సంగీత ప్రియులు ప్రపంచంలో ఎక్కువగా ఉన్నారు. వారు ఏదో ఒకటి వినడానికి ఆసక్తిగా ఉంటారు. కొత్త సినిమా పాటలు, సినిమాలు ఇలా హెడ్ ఫోన్లో లేదా స్పీకర్ లోనే పెట్టుకొని ఎంజాయ్ చేస్తారు. అయితే స్పీకర్లు లేదా హెడ్ ఫోన్లు… ఈ రెండిట్లో ఏది వాడడం చెవులకు ఎక్కువ ప్రమాదకరమో తెలుసుకుందాం.
హెడ్ ఫోన్లు, స్పీకర్లు… రెండూ వాటి వాటి ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. అయితే సరిగా ఉపయోగించకపోతే మాత్రమే ఈ రెండింటితోనూ ప్రమాదమే. చెవులకు సురక్షితమైన శబ్దం వరకు వీటితో వినవచ్చు. లేకపోతే సమస్యలు మొదలవుతాయి.
ఏది ఎక్కువ హానికరం?
హెడ్ ఫోన్లు లేదా స్పీకర్లు అనే విషయానికి వస్తే చెవిని దెబ్బతీసేవి హెడ్ ఫోన్లే. ఎందుకంటే అవి ధ్వని నేను నేరుగా చెవుల్లోకి పంపిస్తాయి. అధిక వాల్యూమ్ పెట్టుకుంటే ఆ శబ్దం నేరుగా చెవుల్లో మారు మోగిపోతుంది. దీర్ఘకాలం పాటు ఇలా వాడితే చెవి అలసిపోతుంది. వినికిడి లోపం వస్తుంది. టిన్నిటస్ వంటి సమస్యలు వస్తాయి. ఈ టిన్నిటస్ సమస్య చెవుల్లో శబ్దాలు నిరంతరం వినిపించేలా చేస్తుంది.
ఒక అధ్యయనంలో మూడు గంటలకు పైగా హెడ్ ఫోన్లు పెట్టుకొని వినే వారిలో టిన్నిటస్ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ఇక స్పీకర్లు అయితే అవి కేవలం చెవిలోకి కాదు.. ఆ గది అంతటా ధ్వని పంపిణీ చేస్తాయి. అంటే మన చెవులకు తక్కువ తీవ్రత చేరుతుంది. కాబట్టి స్పీకర్ కొంతవరకు వాడడం ఆరోగ్యకరం. అయితే ఎక్కువ వాల్యూమ్‌తో స్పీకర్లను పెట్టుకుంటే అవి ఇంకా ప్రమాదకరం. ముఖ్యంగా మూసివేసిన గదుల్లో స్పీకర్ పెట్టుకుంటే ఆ శబ్దాలు విపరీతంగా చెవులను ఇబ్బంది పెడతాయి.
హెడ్ ఫోన్లు వాడడం వల్ల కేవలం వాటిని పెట్టుకున్న వ్యక్తి మాత్రమే ఇబ్బంది పడతాడు. అదే స్పీకర్లు అయితే ఆ గదిలో ఉన్న వారు బయట వారు కూడా ఇబ్బంది పడతారు. హెడ్ ఫోన్లు గాని స్పీకర్లు గాని అధిక వాల్యూమ్ పెట్టుకొని వింటే చెవి ఇన్ఫెక్షన్లు, ఒత్తిడి పెరగడం, వినికిడి దెబ్బ తినడం వంటి సమస్యలు వస్తాయి.
Also Read: రోజులో ఒక పూటే భోజనం చేస్తే ఏమవుతుంది? బరువు తగ్గుతారా? ఆరోగ్యం చెడిపోతుందా?
మీరు హెడ్ ఫోన్లనే ఉపయోగించుకోవాలనుకుంటే 60 నిమిషాల కంటే ఎక్కువ సేపు నిరంతరం వినియోగించవద్దు. దీర్ఘకాలికంగా ఈ హెడ్ ఫోన్లను ఉపయోగించడం వల్ల వినికిడి పరంగా ఒత్తిడి పడుతుంది.
వినికిడి లోపం వచ్చిందంటే తిరిగి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి హెడ్ ఫోన్లు, స్పీకర్లు వాడకుండా ఉండడం ఉత్తమం. దీర్ఘకాలికంగా వీటిని వాడడం వల్ల ఎక్కువమంది వినికిడి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.