E-Paper
Advertisement

రైలు టికెట్ రంధ్రాల వెనుక ఇంత కథ ఉందా? చాలామందికి తెలియని ఆసక్తికర నిజం!

రైలు టికెట్ రంధ్రాల వెనుక ఇంత కథ ఉందా? చాలామందికి తెలియని ఆసక్తికర నిజం!
Advertisement

Railway Tickets: ఆన్‌లైన్ బుకింగ్‌లు, ఈ-టికెట్లు లేని రోజుల్లో కోట్ల మంది భారతీయులు కాగితపు రైల్వే టికెట్లతోనే ప్రయాణం చేసేవారు. ఆనాటి పాత టికెట్లను గమనిస్తే వాటి అంచుల వెంబడి చిన్న చిన్న రంధ్రాలు వరుసగా ఉండటం గుర్తుండే ఉంటుంది. చాలామంది ఇవి అలంకరణ కోసమో, టికెట్‌ను సులభంగా చింపడానికి ఇచ్చారేమో అనుకునేవారు. కానీ ఆ రంధ్రాల వెనుక ఒక ఆసక్తికరమైన సాంకేతిక రహస్యం దాగి ఉంది. అదేంటో ఈ కథనంలో చూద్దాం.

డాట్ మ్యాట్రిక్స్ మ్యాజిక్

కంప్యూటర్లు, అత్యాధునిక ప్రింటర్లు లేని రోజుల్లో లక్షలాది మంది ప్రయాణికుల కోసం రైల్వే టికెట్లు ముద్రించడం పెద్ద సవాల్‌ గా ఉండేది. ఆ రోజుల్లో ఇండియన్ రైల్వేస్ పూర్తిగా డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్లపైనే ఆధారపడేది. కాగితంపై గట్టిగా కొడుతూ ముద్రించే ఈ ప్రింటర్లు అప్పట్లో ప్రత్యేకమైన శబ్దం చేస్తూ పనిచేసేవి.

స్ప్రాకెట్ రంధ్రాల పాత్ర

Advertisement

పాతకాలపు మ్యాట్రిక్స్ ప్రింటర్లలో ఇప్పటిలాగా విడివిడి కాగితపు షీట్లను ఉపయోగించేవారు కాదు. పొడవుగా ఉండే కాగితపు రోల్స్‌ను నేరుగా యంత్రంలోకి ఎక్కించేవారు. ప్రింటింగ్ జరిగే సమయంలో కాగితం ఇరువైపులా ఉన్న ఆ చిన్న రంధ్రాలలోకి ప్రింటర్ లోపలి చిన్న పళ్ల చక్రాలు సరిగ్గా లాక్ అయ్యేవి. ఈ ప్రత్యేక రంధ్రాలను ‘స్ప్రాకెట్ హోల్స్’ అంటారు.

కచ్చితమైన అలైన్‌మెంట్ కోసం..

సాధారణంగా ప్రతీ రైల్వే టికెట్‌పై రైలు నంబరు, ప్రయాణ తేదీ, స్టేషన్ పేర్లు, ఛార్జీ, సీటు వివరాలు వంటి అత్యంత కీలకమైన సమాచారం ముద్రించాల్సి ఉంటుంది. ప్రింటింగ్ సమయంలో పేపర్ కాస్త పక్కకు జరిగిన సమాచారం తప్పుగా ప్రింట్ అయ్యే ప్రమాదం ఉండేది. దీనివల్ల ప్రయాణికులకు, టికెట్ కలెక్టర్లకు తీవ్ర గందరగోళం ఏర్పడవచ్చు. కాబట్టి ఈ స్ప్రాకెట్ రంధ్రాలు కాగితాన్ని ఏమాత్రం పక్కకు జరగకుండా వేగంగా ముందుకు కదిలేలా చేసి ఎర్రర్స్ రాకుండా కాపాడేవి.

థర్మల్ ప్రింటర్లు రాకతో..

Advertisement

సాంకేతికత వేగంగా మారుతున్న కొద్దీ భారతీయ రైల్వే కూడా ఆ శబ్దం చేసే డాట్-మ్యాట్రిక్స్ ప్రింటర్లకు స్వస్తి చెప్పింది. వాటి స్థానంలో మరింత వేగవంతమైన, నిశ్శబ్దంగా పనిచేసే థర్మల్ ప్రింటర్లను తీసుకొచ్చింది. ఈ ఆధునిక ప్రింటర్లలో కాగితాన్ని ముందుకు జరపడానికి ప్రత్యేక రోలర్ విధానాన్ని వాడారు. దీంతో ఆ పాత స్ప్రాకెట్ రంధ్రాలు, పళ్ల చక్రాల అవసరం పూర్తిగా తొలగిపోయింది.

Also Read: ఆగమైతున్న హైదరాబాద్.. నిరసన పేరిట వేల లీటర్ల నీరు వృథా.. రగిలిపోతున్న ప్రజలు!

కనుమరుగవుతున్న జ్ఞాపకం

ప్రస్తుతం ప్రయాణికులందరూ దాదాపుగా ఆన్‌లైన్‌లోనే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ప్రయాణ సమయంలో స్మార్ట్‌ఫోన్‌లో ఈ-టికెట్ లేదా పీఎన్ఆర్ (PNR) నంబర్‌ను చూపిస్తున్నారు. అలా డిజిటల్ టికెటింగ్ రాకతో పేపర్ టికెట్లు కనుమరుగయ్యాయి. ఒకానొక సమయంలో భారతీయ రైల్వే వ్యవస్థను దశాబ్దాల పాటు నడిపించిన ఆ చిన్న రంధ్రాలు.. ఇప్పుడు జ్ఞాపకాల్లో మాత్రమే మిగిలిపోయాయి.

Also Read: ట్రిప్‌కి వెళ్లి గాల్లో కలిసిపోయింది… 20 ఏళ్లైనా కూతురి కోసం ఆగని తల్లి పోరాటం… చూస్తే కన్నీళ్లు ఆగవు ​

Tags

Related News

తనకు ఎవరూలేరని బాధపడిన వరుడు.. పెళ్లికి 10 వేల మంది అతిథులు సర్‌ప్రైజ్!

రైళ్లలో స్లీపర్ కోచ్ ప్రయాణికులకు షాక్.. హైకోర్టు సంచలన తీర్పు!

ఈశాన్య భారతానికి బుల్లెట్ రైలు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్!

భారత్-పాక్ సరిహద్దులో రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు.. పలు రైళ్లు రద్దు!

జస్ట్ 100 మీటర్ల లింక్ రోడ్డు కోసం.. రోడ్డెక్కిన నల్లగొండ మాజీ ఎమ్మెల్యే!

ఆకాశం నుంచి మాంసం ముక్కల వాన.. భయంతో జనాలు పరుగులు, ఎక్కడంటే?

రైలులో దొంగల బీభత్సం.. ఏకంగా ఫస్ట్ ఏసీ కోచ్‌లోనే చోరీ.. రూ.2.5 లక్షల బంగారం మాయం!

Big Stories

Advertisement
×