E-Paper
Advertisement

ఐస్‌క్రీమ్‌ను ఇలా కూడా తయారుచేయొచ్చా? ఈ జపనీస్ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!

ఐస్‌క్రీమ్‌ను ఇలా కూడా తయారుచేయొచ్చా? ఈ జపనీస్ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!
Advertisement

Mochi Ice Cream: మోచి ఐస్‌క్రీమ్.. పేరు వినడానికి కొత్తగా ఉన్నా, ఒక్కసారి రుచి చూస్తే మాత్రం ఫిదా అయిపోవాల్సిందే. జపాన్‌లో ఎంతో ఫేమస్ అయిన ఈ స్వీట్ ఇప్పుడు మన దగ్గర కూడా తెగ ట్రెండ్ అవుతోంది. బయట సాఫ్ట్‌గా, కాస్త సాగే గుణంతో ఉండే బియ్యం పిండి పొర.. దాన్ని కొరకగానే లోపలి నుంచి నోట్లో కరిగిపోయే చల్లచల్లని ఐస్‌క్రీమ్. ఆ కాంబినేషనే అద్భుతంగా ఉంటుంది.

విచిత్రం ఏంటంటే.. ఇంత స్పెషల్ డిష్‌ను రెస్టారెంట్లలో కాస్ట్లీగా పెట్టి కొనాల్సిన పనే లేదు. ఇంట్లో ఉండే నాలుగంటే నాలుగు పదార్థాలతో చాలా ఈజీగా, శుభ్రంగా తయారు చేసుకోవచ్చు. సాయంత్రం పూట పిల్లలకి డిఫరెంట్‌గా ఏదైనా చేసివ్వాలన్నా, లేక వాతావరణం వేడిగా ఉన్నప్పుడు నోటికి చల్లగా, తీపిగా ఏదైనా తినాలనిపించినా ఈ మోచి ఐస్‌క్రీమ్ పర్ఫెక్ట్ ఛాయిస్. మరి ఈ సూపర్ టేస్టీ డెజర్ట్‌ను ఇంట్లోనే పర్ఫెక్ట్‌గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామా..

కావాల్సిన పదార్థాలు:

Advertisement

జిగట బియ్యం పిండి (గ్లూటినస్ రైస్ ఫ్లోర్ / మోచికో) – ఒక కప్పు
చక్కెర – అర కప్పు
నీళ్లు – ముప్పావు కప్పు
కార్న్ ఫ్లోర్ (లేదా పొడి బియ్యం పిండి) – అర కప్పు
మీకు ఇష్టమైన ఐస్‌క్రీమ్ (వనీలా లేదా స్ట్రాబెర్రీ) – 8 స్కూప్‌లు
ఫుడ్ కలర్ – రెండు చుక్కలు (మీకు కావలసిన రంగు)

Also Read: రోజుకు ఎన్ని లవంగాలు తింటే సేఫ్? ఈ తప్పు చేస్తే రక్తం పలచబడి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లొచ్చు!

మోచీ ఐస్‌క్రీమ్ తయారీ విధానం:

Advertisement

ఒక బౌల్‌లో మీకు నచ్చిన ఐస్‌క్రీమ్‌ను 8 చిన్న ఉండలుగా స్కూప్ చేసి, ఒక ప్లేట్‌లో ఉంచి ఫ్రీజర్‌లో కనీసం రెండు గంటల పాటు గట్టిగా అయ్యేలా ఉంచాలి.

ఇప్పుడు ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్‌లో జిగట బియ్యం పిండి, చక్కెర, నీళ్లు వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఇందులో మీకు నచ్చిన ఫుడ్ కలర్ కూడా వేసి కలిపి, ప్లాస్టిక్ ర్యాప్‌తో కప్పి ఒక నిమిషం పాటు మైక్రోవేవ్‌లో ఉడికించాలి. మైక్రోవేవ్ లేకపోతే స్టీమింగ్‌లో 10 నిమిషాలు ఉడికించుకోవచ్చు.

ఆ తర్వాత బౌల్‌ బయటకు తీసి ఒకసారి బాగా కలిపి, మళ్లీ మరో నిమిషం పాటు మైక్రోవేవ్ చేయాలి. పిండి బాగా ఉడికి జెల్ లాగా, జిగటగా మారుతుంది.

ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ లేదా ట్రేపై కార్న్ ఫ్లోర్ బాగా చల్లుకోవాలి. ఉడికించిన వేడి బియ్యం పిండి ముద్దను దానిపై వేసి, పైన కూడా కాస్త కార్న్ ఫ్లోర్ చల్లాలి. పిండి చేతులకు అంటుకోకుండా ఉండటానికి ఈ కార్న్ ఫ్లోర్ సహాయపడుతుంది. చపాతీ కర్రతో ఆ పిండిని పల్చగా ఒత్తుకోవాలి.

ఈ ఒత్తుకున్న పిండిని ఫ్రిజ్‌లో 15 నిమిషాల పాటు ఉంచి చల్లార్చాలి. ఆ తర్వాత దానిని బయటకు తీసి, ఒక రౌండ్ కట్టర్ లేదా గ్లాస్ సహాయంతో చిన్న చిన్న గుండ్రటి బిళ్ళలుగా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఫ్రీజర్ నుంచి ముందే సిద్ధం చేసుకున్న ఐస్‌క్రీమ్ ఉండలను బయటకు తీయాలి. ఒక్కో బియ్యం పిండి బిళ్ల మధ్యలో ఒక ఐస్‌క్రీమ్ ఉండను ఉంచి, చుట్టూ ఉన్న పిండి అంచులను దగ్గరకు లాగుతూ ఐస్‌క్రీమ్ బయటకు రాకుండా పూర్తిగా మూసివేయాలి.

ఇలా సిద్ధం చేసుకున్న మోచి ఐస్‌క్రీమ్‌లను ప్లాస్టిక్ ర్యాప్‌లో చుట్టి, మళ్లీ ఒక గంట పాటు ఫ్రీజర్‌లో ఉంచాలి. అంతే.. యమ్మీ యమ్మీగా అనిపించే చల్లని మోచి ఐస్‌క్రీమ్ సిద్ధమైనట్లే. ఫ్రీజర్ నుంచి తీసిన రెండు నిమిషాల తర్వాత తింటే దీని అసలు రుచి తెలుస్తుంది.

Also Read: సింపుల్‌గా హైదరాబాదీ రాయల్ మటన్ మరగ్.. ఇంటికొచ్చిన అతిథులు ముగ్దులైపోవాల్సిందే!

Tags

Related News

బండ్ల మీద దొరికే పెసర పునుగుల సీక్రెట్ ఇదే..స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ ఇక మీ ఇంట్లోనే!

సొరకాయ పచ్చి కారం కూర ఇలా చేస్తే..ఒక్క ముద్ద కూడా వదలరు!

సింపుల్‌గా హైదరాబాదీ రాయల్ మటన్ మరగ్.. ఇంటికొచ్చిన అతిథులు ముగ్దులైపోవాల్సిందే!

డిప్రెషన్, స్ట్రెస్ లేకుండా ప్రశాంతమైన జీవితం కావాలా? ఈ 5 జపాన్ టెక్నిక్స్ మీ కోసమే

రోజూ తెల్లవారుజామున 3 గంటలకే మెలకువ వచ్చేస్తోందా? మీ శరీరం ఏం చెబుతోందంటే!

రోజుకు ఎన్ని లవంగాలు తింటే సేఫ్? ఈ తప్పు చేస్తే రక్తం పలచబడి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లొచ్చు!

జిమ్‌లో బట్టలు మార్చుకుంటున్నారా? మహిళలు తప్పనిసరిగా ఈ 5 జాగ్రత్తలు పాటించాలి

Big Stories

Advertisement
×