E-Paper
Advertisement

డిప్రెషన్, స్ట్రెస్ లేకుండా ప్రశాంతమైన జీవితం కావాలా? ఈ 5 జపాన్ టెక్నిక్స్ మీ కోసమే

డిప్రెషన్, స్ట్రెస్ లేకుండా ప్రశాంతమైన జీవితం కావాలా? ఈ 5 జపాన్ టెక్నిక్స్ మీ కోసమే
Advertisement

Japanese habits For peaceful life| పని చేస్తున్నా మనసు మాత్రం ఏదో ఒక ఆలోచనలో మునిగిపోయి ఉంటుందా? భవిష్యత్తు గురించి ఆందోళన, ఉద్యోగంలో ప్రమోషన్ టెన్షన్, కుటుంబ సమస్యలు, బంధాల్లో గొడవలు.. ఇలా ఎన్నో విషయాలు మనశ్శాంతిని దూరం చేస్తుంటాయి. రోజంతా బిజీగా ఉన్నా మనసుకు మాత్రం విశ్రాంతి ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో జీవితాన్ని కొంచెం ప్రశాంతంగా మార్చుకోవడానికి జపనీస్ కల్చర్‌లోని కొన్ని చిన్న అలవాట్లు ఉపయోగపడతాయి. వీటిని రోజువారీ జీవితంలో పాటించడం కూడా చాలా సులభం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1.  సోజీ: మనశ్శాంతి కోసం ఇల్లు శుభ్రం చేయడం

జపనీస్ సంస్కృతిలో సోజీ అంటే శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం. చాలామంది ఇంటిని శుభ్రం చేయడాన్ని అదనపు పనిగా భావిస్తారు. కానీ ఈ అలవాటును మనసుకు ప్రశాంతంగా ఉంచే సాధనం కూడా. గదిని సర్దడం, టేబుల్‌ను శుభ్రం చేయడం, వస్తువులను క్రమంగా పెట్టడం వంటివి చేయండి. ఆ సమయంలో ఇతర ఆలోచనలను పక్కనపెట్టి చేస్తున్న పనిపై దృష్టి పెట్టండి. ఇలా చేయడం వల్ల పరిసరాలు శుభ్రంగా ఉండటంతో పాటు మనసుకు కూడా కొంత ప్రశాంతత లభించవచ్చు.

2. ఇటడకిమాసు: ఆహారం తినేసమయంలో కృతజ్ఞత చెప్పడం

Advertisement

జపాన్‌లో భోజనం ప్రారంభించే ముందు ఇటడకిమాసు అని అంటారు. మనకు ఆహారం అందించేందుకు ప్రకృతి, రైతులు, వంట చేసినవారికి, వారి కృషికి కృతజ్ఞత చెప్పడం దీని భావం.
తినేటప్పుడు హడావుడి చేయకుండా కాసేపు ఆగండి. మీ ముందు ఉన్న ఆహారాన్ని గౌరవించండి. దాని వెనుక ఉన్న కష్టం, ప్రకృతి సహకారాన్ని గుర్తు చేసుకోండి. ఇలా తినడం వల్ల ఆహారంపై శ్రద్ధ పెరుగుతుంది. భోజనాన్ని ప్రశాంతంగా ఆస్వాదించే అలవాటు కూడా ఏర్పడుతుంది.

3. యుబునే ని సుకారు: రిలాక్స్‌గా ఉండడానికి వెచ్చని నీటితో స్నానం

జపనీస్ స్నాన సంప్రదాయాల్లో ‘యుబునే ని సుకారు’ అనే పద్ధతి ఉంది. అంటే బాత్‌టబ్‌లో గోరువెచ్చని నీటిలో కాసేపు కూర్చోవడం. రోజంతా పని చేసి అలసిపోయినప్పుడు ఈ అలవాటు శరీరానికి విశ్రాంతినిస్తుంది.

Advertisement

సాయంత్రం గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. నీరు మరీ వేడిగా ఉండకుండా చూసుకోండి. ఆ సమయంలో ఫోన్‌ దూరంగా పెట్టి ప్రశాంతంగా గడపండి.

4. మొత్తైనై: వనరుల వృథాను తగ్గించుకోవడం

మొత్తైనై అనేది ఏ వస్తువునూ వృథా చేయకూడదనే జపనీస్ భావన. ఆహారం, నీరు, ఇతర వస్తువుల విలువను గుర్తించి జాగ్రత్తగా ఉపయోగించాలని దీని ఉద్దేశం. అవసరమైనంత మాత్రమే కొనండి. మిగిలిన ఆహారాన్ని వృథా చేయకుండా చూసుకోండి. పాడైన వస్తువులను వెంటనే పారేయకుండా మరమ్మతు చేయించండి. ఈ చిన్న మార్పులు బాధ్యతాయుతమైన జీవనశైలికి తోడ్పడతాయి.

Also Read: మీ జీవితాన్ని నడిపించేది ఎవరు? భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానం ఇదే

5. హయోకి: ఉదయాన్నే లేచి ప్రశాంతంగా ఆలోచించడం

హయోకి అంటే ఉదయాన్నే నిద్రలేవడం. లేవగానే ఫోన్ చూడటం లేదా పనుల్లో మునిగిపోవడం కాకుండా కొంత సమయం మీకోసం కేటాయించండి. 5 లేదా 6 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి. నెమ్మదిగా శ్వాస తీసుకోండి. ఆ రోజు చేయాల్సిన పనుల గురించి ఆలోచించండి. ఇలా చేస్తే ఆ రోజు హడావుడి లేకుండా ప్రారంభమవుతుంది. అయితే తగినంత నిద్రపోవడం కూడా అంతే ముఖ్యం.

Also Read: చాణక్య నీతి.. వైవాహిక జీవితం సుఖంగా కలకాలం సాగాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలి

చిన్న అలవాట్లతో జీవితంలో ప్రశాంతత పెంచుకోవచ్చు

ఈ అలవాట్లన్నింటినీ ఒకేసారి ప్రారంభించాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన ఒక అలవాటుతో మొదలుపెట్టండి. క్రమంగా మిగతా అలవాట్లను కూడా రోజువారీ జీవితంలో చేర్చుకోండి. శుభ్రత, కృతజ్ఞత, విశ్రాంతి, పొదుపు, ప్రశాంతమైన ఉదయం.. ఇవన్నీ జీవితాన్ని మరింత సమతుల్యంగా మార్చుకోవడానికి సహాయపడతాయి.

Related News

రోజూ తెల్లవారుజామున 3 గంటలకే మెలకువ వచ్చేస్తోందా? మీ శరీరం ఏం చెబుతోందంటే!

రోజుకు ఎన్ని లవంగాలు తింటే సేఫ్? ఈ తప్పు చేస్తే రక్తం పలచబడి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లొచ్చు!

జిమ్‌లో బట్టలు మార్చుకుంటున్నారా? మహిళలు తప్పనిసరిగా ఈ 5 జాగ్రత్తలు పాటించాలి

చికెన్, గుడ్లు అక్కర్లేదు.. ఈ 5 హోమ్‌మేడ్ కాంబోలతో ఒక పూటకి 50g ప్రోటీన్ పొందొచ్చు!

సామాన్యుడికి అంతుచిక్కని..శివుడి 5 అద్భుతమైన రహస్య శక్తులు ఇవే!

చలికాలంలో ఫౌండేషన్ వేస్తే ప్యాచీగా కనిపిస్తోందా? మేకప్‌కు ముందు ఈ టిప్స్ పాటించండి

జీతం రూ.85 వేలు, SIP పెట్టుబడి రూ.35 వేలు.. బ్యాలెన్స్ రూ.3200 మాత్రమే.. యువ ఇన్వెస్టర్‌లు చేసే తప్పులివే

Big Stories

Advertisement
×