Sorakaya pachi karam: ఉరుకులు పరుగుల జీవితంలో ఉదయాన్నే వంట చేయడం అంటే ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. అందులోనూ మహిళలు రోజూ రకరకాల కూరలు వండి విసుగెత్తిపోతుంటారు. ఎప్పుడూ ఒకే లాంటి సాంబార్, పప్పు తిని బోర్ కొట్టినప్పుడు ఏదైనా సింపుల్‌గా, కారంకారంగా తినాలనిపిస్తుంది. అలాంటి సమయంలో సొరకాయతో అదిరిపోయే పచ్చి కారం కూర ట్రై చేయెచ్చు. ఇది తయారు చేయడం చాలా ఈజీ, పైగా రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా..
తాజా సొరకాయ – 1 మీడియం సైజ్
పచ్చిమిర్చి – 6 నుంచి 8
అల్లం – చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు – 6- 8
జీలకర్ర – 1 స్పూన్
పసుపు – పావు స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – 2 లేదా 3 స్పూన్లు
పోపు దినుసులు (ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు)-1 స్పూన్
కరివేపాకు – రెమ్మ
కొత్తిమీర తరుగు – కొద్దిగా
1. మొదటగా తాజా సొరకాయను తీసుకుని ..పై తొక్క చెక్కుకోవాలి. తరువాత దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు మరీ పెద్దవిగా కాకుండా సమానంగా ఉంటే కూర త్వరగా ఉడుకుతుంది.
ఇప్పుడు ఒక రోకలి లేదా మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, తగినంత ఉప్పు వేయాలి. వీటిని మెత్తగా కాకుండా కొంచెం బరకగా (కచ్చాపచ్చాగా) దంచాలి లేదా మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చి కారమే ఈ కూరకు అద్భుతమైన రుచిని ఇస్తుంది.
2.స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె వేగాక, పోపు దినుసులు (ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు) వేసి చిటపటలాడించాలి. తరువాత దంచిన కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేయాలి. ఇప్పుడు ముందుగా .. కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను పోపులో వేసి బాగా కలపాలి. అందులో చిటికెడు పసుపు వేసి, మంటను మీడియం సైజ్‌లో ఉంచి మూత పెట్టాలి. సొరకాయలో.. ఉండే నీటితోనే ముక్కలు మెత్తగా ఉడుకుతాయి. ఒకవేళ అవసరమైతే కొద్దిగా నీటిని చల్లుకోవచ్చు.
Also Read: క్యాబేజీ పప్పు ఇలా చేస్తే..ఎవ్వరైనా లొట్టలేసుకుంటూ తింటారు!
3. సొరకాయ ముక్కలు దాదాపుగా ఉడికిన తర్వాత, మనం ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చి కారం పేస్ట్‌ను అందులో కలపాలి. పచ్చి కారం పచ్చి వాసన పోయే.. వరకు మరో 3 నుంచి 5 నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు చల్లుకొని దించేస్తే, గుమగుమలాడే రుచికరమైన సొరకాయ పచ్చి కారం కూర రెడీ!
ఈ కూర ప్రత్యేకత ఏంటంటే ఇందులో కారం పొడికి బదులుగా పచ్చిమిర్చి కారం వాడటం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని పక్కన నెయ్యి వేసుకొని తింటే ..ఆ రుచే వేరు.లంచ్ బాక్స్‌లోకి కూడా ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. ఈ సారి మీ ఇంట్లో కూడా ఈ ట్రెండీ అండ్ హెల్దీ సొరకాయ పచ్చి కారం కూరను ట్రై చేయండి!