయినట్టు అనిపిస్తుంది. నాలుగు రోజులు ఇలా చేస్తే చెవిలో ఉన్న గులిమి మెత్తబడి సులువుగా బయటకు వస్తుంది. వైద్యులు మైక్రో సక్షన్ పద్ధతితో చెవిలోని గులిమిని తీసేస్తారు. మైక్రోసాఫ్ట్ సహాయంతో మీ చెవి లోపలికి చూస్తూనే మెల్లిగా గులిమిని తీస్తారు. వారికి ఇది సురక్షితమైన పద్ధతి గులిమిని తీసేసినా, మళ్లీ మన చెవి అవసరానికి తగ్గట్టు లోపల ఉన్న గ్రంథులు దాన్ని ఉత్పత్తి చేస్తూనే ఉంటాయి.

Also Read: టైల్స్ మురికిగా మారాయా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే మెరిసిపోతాయ్

Related News

Hot Water: ఈ సమస్యలున్న వారికి వేడినీళ్లు హానికరం.. పొరపాటున కూడా తాగొద్దు!

Tomato Egg Curry: టమాటో ఎగ్ కర్రీ.. ఈ అద్భుతమైన రుచికి ఎవ్వరైనా అబ్బా అనాల్సిందే !

Glass Objects: ఇంట్లో గాజు వస్తువులు పగిలితే.. శుభమా ? అశుభమా ?

Radish in Winter: శీతాకాలంలో ముల్లంగి తినడం వల్ల ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు

Nonveg: చికెన్, మటన్ కర్రీ వండే ముందు వాటిని పెరుగు లేదా నిమ్మకాయతో మ్యారినేట్ చేస్తారెందుకు?

Worshipping God: నిద్రలేవగానే కరదర్శనం.. సానుకూల శక్తితో రోజును ప్రారంభించడానికి పునాది!

Tattoo: పచ్చబొట్లు తెగ వేసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి!

Pink Salt Benefits: పింక్ సాల్ట్‌ కోసం ఎగబడుతున్న జనం.. ఎందుకో తెలిస్తే మీరూ కొంటారు!

Big Stories

×